విపణిలోకి బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల: ధర రూ. 49.99 లక్షలు

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విపణిలోకి సరికొత్త 2018 ఎక్స్3 లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 2018 బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రారంభ వేరియంట్ ధర రూ. 49.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

నూతన హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్ డిజైన్లు మరియు ఆకర్షణీయమైన బిఎమ్‌డబ్ల్యూ కిడ్నీ గ్రిల్ వంటి జోడింపుతో మునుపటి తరం ఎక్స్3 ఇంటీరియర్‌తో పోల్చుకుంటే కొత్త తరం ఎక్స్3 చూడటానికి దాదాపు కొత్తగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీని మొదటిసారిగా 2003లో పరిచయం చేసింది. ఇప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల యూనిట్లకు పైగా ఎక్స్3 కార్లను బిఎమ్‌డబ్ల్యూ విక్రయించింది. ఇండియన్ మార్కెట్లో కూడా ప్రీమియం మిడ్-సెగ్మెంట్ ఎస్‌యూవీ విభాగంలో ఎక్స్3 మంచి ఫలితాలు కనబరుస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

వేరియంట్లు మరియు ధరల వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఎక్స్‌డ్రైవ్ 20డి ఎక్స్‌పెడిషన్ మరియు ఎక్స్‌డ్రైవ్ 20డి లగ్జరీ లైన్. ఈ రెండు వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా క్రింది పట్టికలో...

Variant Price
xDrive 20d Expedition Rs 49.99 Lakh
xDrive 20d Luxury Line Rs 56.70 Lakh
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

డిజైన్ మరియు స్టైలింగ్

మొదట్లో దీనిని చూడగానే అందరూ బోల్తాపడేది ఎక్స్5 అనుకోవడం. అవును కొలతల పరంగా ఇది కాస్త అటు ఇటుగా ఎక్స్5ను పోలి ఉంటుంది. రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, మరియు వెహికల్ యొక్క ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచే ఆటో క్లోజింగ్ స్లాట్లు గల పెద్ద పరిమాణంలో ఉన్న కిడ్నీ గ్రిల్ ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

పెద్ద పరిమాణంలో ఉన్న 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ నుండి ఆప్షనల్‌గా 21-అంగుళాల వరకు ఉన్న పలు రకాల వీల్స్ ఎంచుకోవచ్చు. పాత వెర్షన్‌తో పోల్చితే, 2018 ఎక్స్3 సైడ్ ప్రొఫైల్ మరింత స్మార్ట్‌గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

రియర్ డిజైన్‌లో సరికొత్త రూఫ్ స్పాయిలర్, రెండు టెయిల్ పైపులు మరియు రీడిజైన్ చేయబడిన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

ఇంటీరియర్ మరియు ఫీచర్లు

బిఎమ్‍డబ్ల్యూ ఎక్స్3 ఇంటీరియర్‌లో గెస్చర్ కంట్రోల్ ఫీచర్ గల 10.25-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. డ్యాష్ బోర్డ్ చూడటానికి అచ్చం బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌నే పోలి ఉంటుంది. అదే విధంగా డ్యాష్ బోర్డుకి పైభాగంలో స్క్రీన్ అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయగల ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లను స్టాండర్డ్‌గా వచ్చాయి. రోటరీ ఐడ్రైవ్ కంట్రోలర్ ద్వారా స్క్రీన్‌ను నియంత్రించవచ్చు. ఇంటీరియర్ ఇప్పుడు అత్యంత విశాలంగా ఉంది. ఇందుకు కారణమైన 60ఎమ్ఎమ్ వరకు పెరిగిన వీల్‌బేస్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

క్వాలిటీ లెవల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. కొన్ని అంశాల పరంగా బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 7-సిరీస్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

పర్ఫామెన్స్ మరియు స్పెసిఫికేషన్స్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3ని సాంకేతికంగా రెండు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. ఇందులో 1,995సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బో-డీజల్ ఇంజన్ గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి జడ్ఎఫ్ సంస్థ నుండి సేకేరించిన 8-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ట్రాన్స్‌‌మిషన్ అనుసంధానం కలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

ఈ 2-లీటర్ డీజల్ ఇంజన్ కేవలం 8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 213కిలోమీటర్లుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు అందుతుంది. అవసరాన్ని బట్టి ఏయే చక్రానికి ఎంత పవర్ కావాల్సి వస్తుందో... అంతే పవర్‌ను సరఫరా చేస్తుంది. ఇది, వాహనం వెల్లే వివిధ రకాల భూబాగాల ఆధారంగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

సేఫ్టీ ఫీచర్లు

తేలికపాటి అల్యూమినియం విడి భాగాలతో నిర్మించిన సస్పెన్షన్ సిస్టమ్ ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్ అయ్యింది. అంతే కాకుండా, చివరికి బ్రేక్ కాలిపర్లను కూడా అల్యూమినియంతో తయారు చేశారు. దీంతో మొత్తం బరువులో 55కిలోల వరకు తగ్గింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ముందు వైపున డబుల్-జాయింట్ స్ప్రింగ్ స్ట్రట్స్ మరియు వెనుక వైపున 5-లింక్ యాక్సిల్ కలదు. తేలికపాటి యాంటీ-రోల్ బార్స్ ఉండటంతో అత్యంత మృదువుగా ఎక్స్‌3 ను డ్రైవ్ చేయవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3లో ప్రయాణికుల భద్రత పరంగా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అందులో, ఎలక్ట్రానిక్ స్టెబిలి సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

వెనుక వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం వ్యక్తిగత క్లైమేట్ కంట్రోల్ ఉంది. వెనుక వరుస సీట్లను 40:20:40 నిష్పత్తిలో మడిపేయవచ్చు. దీంతో సాధారణంగా ఉన్న లగేజ్ స్పేస్ మరింత పెంచుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 బూట్ స్పేస్ 550-లీటర్ల వరకు ఉంది. మరియు స్పేస్ సేవ్ చేసుకునేందుకు స్పేర్ వీల్‌ను ఢిక్కీలోని కార్పెట్ క్రింద అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 భారతదేశపు మోస్ట్ పాపులర్ లగ్జరీ కార్లలో ఒకటి. ప్రత్యేకించి రూ. 50 లక్షల ధరల శ్రేణిలో లగ్జరీ సెడాన్ కాకుండా, లగ్జరీ ఎస్‌యూవీని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. తాజాగా జరిగిన అప్‌డేట్స్‌తో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, ఆడి క్యూ5, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు వోల్వో ఎక్స్‌సి 60 లగ్జరీ ఎస్‌యూవీలకు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

స్పోర్టివ్ మరియు డ్రైవింగ్ ఫోకస్ గల సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన లగ్జరీ ఎస్‌యూవీ కోసం చూస్తున్నట్లయితే, బిఎమ‌డబ్ల్యూ ఎక్స్3 ఒక మంచి ఎంపిక.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 BMW X3 Launched In India; Prices Start At Rs 49.99 Lakh
Story first published: Thursday, April 19, 2018, 17:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X