జీప్ కంపాస్‌కు చెక్ పెట్టేందుకు ఫోర్డ్ ప్రయత్నాలు

అమెరికాకు చెందిన ఆధునిక టెక్నాలజీని ఎప్పుడు పరిచయం చేసే ఫోర్డ్ ఇండియా జీప్ కంపాస్ మోడల్‌కు పోటీగా సరికొత్త "కుగా ఎస్‌యూవీని" సిద్దం చేసింది.

By Anil

అమెరికా లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి కంపాస్ ఎస్‌యూవీని బడ్జెట్ ధరలో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి లాంచ్ చేసింది. విడుదలైన అనతి కాలంలోనే దీనికి పోటీగా ఉన్న ఎన్నో ఇతర మోడళ్లకు దినదిన గండంగా మారింది.

ఈ నేపథ్యంలో అదే అమెరికాకు చెందిన ఆధునిక టెక్నాలజీని ఎప్పుడు పరిచయం చేసే ఫోర్డ్ ఇండియా జీప్ కంపాస్ మోడల్‌కు పోటీగా సరికొత్త "కుగా ఎస్‌యూవీని" సిద్దం చేసింది.

ఫోర్డ్ కుగా

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న కుగా ఆధారిత 5-సీటర్ ప్రీమియమ్ ఎస్‌యూవీని ఫోర్డ్ ఇండియా విపణిలో ఉన్న జీప్ కంపాస్‌‌కు పోటీగా విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిసింది.

Recommended Video

Bangalore Bike Accident At Chikkaballapur Near Nandi Upachar - DriveSpark
ఫోర్డ్ కుగా

ఫోర్డ్ కుగా సెకండ్ జనరేషన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ అంతర్జాతీయంగా ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మరియు యూరప్ వంటి విపణుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఫోర్డ్ ఇప్పటికే కుడి చేతి వైపు డ్రైవింగ్ వీల్ ఉన్న కుగా ఎస్‌యూవీల ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.

ఫోర్డ్ కుగా

కాబట్టి, ఇండియాతో పాటు కుడిచేతి వైపు స్టీరింగ్ వీల్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించే అన్ని మార్కెట్లకు ఫోర్డ్ కుగా ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. అంటే, జీప్ కంపాస్ ఉన్న ప్రతి మార్కెట్లలో ఫోర్డ్ కుగా విడుదల తప్పనిసరిగా కానుంది. దీంతో ఒకే దేశానికి చెందిన రెండు కంపెనీలు భారత్‌తో పాటు ఇతర మార్కెట్లలో ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాయి.

ఫోర్డ్ కుగా

ఫోర్డ్ సెకండ్ జనరేషన్ కుగా ఎస్‌యూవీని 2012లో సి1 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసింది, ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద ఫోకస్ మరియు సి-మ్యాక్స్ వెహికల్స్‌ను అభివృద్ది చేసింది. భారత రహదారులకు అనుగుణంగా కుగా ఎస్‌యూవీలో మార్పులు చేర్పులు జరిపే అవకాశం ఉంది.

ఫోర్డ్ కుగా

ఫోర్డ్ కుగా ఇంటర్నేషనల్ మోడల్ విభిన్న రకాల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్‌లలో లభిస్తోంది. ఫోర్డ్ కుగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు రియర్ వీల్ డ్రైవ్ రెండు ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అయితే, ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ కుగా టుర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది.

Trending On DriveSpark Telugu:

భారత్‌లో అంబాసిడర్ బ్రాండుకు మళ్లీ ప్రాణం పోస్తున్న ప్యూజో

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం 2018లో విడుదలవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

ఫోర్డ్ కుగా

ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ కుగా ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో రానుంది. ప్రపంచ శ్రేణి భద్రతా ఫీచర్లు, పెద్ద పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు ఎన్నో అధునాతన ఫీచర్లతో రానుంది.

ఫోర్డ్ కుగా

ఈ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది. ఫోర్డ్ ఇండియా కుగా ప్రీమియమ్ ఎస్‌యూవీని 2018 చివరి నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఫోర్డ్ కుగా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ కంపాస్ విడుదలతో దేశీయంగా ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా హెక్సా, రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా మరియు ఈ మధ్యనే విడుదలైన రెనో క్యాప్చర్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీగా మరింది.

మరి, ఫోర్డ్ వారి జీప్ కంపాస్ పోటీ మోడల్ 'కుగా ఎస్‌యూవీ" వార్ ను వన్ సైడ్ చేస్తుందా...? లేదంటే కంపాస్ దెబ్బకు చతికిలపడ్డ ఎస్‌యూవీల సరసన చేరనుందా...? అనే విషయం తేలాలంటే ఫోర్డ్ కుగా విపణిలోకి విడుదలవ్వాల్సిందే.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford’s Jeep Compass Rival Is Coming To India — Here’s When
Story first published: Monday, January 8, 2018, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X