సివిక్ మరియు సిఆర్-వి విడుదలకు హోండా ప్రణాళికలు
జపాన్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అతి త్వరలో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో 2018 వేదిక మీద సరికొత్త సివిక్ సెడాన్ మరియు సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీలను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుం
Recommended Video

జపాన్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అతి త్వరలో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో 2018 వేదిక మీద సరికొత్త సివిక్ సెడాన్ మరియు సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీలను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, హోండా మోటార్స్ భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదిక మీద రెండు మోడళ్లను ఆవిష్కరించి, విపణిలోకి పూర్తి స్థాయిలో లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.

హోండా మోటార్స్ పదవ తరానికి చెందిన సివిక్ సెడాన్ మరియ ఏడవ తరానికి చెందిన సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీలను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా ఆవిష్కరించనుంది.

2020 నాటికి ఇండియన్ మార్కెట్లోకి ఆరు కొత్త మోడళ్లను విడుదల చేసే ప్రణాళికలో భాగంగా వీటిని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు అమేజ్ కాంపాక్ట్ సెడాన్ మరియు మరో మూడు కొత్త ఉత్పత్తులను తీసుకురానుంది.

హోండా సిఆర్-విలో వస్తున్న అతి ముఖ్యమైన మార్పు మూడవ వరుస సీటింగ్ లౌఔట్ రావడం. సరికొత్త హోండా సిఆర్-వి ఎస్‌యూవీలో ఇక మీదట 7-మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంటుంది.

అంతే కాకుండా, హోండా సిఆర్-వి ఎస్‌యూవీని మొట్టమొదటి సారిగా డీజల్ ఇంజన్ వేరియంట్లో పరిచయం చేస్తోంది. సీటింగ్ కెపాసిటి పెంచడం మరియు డీజల్ వెర్షన్ పరిచయం సిఆర్-వి వెహికల్ విజయానికి కీలకం కానున్నాయి.
Trending On DriveSpark Telugu:

హోండా సిఆర్-విలో సాంకేతికంగా 1.6-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ రానుంది. హోండా ఎర్త్ డ్రీమ్ సిరీస్ నుండి సేకరించిన ఈ ఇంజన్ గరిష్టంగా 160బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉంచేందుకు సివిక్‌లో కూడా అందిస్తున్న ఈ ఇంజన్‌ను పూర్తి స్థాయిలో దేశీయంగానే ఉత్పత్తి చేయనుంది.

సిఆర్-వి ఎస్‌యూవీతో పాటు హోండా మోటార్స్ పదవ తరానికి చెందిన సివిక్ సెడాన్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద మరియు ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మరో సివిక్ సెడాన్ కారును 2019లో ప్రత్యేక ప్రజా సందర్శన ఏర్పాటు చేసి ఆవిష్కరించనుంది.

సరికొత్త హోండా సివిక్ రియర్ ఫాక్స్ నాచ్‌బ్యాక్ స్టైల్లో వస్తోంది. ఇంటీరియర్‌లో పూర్తి స్థాయిలో జరిగిన అప్‌డేట్స్‌తో పాటు అత్యాధునిక అదనపు ప్రీమియమ్ ఫీచర్లు రానున్నాయి. హోండా సివిక్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానుంది. సిఆర్-వి ఎస్‌యూవీలో ఉన్న అదే 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ఇందులో రానుంది.

పెట్రోల్ వెర్షన్ సివిక్ సెడాన్‌లో 1.8-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ విటిఇసి ఇంజన్ వస్తోంది. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ సివిక్ సెడాన్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హోండా మోటార్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా రానున్న రెండేళ్ల లోపు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి సిద్దమైంది. సరికొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్, సిఆర్-వి ఎస్‌యూవీ మరియు సివిక్ సెడాన్ కార్లను ఆవిష్కరించి, వీటిలో అమేజ్ మరియు సిఆర్-వి లను 2018లో మరియు సివిక్ సెడాన్ కారును 2019లో విడుదల చేయనుంది.
ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో మీద ఆవిష్కరణకు వస్తున్న కార్ల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.
Trending DriveSpark Telugu YouTube Videos
Source: Autocar India


Click it and Unblock the Notifications








