ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మీద భారీ తగ్గింపు

By Anil Kumar

ఫోర్డ్ ఇండియా అతి త్వరలో అప్‌డేటెడ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఫిగో ఆధారిత ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. అయితే, పాత స్టాకును క్లియర్ చేసుకునేందుకు ఫోర్డ్ తమ ఫిగో ఆస్పైర్ సెడాన్ మీద భారీ డిస్కౌంట్లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ ప్రకటించింది.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మీద భారీ తగ్గింపు

ప్రస్తుతం ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ సెడాన్ మీద రూ. 65,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 19,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా ఫిగో ఆస్పైర్ టాప్ ఎండ్ ధర ఇప్పుడు రూ. 5.98 లక్షలకు పడిపోయింది. నిజానికి, ఇది చాలా బెస్ట్ ఆఫర్.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మీద భారీ తగ్గింపు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో పాటు పలు రకాల ఫీచర్లతో లభ్యమవుతోంది. కొన్ని ప్రకటనల్లో ఫోర్డ్ ఆస్పైర్ పెట్రోల్ టైటానియం వేరియంట్ ధర రూ. 5.98 లక్షలు మరియు డీజల్ టైటానియం ధర రూ. 7.08 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మీద భారీ తగ్గింపు

అతి త్వరలో ఫిగో ఆస్పైర్‌ను కొత్త వెర్షన్‌లో ప్రవేశపెడుతుండటంతో ప్రస్తుతం ఉన్న వెర్షన్‌‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తుంటడంతో దేశవ్యాప్తంగా ఎంచుకోదగిన పలు నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మీద భారీ తగ్గింపు

కొత్తగా విడుదలయ్యే ఫోర్డ్ ఫిగో ఆస్పైర్‌లో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు వరుసగా 86.8బిహెచ్‌పి పవర్ మరియు 98.6బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంతే కాకుండా ఇందులో 110బిహెచ్‌పి పవర్ మరియు 136ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ వెర్షన్ కూడా ఉంది.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మీద భారీ తగ్గింపు

ఫోర్డ్ ఆస్పైర్ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు ఇటీవల విడుదలైన హోండా అమేజ్ వంటి పలు ఇతర కాంపాక్ట్ సెడాన్ కార్లతో పోటీని ఎదుర్కోంది. ప్రస్తుత తరానికి చెందిన ఆస్పైర్ ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా డీలర్లు స్టాకును క్లియర్ చేసుకునే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మీద భారీ తగ్గింపు

భద్రత పరంగా ఫోర్డ్ ఫిగో ఆస్పైర్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు వివిధ వేరియంట్ల ఆధారంగా ఇవ్వబడ్డాయి. మరియు ఇందులో సింక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.

Source: Cartoq

More from DriveSpark

Article Published On: Wednesday, May 23, 2018, 15:53 [IST]
English summary
Read In Telugu:Ford Figo Aspire gets a discount of Rs. 84,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+