డాట్సన్ గో లైవ్ స్పెషల్ ఎడిషన్ ఆవిష్కరించిన జపాన్ దిగ్గజం
డాట్సన్ గో లైవ్ స్పెషల్ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. జపాన్‌కు చెందిన దిగ్గజ చీపెస్ట్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరుగుతున్న గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో
డాట్సన్ గో లైవ్ స్పెషల్ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. జపాన్‌కు చెందిన దిగ్గజ చీపెస్ట్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరుగుతున్న గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS 2018) లో తమ గో లైవ్ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను ప్రదర్శించింది.
డాట్సన్ గో లైవ్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం...

2017లో జరిగిన ఆటో షోలో తొలిసారిగా ఆవిష్కరించిన గో లైవ్ కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా ఈ గో లైవ్ స్పెషల్ ఎడిషన్ కారును రూపొందించారు. మరియు దీనిని గో మోడల్ యొక్క టాప్ వేరియంట్ ఆధారంగా తీసుకొచ్చారు.

రెగ్యులర్ డాట్సన్ గో మోడల్‌తో పోల్చుకుంటే వ్యత్యాసం కనబడేందుకు గో లైవ్ ఎడిషన్ కారులో డిజైన్ పరంగా పలు మార్పులు చేర్పులు నిర్వహించిన నూతన డిజైన్ ఎలిమెంట్లను జోడించారు. ఇండోనేషియా మార్కెట్ కోసం వీటిని పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిసింది.

డిజైన్ విషయానికి వస్తే, డాట్సన్ గో లైవ్ కారులో అగ్రెసివ్ బాడీ కిట్ కలదు, ఇది కారును మరింత స్పోర్టివ్ మరియు స్టైలిష్‌గా తీర్చిదిద్దింది. స్పెషల్ ఎడిషన్ డాట్సన్ గో లైవ్ కారు గ్రే కలర్ బాడీ పెయింట్ స్కీమ్‌లో ఉంది. ఫ్రంట్ స్ల్పిట్టర్, సైడ్ మౌల్డింగ్స్, రియర్ డిఫ్యూసర్ మరియు లేత పసుపు రంగులో ఉన్న రియర్ స్పాయిలర్ వంటివి కారు ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకొచ్చాయి.

డాట్సన్ గో లైవ్ ఇంటీరియర్‌లో పసుపు రంగు దారంతో స్టిచ్చింగ్ చేసిన సీట్లు, యెల్లో కలర్ సీట్ బెల్ట్స్, యెల్లో బ్యాక్ లైట్ గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పసుపు వర్ణ మేళవింపులు మినహాయిస్తే మరెలాంటి మార్పులు జరగలేదు. కానీ, స్టాండర్డ్ మోడల్ ఇంటీరియర్‌తో పోల్చితే ఇది చాలా స్పోర్టివ్‌గా ఉంది.

సాంకేతికంగా డాట్సన్ గో లైవ్ స్పెషల్ ఎడిషన్‌లో 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆప్షనల్ ఎక్స్‌ట్రోనిక్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 78బిహచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండోనేషియా విపణిలో డాట్సన్ గో లైవ్ స్పెషల్ ఎడిషన్ మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్న ఈ స్పోర్టివ్ మోడల్‌ను ప్రత్యేకించి యువ కొనుగోలుదారులను ఉద్దేశించి రూపొందించినట్లు తెలిసింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డాట్సన్ కంపెనీ గతంలో ప్రవేశపెట్టిన గో లైవ్ కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా గో లైవ్ స్పెషల్ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ మోడల్‌తో పోల్చితే, చాలా కొత్తగా మరియు స్పోర్టివ్‌గా ఉంది. ఎంతో ఆకర్షణీయమైన డిజైన్ శైలిలో ఉన్న డాట్సన్ గో లైవ్ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఇండియా విడుదల గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.


Click it and Unblock the Notifications








