సిబిఆర్1000ఆర్ఆర్ మీద 2.54 లక్షలు ధర తగ్గించిన హోండా

Written By:

జపాన్ దిగ్గజం హోండా తమ సిబిఆర్1000ఆర్ఆర్ సూపర్ బైకు మీద భారీగా ధర తగ్గించింది. హోండా సిబిఆర్1000ఆర్ఆర్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 16.79 లక్షలు ఉండగా, దీని మీద రూ. 2.01 లక్షలు తగ్గడంతో, ధరల సవరణ అనంతరం రూ. 14.78 లక్షల ధరతో లభిస్తోంది.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ ఎస్‌పి వేరియంట్ మీద గరిష్టంగా రూ. 2.54 లక్షల వరకు తగ్గింది. దీంతో రూ. 21.22 లక్షలుగా ఉన్న సిబిఆర్1000ఆర్ఆర్ ఎస్‌పి వేరియంట్ ధర ధరల తగ్గింపు అనంతరం రూ. 18.68 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

పూర్తి స్థాయిలో నిర్మించి దిగుమతి చేసుకునే ఎక్కువ కెపాసిటి ఉన్న బైకుల మీద దిగుమతి సుంకం 25 శాతం మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో హోండా టూ వీలర్స్ తమ సిబిఆర్1000ఆర్ఆర్ బైకు ధరను తగ్గించింది. హోండా టూ వీలర్స్‌తో పాటు పలు ఇతర కంపెనీలు కూడా దిగుమతి చేసుకునే బైకుల మీద అధిక మొత్తంలో ధరలు తగ్గించాయి.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

2017లో, హోండా కొత్త తరం సిబిఆర్1000ఆర్ఆర్ సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. 999సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 189బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ బైకు మొత్తాన్ని 90 శాతం రివైజ్ చేసి, 16కిలోల బరువును తగ్గించడం జరిగింది. ఈ సూపర్ బైకు బరువు మొత్తం 195కిలోలుగా ఉంది. బరువు తగ్గడం అనుగుణంగా పవర్ అవుట్‌పుట్ పెరగడంతో బరువుకు గల పవర్ నిష్పత్తి 14 శాతం మేర పెరిగింది.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

హోండా ఫైర్‌బ్లేడ్ వేరియంట్లో గైరోస్కోపిక్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడ్-బై-వైర్ టెక్నాలజీ, 9-స్థాయిల్లో నియంత్రణ గల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సెలక్టబుల్ ఇంజన్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డ్యాంపర్ మరియు పవర్ సెలక్టర్ వంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

సరికొత్త హోండా సిబిఆర్1000ఆర్ఆర్ ఎస్‌పి వేరియంట్లో ముందు వైపున 43ఎమ్ఎమ్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ సెమీ-యాక్టివ్ ఓహ్లిన్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్(S-EC) సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. క్విక్ షిఫ్టర్ మరియు డౌన్ షిఫ్ట్ అసిస్ట్, రెండు వేరియంట్లలో నాలుగు రంగుల టిఎఫ్‌టి డిస్ల్పే ఉంది.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రేసింగ్ మరియు రైడింగ్ అంటే ఇష్టం ఉన్న వారిలో హోండా సిబిఆర్1000ఆర్ఆర్ సిరీస్ సూపర్ బైకుల గురించి తెలియని వారుండరు. గతంలో వీటిని ఎంచుకోవాలంటే విపరీతమైన ధరల కారణంగా వెనక్కి తగ్గిన కస్టమర్లు ఎందరో ఉంటారు.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

అయితే, ఇటీవల దిగుమతి చేసుకునే ఖరీదైన బైకుల మీద కేంద్రం ప్రభుత్వం 25 శాతం మేర దిగుమతి సుంకం తగ్గించింది. దీంతో హోండాతో పాటు, బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్, డుకాటి, యమహా, సుజుకి మరియు హ్యార్లీ డేవిడ్సన్ వంటి దిగ్గజ సూపర్ బైకుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల మీద భారీ మొత్తంలో ధరలు తగ్గించాయి.

హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మీద తగ్గిన ధరలు

1. టాటా 5-సీటర్ ఎస్‌యూవీకి పోటీగా బరిలోకి దిగుతున్న మారుతి సుజుకి వితారా

2.కుడి లేదా ఎడమవైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది మధ్యలో ఎందుకు ఉండదు?

3.టీవీఎస్ వీగో స్కూటర్ మీద తగ్గిన ధరలు

4.త్వరపడండి కంపాస్‌లోని ఆ ఒక్క వేరియంట్ మీద ఒకటిన్నర లక్ష డిస్కౌంట్

5.విడుదలకు సర్వం సిద్దం చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

Read more on: #honda #హోండా
English summary
Read In Telugu: 2018 Honda CBR1000RR Prices Reduced By Up To Rs 2.54 Lakh
Story first published: Tuesday, April 10, 2018, 15:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark