హోండా సివిక్ ఫేస్‌‌లిఫ్ట్ వెర్షన్ రివీల్: డిజైన్, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

హోండా మోటార్స్ సివిక్ ఫేస్‌లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు మార్పులు చేర్పులతో రూపొందించిన 10వ తరానికి చెందిన సివిక్ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. హోండా మోటార్స

By Anil Kumar

హోండా మోటార్స్ సివిక్ ఫేస్‌లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు మార్పులు చేర్పులతో రూపొందించిన 10వ తరానికి చెందిన సివిక్ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. హోండా మోటార్స్ ఈ అప్‌డేటెడ్ సివిక్ ఇండియా విడుదలను కూడా ఖరారు చేసింది.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

అంతే కాకుండా, హోండా మోటార్స్ సరికొత్త సిఆర్-వి ఎస్‌యూవీ ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యేనాటికల్లా విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే, సివిక్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును 2019లో విడుదల చేసే అవకాశం ఉంది.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

పదవ తరానికి చెందిన హోండా సివిక్ మునుపటి మోడల్ కంటే చాలా స్పోర్టివ్‌గా ఉంది. ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, క్రోమ్ సొబగులు గల ఫాగ్ ల్యాంప్స్, కండలు తిరిగిన ఫ్రంట్ బంపర్ వంటివి కారుకు కొత్త లుక్ తీసుకొచ్చాయి.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే, ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుండి మొదలయ్యి, రియర్ టెయిల్ ల్యాంప్స్‌తో అనుసంధానమయ్యే షోల్డర్ లైన్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ హైలెట్‌గా నిలిచాయి. సివిక్ రియర్ డిజైన్‌లోని బంపర్ మీద క్రోమ్ హంగులు చూడవచ్చు.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్‌తో పాటు ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు సంభవించాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

అదనంగా, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ మరియు రియర్ ప్యాసింజర్ ఆర్మ్ రెస్ట్, క్రూయిజ్ కంట్రోల్ మరియు సీవీటీ వేరియంట్లో పెడల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

ప్రయాణికుల భద్రత పరంగా హోండా మోటార్స్ తమ సివిక్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొల్లిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ బ్రేకింగ్ గల మిటిగేషన్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు లేన్ కీప్ అసిస్ట్ సిస్టమ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

హోండా సివిక్ సెడాన్‌ సాంకేతికంగా 2-లీటర్ సామర్థ్యం గల ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం గల ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. పెట్రోల్ ఇంజన్ 154బిహెచ్‌పి పవర్ మరియు 189ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, డీజల్ ఇంజన్ 118బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 9-స్పీడ్ స్పీడ్ సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా మోటార్స్ పదవ తరానికి చెందిన సివిక్ సెడాన్ కారును ఆవిష్కరించింది. ఈ హోండా సివిక్ ఫేస్‌లిఫ్ట్ బహుశా 2019 మలిసగంలో దేశీయ విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా రూ. 16 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఉండవచ్చు. పూర్తి స్థాయిలో విడుదలైతే విపణిలో ఉన్న టయోటా కరోలా ఆల్టిస్, స్కోడా ఆక్టావియా మరియు హ్యుందాయ్ ఎలంట్రా వంటి ప్రీమియం సెడాన్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 18, 2018, 11:27 [IST]
English summary
Read In Telugu: Honda Civic Facelift Revealed — India Launch in 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+