సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు ఇవోక్ మోడళ్లు సరికొత్త ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో లాంచ్ అయ్యాయి. డిస్కవరీ స్పోర్ట్ ఇంజీనియం పెట్రోల్ వేరియంట్ ధర రూ. 49.20 లక్షలు మరియు రేంజ్ రోవర్ ఇవోక్

By Anil Kumar

ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు ఇవోక్ మోడళ్లు సరికొత్త ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో లాంచ్ అయ్యాయి. డిస్కవరీ స్పోర్ట్ ఇంజీనియం పెట్రోల్ వేరియంట్ ధర రూ. 49.20 లక్షలు మరియు రేంజ్ రోవర్ ఇవోక్ ఇంజీనియం వేరియంట్ ధర రూ. 51.06 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

ఇంజీనియం వేరియంట్ డిస్కవరీ స్పోర్ట్ యొక్క ఎస్ఇ మరియు హెచ్ఇ మోడళ్లలో మాత్రమే లభ్యమవుతోంది. అదే విధంగా, ఎవోక్‌లోని ఎస్ఇ మరియు హెఎస్ఇ డైనమిక్ మోడళ్లలో ఇంజీనియం వేరియంట్ లభ్యమవుతోంది.

సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

ఇంజీనియం ఇంజన్ ఆశించిన దానికంటే ఎక్కువ పనితీరు, సామర్థ్యం మరియు ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఈ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ అంతర్జాతీయంగా ఎన్నో రకాల ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది.

సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

డిస్కవరీ స్పోర్ట్ మరియు ఇవోక్ రెండు మోడళల్లో కూడా జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి సేకరించిన 2.0-లీటర్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ అందివ్వడం జరిగింది. ఇది గరిష్టంగా 247బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ, "రేంజ్ రోవర్ వెలార్ లగ్జరీ ఎస్‍‌యూవీలో అందించిన ఇంజీనియం పెట్రోల్ ఇంజన్‌ వేరియంటును బాగా ఆదరించారు. దీంతో డిమాండును దృష్టిలో ఉంచుకుని ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు రేంజ్ రోవర్ ఇవోక్ మోడళ్లలో అదే ఇంజీనియం ఇంజన్ వేరియంట్ అందించినట్లు చెప్పుకొచ్చాడు."

సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

డిస్కవరీ స్పోర్ట్ మరియు రేంజ్ రోవర్ ఎవోక్ 2018 మోడళ్లలో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి. ప్రత్యేకించి, వై-ఫై హాట్‌స్పాట్ మరియు ప్రో సర్వీసెస్ ఉన్నాయి. అదనంగా రూట్ ప్లానర్ అప్లికేషన్, కమ్యూట్ మోడ్ మరియు షేరింగ్ ఇటిఎ(ఎస్టిమేటెడ్ టైమ్ అరైవల్) వంటివి ఉన్నాయి.

సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

ప్రస్తుతం, ల్యాండ్ రోవర్ ఇండియా లైనప్‌లో ఆరు విభిన్న మోడళ్లు ఉన్నాయి. అవి,

  • డిస్కవరీ స్పోర్ట్ ధర రూ. 43.80 లక్షలు
  • రేంజ్ రోవర్ ఇవోక్ ధర రూ. 51.06 లక్షలు
  • డిస్కవరీ ధర రూ. 74.95 లక్షలు
  • రేంజ్ రోవర్ వెలార్ ధర రూ. 80.92 లక్షలు
  • రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రూ. 99.48 లక్షలు
  • రేంజ్ రోవర్ ధర రూ. 1.74 కోట్లు
  • అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
    సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ విడుదల

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    ఇంజీనియం ఇంజన్‌లను సాధారణంగా అల్యూమినియం లోహంతో తయారు చేస్తారు. దీంతో ఇంజన్‌లోని సిలిండర్ల తలాల మీద ఘర్షణ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంతే కాకుండా ఈ ఇంజన్‌లో పేటెంట్ హక్కులు పొందిన వేరిబుల్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీ కలదు. ఈ రెండు అంశాలు ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని మరియు పవర్ డెలివరీని పెంచడంలో సహాయపడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 25, 2018, 18:08 [IST]
English summary
Read In Telugu: Range Rover Evoque & Discovery Sport Ingenium Petrol Launched; Prices Start At Rs 49.20 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+