ఆ రెండు కార్ల మీద ఏకంగా లక్ష రుపాయల డిస్కౌంట్ ప్రకటించిన ఫోర్డ్: ఎందుకో తెలుసా..?
ఫోర్డ్ ఇండియా లైనప్‌లో ఉన్న ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్ల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఫిగో మరియు ఆస్పైర్ రెండు కార్లను ఏకంగా లక్ష రుపాయల తగ్గింపుతో ఫోర్డ్ డీలర్లు విక్
ఫోర్డ్ ఇండియా లైనప్‌లో ఉన్న ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్ల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఫిగో మరియు ఆస్పైర్ రెండు కార్లను ఏకంగా లక్ష రుపాయల తగ్గింపుతో ఫోర్డ్ డీలర్లు విక్రయిస్తున్నారు.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ కార్లను ఎంచుకోవాలనుకునే కస్టమర్లకు ఇదొక గొప్ప సువర్ణకాశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు స్టాకును క్లియర్ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న మోడళ్ల మీద భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించినట్లు తెలిసింది.

ఫోర్డ్ ఇండియా అతి త్వరలో ఫిగో మరియు ఆస్పైర్ కార్లను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న మోడళ్లతో పోల్చితే కాస్త కొత్తగా కనిపించడానికి ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు స్టైలింగ్ అంశాలను జోడిస్తోంది.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫిగో మరియు ఆస్పైర్ ఇంటీరియర్‌లో కూడా మార్పులు జరుగుతున్నాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఫోర్డ్ సింక్3 ఇంటర్‌ఫేస్ గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రానుంది.

సాంకేతికంగా ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని 1.2-లీటర్ మూడు సిలిండర్ల డ్రాగన్ సిరీస్ ఇంజన్ భర్తీ చేయనుంది. అత్యంత శక్తివంతమైన ఇది గరిష్టంగా 96బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అదే విధంగా డీజల్ వెర్షన్ కోసం నూతన ఫిగో మరియు ఆస్పైర్ కార్లలో అదే మునుపటి 98.6బిహెచ్‌పి-215ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ టిడిసిఐ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ యథావిధిగా కొనసాగనుంది. రెండు ఇంజన్ ఆప్షన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అదే విధంగా డిమాండును బట్టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఇండియా ఇటీవల ఫిగో ఆధారంగా రూపొందించిన ఫ్రీస్టైల్ క్రాసోవర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోటీదారులను ఎదుర్కునేలా అత్యంత చాకచక్యంగా దీని ధరలను నిర్ణయించింది. ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ధరలను కూడా ఇలాగే నిర్ణయించనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
నూతనత్వాన్ని కోరుకునే కస్టమర్ల కోసం ఫోర్డ్ ఇండియా తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. దీని విడుదల నేపథ్యంలో పాత స్టాకును క్లియర్ చేసుకునేందుకు ఫిగో మరియు ఆస్పైర్ మీద పలు డీలర్లు భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. ఏదేమైనప్పటికీ, నూతన ఫిగో ప్రారంభ ధర రూ. 5 లక్షలు మరియు ఆస్పైర్ ప్రారంభ ధర రూ. 5.5 లక్షలుగా ఉండవచ్చు.
Source: AutoCarIndia


Click it and Unblock the Notifications








