బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల: ధర రూ. 61.80 లక్షలు

జర్మన్ దిగ్గజం ఇప్పుడు, 6-సిరీస్ పెట్రోల్ వెర్షన్‌లో లగ్జరీ లైన్ అనే మరో వేరియంట్‌ను లాంచ్ చేసింది. సరకొత్త బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి లగ్జరీ లైన్ వేరియంట్ ధర రూ. 61.80 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పోలో 6-సిరీస్ జిటి పెట్రోల్ మోడల్‌ను విడుదల చేసింది. అయితే, స్పోర్ట్స్ లైన్ అనే సింగల్ వేరియంట్లో మాత్రమే లాంచ్ చేసింది.

జర్మన్ దిగ్గజం ఇప్పుడు, 6-సిరీస్ పెట్రోల్ వెర్షన్‌లో లగ్జరీ లైన్ అనే మరో వేరియంట్‌ను లాంచ్ చేసింది. సరకొత్త బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి లగ్జరీ లైన్ వేరియంట్ ధర రూ. 61.80 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. దీని విడుదలతో బిఎమ్‍‌డబ్ల్యూ 6-సిరీస్ లగ్జరీ లైన్ మరియు స్పోర్ట్స్ లైన్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల

అంతే కాకుండా, సరిగ్గా రెండు రోజులు క్రితం బిఎమ్‌‌డబ్ల్యూ ఇటీవల 6-సిరీస్ జిటి లగ్జరీ సెడాన్ కారును డీజల్ వెర్షన్‌లో లగ్జరీ లైన్ మరియు ఎమ్-స్పోర్ట్ వేరియంట్లలో లాంచ్ చేసింది. అంటే 6-సిరీస్ గ్రాన్ టురిస్మో (జిటి) ఇప్పుడు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల

6-సిరీస్ గ్రాన్ టురిస్మో లగ్జరీ లైన్ పెట్రోల్ వేరియంట్ జూలై 2018 నుండి లభిస్తుంది. ఇతర వేరియంట్లతో డిజైన్ పరంగా ఎలాంటి మార్పుల చోటు చేసుకోలేదు. ఎక్ట్సీరియర్‌లో ఆకర్షణీయమైన క్రోమ్ సొబగులు చూడవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి ఇంటీరియర్‌ విశాలమైన అనుభూతిని ఇస్తుంది. టు-పార్ట్ సన్‌రూఫ్, కంఫర్ట్ కుషనింగ్ గల హెడ్‌రెస్ట్ మరియు ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రియర్ విండో బ్లైండ్ ఫోల్డ్స్ ఉన్నాయి. లగ్జరీ లైన్ వేరియంట్లో ఫైన్ వుడ్ ఇంటీరియర్‌ ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ జిటి సెడాన్‌లో ఉన్న ఇతర ముఖ్యమైన ఫీచర్లలో మల్టీ ఫంక్షన్ ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, టచ్ కంట్రోల్, బిఎమ్‌డబ్ల్యూ అప్లికేషన్స్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, వెనుక సీటు ప్యాసింజర్ల కోసం 10.2-అంగుళాల పరిమాణంలో ఉన్న రెండు డిస్ల్పేలు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల

సేఫ్టీ పరంగా 6-సిరీస్ సెడాన్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రన్-ఫ్లాట్ టైర్లు, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ మరియు డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి పెట్రోల్ వేరియంట్లో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇంజన్ 258బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 6.3 సెకండ్ల వ్యవధిలోనే 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 630ఐ లగ్జరీ లైన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ ఈ ఏడాది ప్రారంభంలో 6-సిరీస్ జిటి సెడాన్ కారును పెట్రోల్ ఆప్షన్లో కేవలం స్పోర్ట్స్ లైన్ వేరియంట్లో మాత్రమే లాంచ్ చేసింది, రెండు రోజుల క్రితం డీజల్ వెర్షన్‌ను 6-సిరీస్ జిటి సెడాన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. తాజాగా, లగ్జరీ లైన్ అనే పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసి మొత్తం నాలుగు విభిన్న వేరియంట్లలో విక్రయాలకు అందుబాటులో ఉంచింది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ మునుపటి 5-సిరీస్ స్థానాన్ని భర్తీ చేస్తుంది మరియు ఇది విపణిలో ఉన్న లాంగ్ వీల్ బేస్ మెర్సిడెస్ ఇ-క్లాస్ లగ్జరీ సెడాన్‌కు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 23, 2018, 18:38 [IST]
English summary
Read In Telugu: BMW 630i GT Luxury Line launched In India; Priced At Rs 61.80 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+