డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు

Written By:
Recommended Video - Watch Now!
Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

డాట్సన్ ఇండియా తమ రెడి-గో 1-లీటర్ వేరియంట్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధ రూ. 3.80 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

రెడి-గో 1.0-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్-డాట్సన్ ద్వారా విక్రయాలకు అందుబాటులో ఉన్నాయి. డాట్సన్ దీని మీద జవవరి 10, 2018 నుండి బుకింగ్స్ ప్రారంభించింది. బుక్ చేసుకున్న వారికి నేటి నుండి డెలివరీ ప్రారంభించింది.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

రెడి-గో 1.0-లీటర్ ఆటోమేటిక్ విడుదలతో ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో ఇది రిచ్ మోడల్ అని డాట్సన్ తెలిపింది. రెడి-గో స్మార్ట్ డ్రైవ్ ఆటో ఫీచర్‌లో రెండు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, డ్యూయల్ డ్రైవింగ్ మోడ్ మరియు రష్ అవర్ మోడ్. వీటి ద్వారా అన్ని రకాల రహదారి పరిస్థితుల వద్ద అత్యుత్త డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

డ్యూయల్ డ్రైవింగ్ మోడ్ ద్వారా ఆటోమేటెడ్ మరియు మ్యాన్యువల్ మోడ్ సెలక్ట్ చేసుకుని ఏటవాలు, పల్లపు మరియు సిటి ట్రాఫిక్ ఇలా ఎన్నో ప్రతికూల రహదారుల్లో డ్రైవ్ చేయవచ్చు.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

విపరీతమైన ట్రాఫిక్ ఉన్న రహదారుల్లో నెమ్మదిగా నడపడం ఒక్కోసారి తికమకలో చిన్న చిన్న ప్రమాదాలకు కారణమవుతుంది. ఇందుకోసం రష్ అవర్ మోడ్ ఎంచుకోవడంతో కారు దానంతట అదే నెమ్మదిగా కదులుతుంది. భారీ ట్రాఫిక్ ఉన్న రహదారుల్లో ఈ మోడ్ ద్వారా గంటకు 5-6కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లవచ్చు. నగరవాసులకు ఈ ఫీచర్ బాగా నచ్చుతుంది.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్ కేవలం 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. ఇంటెలిజెంట్ స్పార్క్ ఆటోమేటెడ్ టెక్నాలజీ గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

డాట్సన్ తమ రెడి-గో ఆటోమేటిక్ వేరియంట్‌ను సిఎమ్ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. రెనో క్విడ్ నుండి సేకరించిన ఇంజన్ మరియు ఎన్నో విడి భాగాలతో రెడి-గోను రూపొందించింది.

Trending On DriveSpark Telugu:

2018 మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకున్నా... రెండు నెలలు వెయిట్ చేయాల్సిందే!!

క్విడ్ కార్లలో లోపం: రీకాల్ చేసిన రెనో ఇండియా

హైదరాబాద్-బెంగళూరు హైవే మీద ఘోర ప్రమాదం!!

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లోని టి(ఒ) మరియు ఎస్ వేరియంట్లలో హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ కోసం ఆడియో స్ట్రీమింగ్ బ్లూటూత్ ఫీచర్ కలదు. రెడి-గో ఆటోమేటిక్ హ్యాచ్‍‌బ్యాక్‌లో ఆల్ బ్లాక్ ఇంటీరియర్, రిమోట్ కీ ద్వారా సెంట్రల్ లాకింగ్ మరియు విశాలమైన క్యాబిన్, లగేజ్ స్పేస్‌తో పాటు అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్(185ఎమ్ఎమ్) ఉంది.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

డాట్సన్ రెడి-గో ఏఎమ్‌టి ధర సాధారణ రెడి-గో ధర కంటే రూ. 22,000 లు ఎక్కువగా ఉంది. రెండు రకాల డ్రైవింగ్ మోడ్స్ గల స్మార్ట్ డ్రైవ్ ఆటో ఫంక్షన్ అదనంగా బ్లూటూత్ ఆడియో సిస్టమ్ రాకతో ధర పెరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ధరకు తగ్గ విలువలను రెడి-గో ఆటోమేటిక్‌ కలిగి ఉంది.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంట్రీ లెవల్ హ్యాచ్‍‌‌బ్యాక్ కారును ఎంచుకోవాలనుకునే కస్టమర్లకు డాట్సన్ తమ రెడి-గో ద్వారా విభిన్న వేరియంట్లలో పరిచయం చేసింది. రెడి-గో 800, రెడి-గో 1.0-లీటర్ మరియు రెడి-గో 1-లీటర్ ఆటోమేటిక్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. విపణిలో ఉన్న మారుతి ఆల్టో కె10 ఏజిఎస్ మరియు రెనో క్విడ్ ఆటోమేటిక్ కార్లతో పోటీ పడనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Datsun redi-GO AMT (1-Litre) Launched In India; Priced At Rs 3.80 Lakh
Story first published: Wednesday, January 24, 2018, 10:09 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark