ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లు విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు
ఫోర్డ్ ఇండియా విభాగం నేడు (14 మే, 2018) ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీని మరో రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేసింది. ఫోర్డ్ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇక మీదట ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్ సరికొత్త పాపులర్ 1-లీటర్ ఇకోసబూస్ట్ ఇంజన్ మరియు పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో వచ్చింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లను ఇకోస్పోర్ట్ స్డాండర్డ్ వేరియంట్ టైటానియం ఆధారంగా రూపొందించింది. ఇకోస్పోర్ట్ ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ రెండు వేరియంట్లను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో పరిచయం చేసింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ కొత్త వేరియంట్లు మరియు వాటి ఇంజన్ ఆప్షన్ల వారీగా ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
| Model | Petrol | Diesel |
| EcoSport Signature Edition | ₹ 10.4 lakh | ₹ 10.99 lakh |
| EcoSport S | ₹ 11.37 lakh | ₹ 11.89 lakh |

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్లో సాంకేతికంగా 1-లీటర్ ఇకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ కలదు, అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఇంజన్ 123బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

1 లీటర్ ఇకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 18.1కిమీల మైలేజ్ ఇవ్వగలదు. మరియు దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచకోవచ్చు. ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్ 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో కూడా లభిస్తోంది.

అదే విధంగా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్ మునుపటి 1.5-లీటర్ డ్రాగన్ సిరీస్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. పెట్రోల్ ఇంజన్ 121బిహెచ్-150ఎన్ఎమ్ మరియు డీజల్ ఇంజన్ 98.6బిహెచ్‌పి-205ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండింటినీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్లో వచ్చిన ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. అంతే కాకుండా, కొత్త డిజైన్ చేయబడిన స్మోక్ ఫినిషింగ్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, హెచ్ఐడి హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన 4.2-అంగుళాల ఎమ్ఐడి మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్లో ఉద్వేగభరితమైన డ్రైవింగ్ అనుభూతి కోసం రెస్పాన్సివ్ స్టీరింగ్ వీల్ మరియు అత్యంత ధృడమైన సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.
ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ ఎక్ట్సీరియర్‌లో బ్లాక్ రూఫ్ టాప్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్ చుట్టూ బ్లాక్ బెజెల్స్ ఉన్నాయి. టైటానియం ఎస్ వేరియంట్ మిగతా రెగ్యులర్ రంగులతో పాటు శాటిన్ ఆరేంజ్ కలర్ స్కీములో కూడా లభిస్తుంది.

అదే విధంగా, ఇకోస్పోర్ట్ ఎస్ ఇంటీరియర్ విషయానికి వస్తే సెంటర్ కన్సోల్, సీట్లు మరియు డోర్ ట్రిమ్స్ మీద ఆరేంజ్ కలర్ సొబగులను గమనించవచ్చు. ఇకోస్పోర్ట్ ఎస్ భద్రత పరంగా ఆరు విభిన్న ఎయిర్ బ్యాగులతో పాటు 8-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వచ్చింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్ కూడా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వచ్చింది. సన్‌రూఫ్, క్రోమ్ సరౌడింగ్స్ గల గ్రిల్, నూతన గ్రాఫిక్స్ మరియు రియర్ స్పాయిలర్ వంటి ఇతర అప్‌డేటెడ్ ఫీచర్లు ఇందులో వచ్చాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్ ఇంటీరియర్ పరంగా మరో ప్రత్యేకం. ఇంటీరియర్‌లో అనోడైస్డ్ బ్సూ పెయింట్ స్కీమ్ గమనించవచ్చు. సీట్ స్టిట్చింగ్, సెంటర్ కన్సోల్, ఇంస్ట్రుమెంట్ ప్యానల్ మరియు డోర్ ట్రిమ్స్ మీద బ్లూ కలర్ హైలైట్స్ ఉన్నాయి. సిగ్నేచర్ ఎడిషన్ టైటానియం వేరియంట్లో ఆప్షనల్‌గా కూడా లభ్యమవుతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఫోర్డ్ తమ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మరో రెండు కొత్త వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేసింది. పలు కాస్మొటిక్ అప్‌డేట్స్, నూతన ఫీచర్లు మరియు సరికొత్త ఇంజన్ జోడింపుతో ఎస్ వేరియంట్ సిగ్నేచర్ ఎడిషన్ అనే రెండు వేరియంట్లో విడుదల చేసింది.
ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు అతి త్వరలో విడుదల కాబోయే హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








