రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే కనీసం పరిహారాన్ని అతి త్వరలో పది రెట్లు పెంచనున్నారు.

By Anil Kumar

రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే కనీసం పరిహారాన్ని అతి త్వరలో పది రెట్లు పెంచనున్నారు. వయసు మరియు వారి ఆదాయానికి సంభందం లేకుండా రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే పరిహారాన్ని పది రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

తాజాగా అందిన సమచారం మేరకు, రోడ్డు ప్రమాదం మరణించినపుడు లేదా శాశ్వత అవయవ లోపం సంభవిస్తే బాధితులకు లేదా బాధితు కుటుంబ సభ్యులకు ఈ పరిహారం మొత్తాన్ని అందజేస్తారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

బాధితులకు చెల్లించే ఈ నష్టపరిహారాన్ని 24 సంవత్సరాల తరువాత సవరించారు. అయితే, బాధితులు అధిక పరిహారానికి అర్హులని భావిస్తే, తమ యాక్సిడెంట్ కేసులను మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ద్వారా కొనసాగించుకునే అవకాశం కల్పించింది.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

ప్రభుత్వ నూతన నిభందనల మేరకు, ప్రమాదంలో మరణం సంభవిస్తే బాధితుల సంబంధీకులకు 5 లక్షల రుపాయల పరిహారాన్ని అందజేస్తారు. నిబంధనల మేరకు శాశ్విత అవయవ లోపం సంభవిస్తే రూ. 50,000 నుండి రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

ఇక మీదట ఈ నష్ట పరిహారాన్ని ప్రతి ఏడాది 5 శాతం మేర పెంచనున్నారు. ప్రమాదంలో బాధితులు త్వరగా కోలుకునేందుకు కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది. గణాంకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాది 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మరో 5 లక్షల మంది గాయపడుతున్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

ప్రస్తుతం, బాధితుల తప్పిదం లేనపుడు, ప్రమాదాల్లో మరణించిన వారికి రూ. 50,000 లు పరిహారాన్ని చెల్లిస్తున్నారు. అదే విధంగా ప్రమాదాల్లో శాశ్వత అవయవ లోపం సంభవించిన వారికి రూ. 25,000 లు చెల్లిస్తున్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంతో తప్పుఒప్పుల లెక్కలు అవసరం లేదు. ప్రమాదం బాధితులు ఎవరైనప్పటికీ, అందరికీ నష్టపరిహారం అందుతుంది. ఇత మీదట అన్ని కేసులు MACT సమక్షంలో సమాప్తం కానున్నాయి.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

చట్టంలోని నిర్మాణాత్మక సూత్రాల ఆధారంగా MACT బాధితులకు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తుంది. ఈ పరిహారం బాధితుల వయస్సు, ఆదాయం మరియు బాధితుడి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మోటార్ వాహనాల చట్టంలో ఎన్నో రకాల సవరణలు జరిగాయి. కానీ, ఇప్పటి వరకు రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్ట పరిహారం విషయంలో ఎలాంటి సవరణలు జరగలేదు. పెండింగులో ఉన్న కేసులను తగ్గించే ఉద్దేశ్యంతోనే ఈ సవరణ జరిగినట్లు తెలిసింది. అయితే, బాధితులు మరింత ఎక్కువ నష్ట పరిహారాన్ని కోరుకుంటే ఆ తరువాత చట్ట పరంగా వెళ్లాల్సి ఉంటుంది.

రోడ్డు ప్రమాద బాధితులకు 5 లక్షల పరిహారం

More from DriveSpark

Article Published On: Wednesday, May 16, 2018, 17:34 [IST]
English summary
Read In Telugu: Compensation For Road Accident Victims To Increase Ten Fold — Revised First Time In Two Decades.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+