బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ వెర్షన్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి లగ్జరీ సెడాన్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతుంది.

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి లగ్జరీ సెడాన్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతుంది. అవి, లగ్జరీ లైన్ మరియు ఎమ్-స్పోర్ట్.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ లగ్జరీ లైన్ ధర రూ. 66.50 లక్షలు మరియు ఎమ్-స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 73.70 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జీటీ ఇప్పుడు పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి పెట్రోల్ వెర్షన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో లాంచ్ చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

డీజల్ వెర్షన్ 6-సిరీస్ జిటి దేశవ్యాప్తంగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా 630డి జిటి కారును చెన్నై ప్లాంటులో అసెంబుల్ చేస్తోంది. ఈ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా లైనప్‌లో ఉన్న5-సిరీస్ స్థానాన్ని భర్తీ చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి సెడాన్‌ను విభిన్న కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు. ప్రధానంగా, మినరల్ వైట్, గ్లేజియర్ సిల్వర్, మెడిటెర్రేనియన్ బ్లూ మరియు రాయల్ బర్గుండి రెడ్. అంతే కాకుండా, రెండు విభిన్న మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లలో కూడా లభ్యమవుతోంది. కార్బన్ బ్లాక్ మరియు బ్లూస్టోన్ మెటాలిక్ పెయింట్ స్కీమ్స్ కేవలం ఎమ్-స్పోర్ట్ వేరియంట్లో మాత్రమే ఎంచుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి లగ్జరీ లైన్ వేరియంట్లో పలు క్రోమ్ స్టైలింగ్స్ ఉన్నాయి. సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, ఫ్రంట్ బంపర్, రియర్ ఏప్రాన్ మరియు టెయిల్ పైప్ మీద క్రోమ్ సొబగులు గుర్తించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

ఎమ్-స్పోర్ట్ వేరియంట్ స్పోర్టీ పర్ఫామెన్స్ ప్యాకేజీలో లభ్యమవుతోంది. ఈ ప్యాకేజీ ద్వారా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన సైడ్ స్కర్ట్స్, రియర్ ఏప్రాన్, విశాలమైన ఫ్రంట్ ఎయిర్ ఇంటేకర్ మరియు ఎమ్-స్పోర్ట్ బ్రేకులు ఉన్నాయి. అదనంగా, కారు లోపల, డోర్ హ్యాండిల్స్, కార్ కీ మరియు అల్లాయ్ వీల్స్ మీద M - లోగోను చూడవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

6-సిరీస్ జిటి లగ్జరీ లైన్ వేరియంట్ ఇంటీరియర్‌లో రెండు భాగాలుగా ఉన్న ప్యానొరమిక్ గ్లాస్ రూఫ్, ఎలక్ట్రికల్‍‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రియర్ సీట్లు, సౌకర్యవంతమైన కుషనింగ్ గల హెడ్ రెస్ట్, రియర్ విండోలకు సన్ బ్లైండ్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి లగ్జరీ లైన్‌లోని ఇతర ఇంటీరియర్ ఫీచర్లలో ఆంబియంట్ లైటింగ్, ఎంచుకోదగిన ఆరు రకాల లైట్ డిజైన్స్, ఫైన్ వుడ్ ఇంటీరియర్స్, మరియు పర్ల్ క్రోమ్ ఫినిషింగ్ గల ఇంటీరియర్ డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

ఎమ్-స్పోర్ట్ వేరియంట్ ఇంటీరియర్‌లో నప్పా లెథర్ అప్‌హోల్‌స్ట్రే, డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం అత్యంత సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి, మెమొరీ ఫంక్షన్ మరియు కాళ్లకు సపోర్ట్ అందివ్వడం వీటి ప్రత్యేకత.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి రెండు వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభించే ఫీచర్లలో 10.25-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిర్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 10.2-అంగుళాల పరిమాణంలో ఉన్న కలర్ స్క్రీన్ డిస్ల్పేలు, బిఎమ్‌డబ్ల్యూ న్యావిగేషన్, బిఎమ్‌డబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ మరియు హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎమ్-స్పోర్ట్ వేరియంట్లో అదనంగా ఫుల్-కలర్ ప్రొజెక్షన్ హెడ్స్-అప్ డిస్ల్పే ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి లగ్జరీ సెడాన్‌లో పార్క్ అసిస్ట్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, సరౌండ్ వ్యూవ్ కెమెరా, రిమోట్ కంట్రోల్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, సరౌండ్ వ్యూవ్ ఆఫ్ ది కార్ మరియు కారు చుట్టు ప్రక్కల ట్రాఫిక్ పరిస్థితులను త్రీడీ ఇమేజ్ ద్వారా చూపిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

అంతే కాకుండా, ఆరు ఎయిర్ బ్యాగులు, బ్రేక్ అసిస్ట్ గల యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రన్-ఫ్లాట్ టైర్లు, క్రాష్ సెన్సార్లు, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 630డి జిటి రెండు వేరియంట్లలో ట్విన్ పవర్ టుర్భో 3.0-లీటర్ ఆరు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 265బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ గ్రాన్ టురిస్మో డీజల్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ దిగ్గజ లగ్జరీ కార్ల కంపెనీలలో ఒకటైన బిఎమ్‍‌‌‌డబ్ల్యూ ఇండియాతో పాటు ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ మోడళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అయితే, ఇండియన్ మార్కెట్లోకి డీజల్ కార్ల ప్రియులు అధికంగా ఉండటంతో, ఆటో ఎక్స్‌ పోలో పెట్రోల్ వెర్షన్ ప్రవేశపెట్టిన అనంతరం ఇప్పుడు డీజల్ వెర్షన్ 6-సిరీస్ జిటి కారును లాంచ్ చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి దేశీయ విపణిలో లాంగ్ వీల్ బేస్ గల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ మోడల్‌కు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: BMW 6-Series GT Diesel Launched In India; Prices Start At Rs 66.50 Lakh
Story first published: Friday, June 22, 2018, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X