ఆ మూడు మోడళ్లను స్పెషల్ ఎడిషన్‌లో లాంచ్ చేసిన హోండా

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ సిటీ, డబ్ల్యూఆర్-వి మరియు బిఆర్-వి మోడళ్లను విపణిలోకి స్పెషల్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లకు సిటీ ఎడ్జ్, డబ్ల్యూఆర్-వి ఆలైవ్ మరియు బిఆర్-వి స్టైల్

By Anil Kumar

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ సిటీ, డబ్ల్యూఆర్-వి మరియు బిఆర్-వి మోడళ్లను విపణిలోకి స్పెషల్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లకు సిటీ ఎడ్జ్, డబ్ల్యూఆర్-వి ఆలైవ్ మరియు బిఆర్-వి స్టైల్ అనే పేర్లతో విడుదల చేసింది.

ఈ మూడు లిమిటెడ్ అండ్ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు నూతన ఫీచర్ల జోడింపుతో ప్రవేశపెట్టింది. హోండ్ స్పెషల్ ఎడిషన్ కార్ల ధరలు మరియు ఇతర వివరాల కోసం...

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

హోండా సిటీ ఎడ్జ్

హోండా సిటీ సెడాన్ ఎస్‌వి వేరియంట్ ఆధారంగా సిటీ ఎడ్జ్ స్పెషల్ ఎడిషన్ కారును ప్రవేశపెట్టింది. సిటీ ఎడ్జ్ స్పెషల్ ఎడిషన్ సెడాన్ కారులో, స్పెషల్ ఎడిషన్ లోగో, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ రివర్స్ కెమెరా, ఐఆర్‌వీఎమ్ డిస్ల్పే మరియు 15-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

హోండా సిటీ ఎడ్జ్ స్పెషల్ ఎడిషన్ సెడాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో, సింగల్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. హోండా సిటీ ఎడ్జ్ పెట్రోల్ ధర రూ. 9.75 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 11.10 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

హోండా డబ్ల్యూఆర్-వి అలైవ్ ఎడిషన్

హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-వి బేస్ వేరియంట్ "ఎస్" ఆధారంగా డబ్ల్యూఆర్-వి అలైవ్ ఎడిషన్‌ను రూపొందించింది. ఇందులో కూడా అలైవ్ ఎడిషన్ లోగో, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా, ఐఆర్‌విఎమ్ డిస్ల్పే మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో పరిచయం అయ్యాయి.

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

హోండా డబ్ల్యూఆర్-వి అలైవ్ ఎడిషన్‌ ఇంటీరియర్‌లో అధునాతన ప్రీమియం ఫీచర్లు పరిచయం అయ్యాయి. అలైవ్ ఎడిషన్ లోగో గల విలాసవంతమైన సీటు కవర్లు మరియు స్టీరింగ్ వీల్ కవర్ కవర్ ఉన్నాయి.

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

అంతే కాకుండా, సరికొత్త డబ్ల్యూఆర్-వి అన్ని వేరియంట్లలో రేడియంట్ రెడ్ మెటాలిక్ పెయింట్ పరిచయం అయ్యింది. అదనంగా, స్పెషల్ ఎడిషన్ హోండా డబ్ల్యూఆర్-వి హోండా కనెక్ట్ సిస్టమ్‌కు ఒక నెల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

హోండా సిటీ ఎడ్జ్ తరహాలోనే, డబ్ల్యూఆర్-వి అలైవ్ ఎడిషన్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ డబ్ల్యూఆర్-వి అలైవ్ ఎడిషన్ ధర రూ. 8.02 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 9.11 లక్షలు, రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

హోండా బిఆర్-వి స్టైల్ ఎడిషన్

హోండా బిఆర్-వి స్టైల్ ఎడిషన్ అన్ని వేరియంట్లలో లభ్యమవుతోంది. హోండా బిఆర్-వి స్టైల్ ఎక్ట్సీరియర్‌లో స్పెషల్ ఎడిషన్‌ లోగో, ఫ్రంట్ గార్డ్, సైడ్ స్కర్ట్స్, టెయిల్ గేట్ స్పాయిలర్, ఫ్రంట్ మరియు రియర్ బంపర్ ప్రొటెక్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

హోండా బిఆర్-వి స్టైల్ ఎడిషన్ లభించే వేరియంట్లు మరియు వాటి ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

BR-V Variants Engine

Prices (Ex-Showroom Delhi)
S MT Style Petrol Rs 10,44,500
S MT Style Petrol Rs 11,59,000
VX MT Style Petrol Rs 12,63,000
V CVT Style Petrol Rs 12,77,500
S MT Style Diesel Rs 11,79,000
V MT Style Diesel Rs 12,65,500
VX MT Style Diesel

Rs 13,74,000

హోండా స్పెషల్ ఎడిషన్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా మోటార్స్ తమ సిటీ, డబ్ల్యూఆర్-వి మరియు బిఆర్-వి మోడళ్ల సేల్స్ పెంచుకునేందుకు ఈ మూడు మోడళ్లను మూడు విభిన్న స్పెషల్ ఎడిషన్‌లలో పరిచయం చేసింది. ఈ మూడింటిలో కూడా పేరుకు తగ్గట్లుగానే అదనపు ఫీచర్లు మరియు పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అత్యధిక విక్రయాలు సాధిస్తున్నహోండా అమేజ్ సరసన కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్లు చేరి, హోండా కంపెనీ విక్రయాలను పెంచనున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 6, 2018, 21:02 [IST]
English summary
Read In Telugu: Honda City, WR-V And BR-V Special Edition Launched In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+