బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

Written By:

ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో ఫిబ్రవరి 07, 2018 న బిఎమ్‌డబ్ల్యూ మొట్టమొదటిసారిగా 6 సిరీస్ జిటి(BMW Launches 6 Series GT) లాంచ్ చేసిన అనంతరం, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా బెంగళూరు వేదికగా 6-సిరీస్ లగ్జరీ సెడాన్ కారును ప్రవేశపెట్టింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి ప్రారంభ ధర రూ. 58.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

Recommended Video - Watch Now!
2018 Audi Q5 Launched In India; Prices Start At Rs 53.25 Lakh
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సమక్షంలో సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్‌ను ఆవిష్కరించింది. బెంగళూరులో జరిపిన ప్రత్యేక లాంచ్‌లో లైవ్ ఆర్కెస్ట్రా మధ్య జరిగిన ఈవెంట్లో బిఎమ్‌డబ్ల్యూ తమదైన శైలిలో 6 సిరీస్ జిటి లగ్జరీ సెడాన్‌ను లాంచ్ చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

6 సిరీస్ జిటి కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే విడుదలయ్యింది - అది, 630ఐ. జర్మన్ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ తమ 5-సిరీస్ జిటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఇండియన్ లైనప్‌లోకి ప్రవేశపెట్టింది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి డిజైన్

డిజైన్ పరంగా, సరికొత్త 6 సిరీస్ జిటి కారును 5-సిరీస్ ఆధారంగానే రూపొందించారు. అడాప్టివ్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఇతర డిజైన్ అంశాలను 5-సిరీస్ సెడాన్ నుండి సేకరించారు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

టాప్ నుండి రియర్ డిజైన్‌లో చివరి అంచు వరకు పొడగించబడి ఉన్న ఫ్లోటింగ్ రూఫ్ టాప్ జిటి ఓవరాల్ డిజైన్‌ను కంప్లీట్‌గా మార్చేసింది. అధునాతన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఇప్పుడు కూపే డిజైన్ శైలిలో కూడా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఇంటీరియర్

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ ఇంటీరియర్‌ మొత్తం లెథర్ అప్‌హోల్‌స్ట్రేతో డెకరేట్ చేశారు. డ్యాష్‌బోర్డ్ మీద 10.25-అంగుళాల పరిమాణం గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇన్ఫో‌టైన్‌మెంట్ అవసరాలన్నింటినీ తీర్చే గెస్ట్చర్ కంట్రోల్ ఇందులో ప్రత్యేకం. సౌండ్ సిస్టమ్ కోసం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను 1,400వాట్, 16-స్పీకర్ల బౌవర్స్ అండ్ విల్కిన్స్ డైమండ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‍కు అనుసంధానం చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 630ఐ జిటి కారులో హెడ్స్-అప్ డిస్ల్పే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఇడి మూడ్ లైటింగ్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఇంజన్

సాంకేతికంగా, బిఎమ్‌డబ్ల్యూ 630ఐ జిటి లగ్జరీ సెడాన్‌లో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 5,000-6,5000ఆర్‌పిఎమ్ మధ్య 254బిహెచ్‍‌పి పవర్ మరియు 1,550-4,400ఆర్‌పిఎమ్ మధ్య 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

6 సిరీస్ జిటి పర్ఫామెన్స్

6 సిరీస్ జిటి లోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది. 6 సిరీస్ జిటి కేవలం 6.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిమీలుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి పొడవు 5,091ఎమ్ఎమ్, వెడల్పు 1,902ఎమ్ఎమ్, ఎత్తు 1,538ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 3,070ఎమ్ఎమ్‌గా ఉంది. ఢిక్కీలో స్టోరేజ్ స్పేస్ 600 లీటర్ల వరకు ఉంది, అవసరాన్ని బట్టి 1800లీటర్ల వరకు పెంచుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 630ఐ జిటి విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ లాంగ్ బేస్ వేరియంట్‌కు గట్టి పోటీనిస్తుంది. 6 సిరీస్ జిటి బిఎమ్‌డబ్ల్యూ ఇండియా లైనప్‌లో ఒక విభిన్నమైన స్థానంలో నిలిచింది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

5-సిరీస్ కంటే అత్యాధునిక స్టైలింగ్, కంఫర్ట్ మరియు సేఫ్టీ అంశాల జోడింపుతో వచ్చిన 6 సిరీస్ జిటి లగ్జరీ సెడాన్ విభిన్నమైన పర్ఫామెన్స్ కార్లను కోరుకునే ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. కూపే తరహా డిజైన్ ఇందులో మరో హైలెట్ అని చెప్పాలి.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

విపణిలోకి ఈ మోడల్ తీసుకొస్తే భారత్‌లో మారుతికి తిరుగే ఉండదు

2018 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో మారుతి స్విఫ్ట్: టాప్ 3 కార్లు ఇవే!!

మహీంద్రా కెయువి100 ట్యాక్సీ వెర్షన్: విడుదల, ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

English summary
Read In Telugu: BMW Launches 6 Series GT In Bangalore At A Price Of 58.90 Lakh
Story first published: Thursday, March 8, 2018, 12:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark