షెవర్లే కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా మాన్‍‌సూన్ సర్వీస్ క్యాంప్

షెవర్లే మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభిస్తున్నట్లు షెవర్లే ఇండియా ప్రకటించింది. షెవర్లే కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో జూన్ 21 నుండి 25 వరకు ఈ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న

By Anil Kumar

షెవర్లే మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభిస్తున్నట్లు షెవర్లే ఇండియా ప్రకటించింది. షెవర్లే కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో జూన్ 21 నుండి 25 వరకు ఈ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు షెవర్లే ఓ ప్రకటనలో పేర్కొంది.

మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రకటించిన షెవర్లే

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన అధీకృత షెవర్లే సర్వీస్ సెంటర్లలో ఈ క్యాంప్ నిర్వహిస్తారు. వర్షాకాలంలో కారు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే విడి భాగాల మీద ఈ మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ద్వారా ప్రత్యేక సర్వీస్ ఇవ్వనున్నారు.

మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రకటించిన షెవర్లే

ఈ మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ కోసం శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచుతోంది. షెవర్లే టెక్నీషియన్లు కస్టమర్ల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించనున్నారు.

మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రకటించిన షెవర్లే

మాన్‌సూన్ సర్వీస్ క్యాంపులో భాగంగా షెవర్లే నిభందనల ప్రకారం, కస్టమర్ల కార్లకు ఉచిత చెక్-అప్ నిర్వహిస్తారు. దీంతో కారులో ఉన్న ప్రధాన సమస్యలు సులభంగా గుర్తించవచ్చు. అందుకు తగినట్లుగా సర్వీస్ మరియు రిపేరీ చేస్తారు.

మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రకటించిన షెవర్లే

షెవర్లే కస్టమర్లు ఈ మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ జరిగే వేళ సమీపంలోని షెవర్లే అధీకృత సర్వీస్ సెంటర్‌ను సందర్శిస్తే స్క్రీన్ వాష్, వెహికల్ ఇన్‌స్పెక్షన్ మరియు టాప్ వాష్ వంటి ఉచిత సర్వీసింగ్ పొందవచ్చు. అంతే కాకుండా లేబర్ ఛార్జ్ మీద 10 శాతం మరియు విలువైన సర్వీసుల మీద 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రకటించిన షెవర్లే

ఇప్పటికే డీలర్లు ఈ మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ గురించి పూర్తి సమాచారాన్ని షెవర్లే ఓనర్లకు చేరవేశారు. ఫోన్లు, మెసేజ్‌లు మరియు ఇ-మెయిల్స్ ద్వారా సర్వీస్ క్యాంప్ వివరాలు కస్టమర్లకు చేరవేశారు. అంతే కాకుండా, షెవర్లే ఇండియా వెబ్‌సైట్లో సర్వీస్ క్యాంప్ వివరాలను అప్‌డేట్ చేసింది.

మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రకటించిన షెవర్లే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

షెవర్లే ఇండియా డిసెంబర్ 2017లో దేశీయ విక్రయాలకు ముగింపు పలికింది. ఆశించిన సేల్స్ సాధించకపోవడంతో దేశీయ మార్కెట్ నుండి నిష్క్రమించింది. అయితే, ప్రస్తుతం ఉన్న షెవర్లే కస్టమర్ల కోసం సేల్స్ తరువాత ప్రామిస్ చేసిన సర్వీస్ మరియు వారంటీని యథావిధిగా అందిస్తోంది.

ఇండియాలో ఉన్న షెవర్లే ప్రొడక్షన్ ప్లాంటులో అంతర్జాతీయ డిమాండ్ ఉన్న మోడళ్లను ఉత్పత్తి చేసి దక్షిణ మరియు మధ్య అమెరికా వంటి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, June 18, 2018, 18:37 [IST]
English summary
Read In Telugu: Chevrolet Offers Monsoon Service Camp For All Customers Across India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+