ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, ఫోటోలు మరియు ఇతర వివరాలు

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ దిగ్గజం ఫెరారి ఇండియన్ మార్కెట్లోకి మరో సూపర్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్(Ferrari 812 Superfast) కారును రూ. 5.20 కోట్లు

By Anil Kumar

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ దిగ్గజం ఫెరారి ఇండియన్ మార్కెట్లోకి మరో సూపర్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్(Ferrari 812 Superfast) కారును రూ. 5.20 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో విపణిలోకి ప్రవేశపెట్టింది.

Recommended Video

Ferrari Or Lamborghini, Which Is Better? - DriveSpark
ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

దేశీయ సూపర్ కార్ల సెగ్మెంట్లో బాగా ప్రసిద్ది చెందిన ఎఫ్12 బెర్లినెట్టా స్థానాన్ని భర్తీ చేస్తూ ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ లాంచ్ అయ్యింది. ఈ సూపర్ కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజన్ కలదు.

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ స్టన్నింగ్ లుక్‌లో కనిపించే అగ్రెసివ్ సూపర్ కార్. కానీ ఫెరారి ఎఫ్12 బెర్లినెట్టాతో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్‌డ్ డిజైన్‌లో ఉంది. పొడవాటి బానెట్, రియర్-సెట్ క్యాబిన్ మరియు పొట్టిగా ఉన్న డిక్కీ వంటివి స్టైలింగ్ అంశాలు మరియు బంపర్, ఢిఫ్యూజర్‌లను మరింత ఏరోడైనమిక్‌గా డిజైన్ చేశారు.

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్‌లో స్పోర్టివ్ మరియు స్లీక్ షార్ప్ హెడ్‌ల్యాంప్స్, బానెట్ క్రింద ఉన్న ఇంజన్‌ను చల్లబరిచేందుకు గాలిని గ్రహించే ప్రత్యేకమైన రంధ్రాలు మరియు ఫెరారి లోగో గల సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో ఫైటర్‌జెట్ ప్రేరిత రెండు టెయిల్ పైపులు మరియు డిఫ్యూజర్ ఉన్నాయి.

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ స్పోర్ట్స్ కారులో 6.5-లీటర్ల కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 789బిహెచ్‌పి పవర్ మరియు 718ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది. ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 340కిలోమీటర్లుగా ఉంది.

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

ఎఫ్12 బెర్లినెట్టాతో పోల్చుకుంటే ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ కారులో మెకానికల్ పరంగా ఎన్నో అత్యాధునిక విడిపరికరాలను పొందింది. మలుపుల్లో కారు ప్రక్కకు ఒరిగిపోకుండా చేసే సైడ్ స్లిప్ కంట్రోల్ వంటి ఎన్నో డ్రైవింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో రియర్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ కూడా ఉంది.

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఎరుపు మరియు చారిత్రాత్మక రంగులైన నీలం మరియు సిల్వర్ వంటి కలర్ షేడ్స్‌లో లభ్యమవుతోంది. సరికొత్త ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ విపణిలో ఉన్న ఆస్టన్ మార్టిన్ డిబి11, బెంట్లీ కాంటినెంటల్ జిటి మరియు ల్యాంబోర్ఘిని అవెంతడోర్ ఎస్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లోకి ఫెరారి 812 సూపర్‌ఫాస్ట్ కారు విడుదల చాలా ముఖ్యమైనది, మరియు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో ఫెరారి చివరిగా ఉత్పత్తి చేసిన మోడల్ కూడా ఇదే. అత్యాధునిక టెక్నాలజీ మరియు ఇండియన్ రోడ్ల మీద సూపర్ కార్ డ్రైవింగ్‌ను మరింత సరళతరం చేసే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 12, 2018, 11:41 [IST]
English summary
Read In Telugu: Ferrari 812 Superfast Launched In India; Priced At Rs 5.20 Crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+