కఠినమైన ఇండియన్ రోడ్లకు ఫోర్డ్ సమధానం: ఫ్రీస్టైల్ క్రాసోవర్

Written By:
Recommended Video - Watch Now!
కఠినమైన ఇండియన్ రోడ్లకు ఫోర్డ్ సమధానం: ఫ్రీస్టైల్ క్రాసోవర్ | Ford Freestyle Unveiled - DriveSpark

అమెరికన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ సరికొత్త ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారును భారత్ వేదికగా అంతర్జాతీయ ఆవిష్కణ చేసింది. ఫోర్డ్ మొట్టమొదటి సారిగా ఫ్రీస్టైల్ మోడల్‌తో కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫోర్డ్ కొత్తగా ఆవిష్కరించిన ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా అభివృద్ది చేసింది. ఫ్రీస్టైల్ క్రాసోవర్ హ్యాచ్‍‌బ్యాక్ కారును ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఫోర్డ్ ప్రకటించింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

భారత్‌లోకి ఫోర్డ్ తమ ఫ్రీస్టైల్ ఆవిష్కరణతో ఒక కొత్త సెగ్మెంట్‌ను పరిచయం చేసింది. కఠినమైన ఇండియన్ రోడ్లను శాసించేందుకు ఎస్‌యూవీ, క్రాసోవర్ లక్షణాలున్న శరీరాకృతిలో శక్తివంతమైన ఇంజన్‌తో ప్రవేశపెట్టింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫ్రీస్టైల్‌ కారులో ఫోర్డ్ డ్రాగన్ సిరీస్ ఇంజన్ లైనప్‌లో అభివృద్ది చేసిన మూడు సిలిండర్ల 1.2-లీటర్ అల్యూమినియం పెట్రోల్ ఇంజన్‌ అందించింది. ఇది, 94.6బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి గెట్రాగ్ నుండి సేకరించిన 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫోర్డ్ ఫిగో హ్యాచ్‍‌బ్యాక్‌తో పోల్చుకుంటే ఫ్రీస్టైల్ సస్పెన్షన్ 15ఎమ్ఎమ్ వరకు పెరిగింది. మరియు ప్రతి కఠినమైన రహదారిని అధిగమించేందుకు 189ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో ఉంది. 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మీద కూర్చున్న ఫ్రీస్టైల్‌ కారులో 185/60 ఆర్15 కొలతల్లో ఉన్న గుడ్ఇయర్ అస్యురెన్స్ టైర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ డిజైన్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ పూర్తిగా ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు. అయితే, ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఫ్రంట్ డిజైన్‌లో ఎన్నో ఆకర్షణీయమైన మార్పులు జరిగాయి. మస్టాంగ్ సూపర్ కారు ప్రేరిత సరికొత్త హెక్సాగోనల్ హనీకాంబ్ ఫ్రంట్ గ్రిల్ మరియు బానెట్ ఇందులో ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఇరువైపులా ఉన్న స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్ మధ్యలో బానెట్ క్రింద మరియు ఫ్లాట్ బంపర్ పై భాగంలో ఉన్న గ్రిల్ మధ్యలో ఫోర్డ్ సిగ్నేచర్ లోగో కూర్చుంది. ఫ్రంట్ బంపర్ క్రింద ఫాక్స్ ప్లేట్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఫ్రంట్ బంపర్, రియర్ బంపర్ వీల్ ఆర్చెస్ మరియు బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది. రూఫ్ టాప్ మీద రూఫ్ రెయిల్స్ మరియు డోర్లకు ఇరువైపులా స్పోర్టి లుక్ కల్పించే స్ట్రిప్స్ ఉన్నాయి. ఫోర్డ్ ఫ్రీస్టైల్ రియర్ డిజైన్ చూడటానికి రెగ్యులర్ ఫిగోను పోలి ఉంటుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్‌ ఫోర్డ్ ఇటీవల విడుదల చేసిన ఫిగో స్పోర్ట్ ఇంటీరియర్‌ శైలిలో ఉంటుంది. ఫ్రీస్టైల్‌లో 6.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సెంటర్ కన్సోల్ పైన డ్యాష్ బోర్డు మధ్యలో ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు ఫోర్డ్ సింక్3 సెటప్ వంటివి ఫీచర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విసుగు తెప్పించే, అసంపూర్తిగా ఉన్న ఇండియన్ రోడ్ల మీద ప్రతి కారు ఓనరుకు ఎదురయ్యే ఇబ్బందులకు ఫోర్డ్ తమ ఫ్రీస్టైల్ క్రాసోవర్ ద్వారా పరష్కారం చూపింది. ఫ్రీస్టైల్ ఎత్తు, శక్తివంతమైన కొత్త ఇంజన్, ఎస్‌యూవీ లక్షణాలను కారులో అందివ్వడం మరియు ప్రతి కస్టమర్ కోరుకునే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అధునాతన ఎక్ట్సీరియర్ డిజైన్‌తో ఇండియన్ కస్టమర్ల దృష్టిని ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఆకర్షించనుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ కారు గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford Freestyle Unveiled — The Answer To India's Rugged Roads
Story first published: Wednesday, January 31, 2018, 15:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark