జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల మీద జీఎస్టీ రేట్లను తగ్గించడానికి జీఎస్టీ కౌన్సిల్ సిద్దమైంది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

By Anil Kumar

భారత ప్రభుత్వం వస్తు మరియు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత దేశీయ వాహన పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జీఎస్టీ అమలుతో చిన్న కార్ల నుండి విలాసవంతమైన లగ్జరీ కార్లతో పాటు పర్యావరణ హితమైన హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్ మీద తీవ్ర ప్రభాం చూపింది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

దాదాపు అన్ని వాహనాల మీద నిర్ణయించిన ట్యాక్స్ స్లాబులను తయారీ సంస్థలు అంగీరించాయి. అయితే ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్ల మీద జీఎస్టీకి అనుగుణంగా నిర్ణయించిన పన్నులు ఇటు కంపెనీలకు అటు కొనుగోలుదారులకు భారంగా మారాయి.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల మీద జీఎస్టీ రేట్లను తగ్గించడానికి జీఎస్టీ కౌన్సిల్ సిద్దమైంది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. బ్యాటరీల మీద ఉన్న 28 శాతం జీఎస్టీ పన్ను రేటును 12 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

ఎలక్ట్రిక్ కార్లలో ఇతర విడి భాగాలతో పోల్చితే బ్యాటరీలు అత్యంత ఖరీదైనవి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పుంజుకోవడం మరియు భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ కార్లదే అని గ్రహించిన కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియ మార్కెట్ మీద దృష్టిసారిస్తుండటంతో ఈ దిశగా మార్పును కోరుకుంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

దేశీయ వాహన పరిశ్రమలో ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ మరియు మార్కెటింగ్ మీద దృష్టిసారించాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో బ్యాటరీ ధరలు తగ్గితే, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఖర్చు భారీగా దిగిరానుంది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

కేంద్రం ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అవసరమయ్యే విడి భాగాల మీద జీఎస్టీ రేట్లను తగ్గించడంతో దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియు అసెంబ్లీ మరింత పుంజుకోనుంది. మహీంద్రా మరియు టాటాతో పాటు ఇతర సంస్థలు కూడా ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

ప్రస్తుతం, ఎలక్ట్రిక్ కార్లు మరియు వాహనాల కోసం కావాల్సిన బ్యాటరీలను చైనా మరియు అమెరికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా బ్యాటరీల మీద జీఎస్టీ ట్యాక్స్ రేట్ తగ్గినప్పటికీ దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదు.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల ధరలను డాలరుకు కిలోవాట్‌గా ($/kWh) నిర్ణయిస్తారు. 2010లో kWh చొప్పున బ్యాటరీ ధర $1000 (రూ.67,392)గా ఉండేది అయితే ఇప్పటి నుండి ఈ ధర కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం, kWh చొప్పున ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ధరలు 225 నుండి 250 డాలర్లుగా (రూ. 15,163 నుండి 16,949) ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్ అధ్యయనం ప్రకారం 2026 నాటికి ఈ ధర $100(రూ. 6,739)లకు దిగి వచ్చే అవకాశం ఉంది.

*అన్ని ధరలను మే 12, 2018 మారకపు రేట్ల ఆధారంగా ఇవ్వడం జరిగింది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు దిశగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఇండియన్ రోడ్ల మీద తిరిగే ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ నెంబర్ ప్లేట్ విధానాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

ఈ నియమం ప్రకారం, సొంతం అవసరాల కోసం వినియోగించే కార్లకు గ్రీన్ బోర్డు మరియు తెలుపు రంగు అక్షరాలు ప్లేట్ మరియు వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగించే వాహనాలకు గ్రీన్ ప్లేట్-పసుపు రంగు అక్షరాలు గల నెంబర్ ప్లేట్లు రానున్నాయి.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

అదనంగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించే వారికోసం, పార్కింగ్ ప్రదేశాల్లో అధిక ప్రాధాన్యమివ్వడం, ఇరుకైన మరియు రద్దీ రోడ్లలో ఉచిత ఎంట్రీ అదే విధంగా జాతీయ రహదారులు మరియు టోలో ప్లాజాల వద్ద రాయితీ వంటి లాభాలను ప్రతిపాదించింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాలకు పర్మిట్లు నుండి మినహాయించింది.

జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నగర వీధుల్లో సంచరించే పెట్రోల్ మరియు డీజల్ వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో వాతావరణ కాలుష్యం రోజురోజుకీ పెచ్చుమీరుతోంది. అంతర్జాతీయంగా, పలు కార్ల తయారీ సంస్థలు నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహన తయారీని చేపడుతున్నాయి. వాహన కాలుష్య నివారణకు ప్రధానంగా ఉన్న ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనాలు. పెట్రోల్ మరియు డీజల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే దిశగా భారత ప్రభుత్వం ఎన్నో ప్రోహాత్సకాలను అందించి, ప్రజలను చైతన్యపరుస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 15, 2018, 16:48 [IST]
English summary
Read In Telugu: GST To Reduce On Batteries Of Electric Vehicles In India ― To Boost EV Manufacturing In The Country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+