సరికొత్త డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్ల విడుదల తేది ఖరారు

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి డాట్సన్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, డాట్సన్ తమ ఫేస్‌లిఫ్ట్ గో మరియు గో ప్లస్ మ

By Anil Kumar

సరికొత్త డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి డాట్సన్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, డాట్సన్ తమ ఫేస్‌లిఫ్ట్ గో మరియు గో ప్లస్ మోడళ్లను వచ్చే సెప్టెంబర్ 2018లో విడుదల చేయనున్నట్లు తెలిసింది.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

డాట్సన్ తొలుత గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లను మే 2018లో ఇండోనేషియా విపణిలోకి ప్రవేశపెట్టింది. గో హ్యాచ్‍‌‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పీవీ రెండింటిని కూడా అప్‌డేట్ చేసిన స్టైలింగ్ ప్యాకేజీలో లభ్యం కానున్నాయి. అయితే, ఈ స్టైలింగ్ కిట్ ఇండియన్ వెర్షన్ కార్లలో లభిస్తాయా.. లేదా... అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్ స్టైలింగ్‌లో కొద్దిగా మార్పులు జరిగిన హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు సరికొత్త హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. రెండు మోడళ్లలోని టాప్ ఎండ్ వేరియంట్లలో 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ వస్తాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

పూర్తిగా మారిపోయిన ఇంటీరియర్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్ల సొంతం అని డాట్సన్ పేర్కొంది. వీటి ఇంటీరియర్‌లో బ్రాండ్ న్యూ డ్యాష్‌బోర్డ్ ఉంది. ఇందులో కొత్తగా డిజైన్ చేయబడిన ఏసి వెంట్స్, 6.75-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కార్లలో అనలాగ్ టాకో మీటర్ జోడింపుతో రీడిజైన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇతర మార్పుల్లో వ్యక్తిగత ఫ్రంట్ సీట్లు మరియు గ్లూవ్ బాక్స్ ఉంది. ఏదేమైనప్పటికీ, రెండింటిలో హై సెట్ గేర్ లీవర్లు మరియు సైడ్ ఏసి వెంట్స్ యథావిధిగా కొనసాగుతాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లలో స్టాండర్డ్‌గా వస్తున్న ఫీచర్లలో, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, పవర్ విండోస్, రియర్ వైపర్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పీవీ రెండు కార్లలో కూడా అదే మునుపటి 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 68బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

ఇండోనేషియా వెర్షన్ ఫేస్‌లిఫ్ట్ కార్లలో సివిటి ట్రాన్స్‌మిషన్ పరిచయమయ్యింది. ఏదేమైనప్పటికీ, ఇండియన్ వెర్షన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో సివిటి ట్రాన్స్‌మిషన్ దాదాపు మిస్సయ్యే అవకాశం ఉంది.

డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో వస్తున్న డాట్సన్ గో మరియు గో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల ధరలు రెగ్యులర్ వెర్షన్ కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. రెండింటిలో కూడా ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సాధారణ కార్ల కంటే వీటి ధరలు రూ. 25,000 నుండి రూ. 30,000 మధ్య వరకు పెరగవచ్చు.

Source: Autocar India

More from DriveSpark

Article Published On: Monday, June 18, 2018, 17:37 [IST]
English summary
Read In Telugu: New Datsun Go, Go+ Facelift India Launch Details Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+