బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ విడుదల: ఫోటోలు మరియు పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్30ఐ పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్, ఎక్స్‌డ్రైవ్30ఐ వేరియంట్ ధర రూ. 56.90 లక్షలు ఎక్

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్30ఐ పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్, ఎక్స్‌డ్రైవ్30ఐ వేరియంట్ ధర రూ. 56.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్

జర్మన్ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ ఇటీవల ఎక్స్3 కారును కేవలం డీజల్ వెర్షన్‌లో మాత్రమే లాంచ్ చేసింది. అయితే ఎక్స్3 మోడల్‌ను పెట్రోల్ వెర్షన్‌లో కోరుకునే కస్టమర్ల కోసం ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లో లాంచ్ చేసింది. ఎక్స్3 పెట్రోల్ వేరియంట్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్

సరికొత్త 2018 బిఎమ్‍‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్30ఐ వేరియంట్లో సాంకేతికంగా 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ప్రస్తుతం 3 మరియు 5 సిరీస్ మోడళ్లలో కూడా ఇదే ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 252బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్

8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనసంధానం ద్వారా బిఎమ్‌డబ్ల్యూ వారి ఎక్స్‌డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది. ఎక్స్3 పెట్రోల్ కేవలం 6.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 మునుపటి మోడల్ కంటే అత్యంత ధృడమైనది మరియు బరువు కూడా 55కిలోల వరకు తగ్గిపోయింది. ఎక్స్3 డిజైన్ అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, ఎక్స్3 వీల్ బేస్ పెరగడంతో క్యాబిన్ స్పేస్ ఇప్పుడు మరింత విశాలంగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్

5-సిరీస్ సెడాన్‌లో ఉన్న ఫీచర్లు ఎక్స్3 ఇంటీరియర్‌లో వచ్చాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఇంటీరియర్‌లో టచ్ మరియు గెస్చర్ కంట్రోల్ గల ఐడ్రైవ్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వ్యక్తిగత ఏ/సి కంట్రోల్ అదే విధంగా ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటి ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్

అంతే కాకుండా, ఎక్స్‌3లో హెడ్స్-అప్ డిస్ల్పే, 360-డిగ్రీ కెమెరా మరియు 40:20:40 నిష్పత్తిలో మడిచే అవకాశం ఉన్న రియర్ సీట్లు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్30ఐ పూర్తి ఫీచర్లతో నిండిన లగ్జరీ లైన్ అనే ఒక్క వేరియంట్లో మాత్రమే లభిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బిఎమ్‌డబ్ల్యూ డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ఎక్స్3 పెట్రోల్ విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి300 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ హెచ్ఎస్ఇ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 12, 2018, 17:11 [IST]
English summary
Read In Telugu: 2018 BMW X3 Petrol Variant Launched In India — Priced At Rs 56.90 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+