ఇండియన్ మార్కెట్ కోసం కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌ను ప్రకటించిన ఫోర్డ్

Written By:
Recommended Video - Watch Now!
Horrific Footage Of Volkswagen Polo Exploding At A CNG Filling Station

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ వచ్చే జనవరి 31, 2018 న సరికొత్త కాంపాక్ట్ యుటిలిటి వెహకల్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఖచ్చితంగా ఏ మోడల్ అనే విషయం స్పష్టం చేయలేదు. అయితే, ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత క్రాసోవర్ కారును లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్

ఫోర్డ్ ఇండియా గత కొంత కాలం నుండి ఫిగో క్రాస్ కారును పరీక్షిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ మోడల్‌ను విడుదల చేయడానికి ఆసన్నమైంది. ఫోర్డ్ ఫ్రీ స్టైల్ పేరుతో ఫిగో క్రాస్ కారును లాంచ్ చేస్తున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్

ఈ జనవరి 31, 2018 న ఫోర్డ్ నుండి వస్తున్న సరికొత్త మోడల్‌ విడుదల కార్యక్రమానికి ఫోర్డ్ నుండి డ్రైవ్‌స్పార్క్‌కు ఆహ్వానం లభించింది. మరి, ఈ కార్యక్రమంలో ఫోర్డ్ కుగా ఎస్‌యూవీని లేదా ఫిగో క్రాస్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్

ఇండియన్ మార్కెట్ ఫోర్డ్ తాత్కాలికంగా ప్రకటించిన నూతన కాంపాక్ట్ యుటిలిటి వాహనం ఫిగో క్రాస్‌లో 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. పోర్డ్ డ్రాగన్ సిరీస్ నుండి సేకరించిన ఇది గరిష్టంగా 95బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్

అంతే కాకుండా, ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలి వెహికల్‌లో ఫిగో మరియు ఆస్పైర్ నుండి సేకరించిన 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్ ఛాయిస్‌లో లభ్యమయ్యే అవకాశం ఉంది.

Trending On DriveSpark Telugu:

ఇండియన్ మార్కెట్లోకి కియా తీసుకొస్తున్న కొత్త కార్లు

క్విడ్ కార్లను రీకాల్ చేసిన రెనో: కారణమేంటో తెలుసా...?

యమహా నుండి దూసుకొస్తున్న ఏరోక్స్ 155 స్కూటర్

ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్

ఫోర్డ్ నిజంగానే ఫిగో క్రాస్ హాట్ హ్యాచ్‌బ్యాక్‌ను కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ పేరుతో లాంచే చేస్తే, ఇందులో బాడీ క్లాడింగ్, అప్‌డేట్ చేయబడిన డిజైన్, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్లు, మస్టాంగ్ ప్రేరణతో రూపొందిన ఫ్రంట్ గ్రిల్, స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్, ట్విన్ స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు వంటి ఎన్నో ఫీచర్లు రానున్నాయి.

ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్

ఫిగో క్రాస్ క్రాసోవర్ కారు ఇంటీరియర్‌లో ఆల్ బ్లాక్ క్యాబిన్, సరికొత్త ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో గుర్తించిన ఆపిల్ ‌ర్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు సింక్3 కనెక్టివిటి వంటి ప్రత్యేక ఫీచర్లను ఫోర్డ్ ఇందులో అందివ్వనుంది.

ఫోర్డ్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా విపణిలోకి అధునాతన మరియు ఆధునిక యుటిలిటి వాహనాలను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో ఒకటి, ఫోర్డ్ భారత్‌లోకి అతి త్వరలో రివీల్ చేయనున్న కాంపాక్ట్ యుటిలిటి వెహికల్. ఫిగో క్రాస్ లేదా కుగా ఎస్‌యూవీ ఏదేమైనప్పటికీ ఫోర్డ్ ఇండియన్ కస్టమర్లకు ఓ కొత్త మోడల్‌ను పరిచయం చేస్తోందని చెప్పవచ్చు. తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford Compact Utility Vehicle (CUV) Debut Date Announced
Story first published: Tuesday, January 23, 2018, 10:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark