HR-V ఎస్‌యూవీని ఆవిష్కరించిన హోండా

జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ హెచ్ఆర్-వి ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. జపాన్‌ మార్కెట్లో వెజెల్ కారుగా పేరుగాంచిన హెచ్ఆర్-వి ఎస్‌యూవీని ప్రపంచం ముందుకు ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకొచ్చింది.

By Anil

Recommended Video

Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ హెచ్ఆర్-వి ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. జపాన్‌ మార్కెట్లో వెజెల్ కారుగా పేరుగాంచిన హెచ్ఆర్-వి ఎస్‌యూవీని ప్రపంచం ముందుకు ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకొచ్చింది.

హోండా హెచ్ఆర్-వి

సరికొత్త హెచ్ఆర్-వి క్రాసోవర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ జపాన్‌లో 2018 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి ఆవిష్కరణ మరియు విడుదల కానుంది. దేశీయంగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించి, ఈ ఏడాది చివరి నాటికి లేదా 2019 ప్రారంభంలో విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనిచ్చేలా విడుదల చేసే అవకాశం ఉంది.

హోండా హెచ్ఆర్-వి

హోండా హెచ్ఆర్-వి క్రాసోవర్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దప్పంగా ఉన్న క్రోమ్ స్ట్రిప్ ఇరువైపులా ఉన్న హెడ్ ల్యాంప్స్‌ను కలుపుతూ, మధ్యలో హోండా లోగోను కలిగి ఉంది.

హోండా హెచ్ఆర్-వి

హెచ్ఆర్-వి క్రాసోవర్ ఫ్రంట్ ప్రొఫైల్‌లో త్రిభుజాకారంలో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, సరికొత్త ఫ్రంట్ బంపర్ మరియు రీడిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

హోండా హెచ్ఆర్-వి

హోండా హెచ్ఆర్-వి టాప్ ఎండ్ వేరియంట్లో ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్, బేస్ వేరియంట్లో హ్యాలోజియన్ ల్యాంప్స్ ఉన్నాయి. అదే విధంగా హెచ్ఆర్-వి టాప్ ఎండ్ వేరియంట్లలో భద్రత పరంగా అధునాత సెన్సింగ్ ఫీచర్లు తప్పనిసరిగా ఇవ్వబడ్డాయి.

హోండా హెచ్ఆర్-వి

సాంకేతికంగా హోండా హెచ్ఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీలో ప్రస్తుతం 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్, 1.8-లీటర్ హైబ్రిడ్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. అయితే, ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే హెచ్ఆర్-విలో మాత్రం, ప్రస్తుతం హోండా సిటిలో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించే అవకాశం ఉంది.

హోండా హెచ్ఆర్-వి

అంతే కాకుండా, హోండా అతి త్వరలో ఆవిష్కరించనున్న సిఆర్-వి ఎస్‌యూవీలో అందించే 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌ను కూడా ఈ అప్‌కమింగ్ హెచ్ఆర్-విలో అందించే అవకాశం ఉంది. హోండా హెచ్ఆర్-వి విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మరియు ఇతర క్రాసోవర్ తరహా ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

హోండా హెచ్ఆర్-వి

హోండా మోటార్స్ తమ హెచ్ఆర్-వి క్రాసోర్ ఎస్‌యూవీలో సన్‌రూఫ్, హెచ్‌విఎసి టచ్ కంట్రోల్స్, మ్యాజిక్ సీట్లు, వంటి ప్రపంచ శ్రేణి ప్రీమియమ్ ఫీచర్లను ఇందులో అందివ్వనుంది.

హోండా హెచ్ఆర్-వి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మునుపటి వెర్షన్ హెచ్ఆర్-వితో పోల్చుకుంటే ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అత్యంత పదునైన డిజైన్ శైలిలో ఉంది. ప్రతి ఇండియన్ కస్టమర్‌ను ఆకట్టుకునే విధంగా ప్రపంచ శ్రేణి ఫీచర్లను కూడా ఈ ఫేస్‌లిఫ్ట్ హెచ్ఆర్-విలో అందించింది. ధరకు తగ్గ విలువలతో అందుబాటులోకి తీసుకొస్తే హ్యుందాయ్ క్రెటా మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్ల మధ్య పోటీ తీవ్రతరం కానుంది. మారుతి సుజుకి కూడా ఈ ఏడాదిలోనే పలు ఖరీదైన ప్రీమియమ్ మోడళ్లను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.

Trending DriveSpark YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Honda HR-V Facelift Unveiled; Will Rival The Hyundai Creta In India
Story first published: Sunday, January 28, 2018, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X