ఒకే కారుకు ఏడాదిలో 127 ఫైన్లు, 1.8 లక్షల జరిమానా విధించిన హైదరాబాద్ పోలీసులు
ఒకటి కాదు, రెండు కాదు ఒక కారు ఏకంగా 127 జరిమానాలు విధించారు. ప్రతిసారీ ఒకే నియమాన్ని ఉల్లంఘించడంతో అన్ని జరిమానాలను విధించారు. ఇలా ఒక ఏడాది మొత్తంలో ఆ కారు మీద ఏకంగా 1,82,245 రుపాయల జరిమానా విధించారు.
ఒకటి కాదు, రెండు కాదు ఒక కారు మీద ఏకంగా 127 జరిమానాలు విధించారు. అన్ని జరిమానాలు కూడా ప్రతిసారీ ఒకే నియమాన్ని ఉల్లంఘించడంతో విధించారు. ఇలా ఏడాది మొత్తంలో ఆ కారు మీద ఏకంగా 1,82,245 రుపాయల జరిమానా విధించారు.

నమ్మడానికే సాధ్యం కానీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా...? మన హైదరాబాదులోనే. ఓవర్ స్పీడింగ్ చేస్తూ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా చలానాలు పంపారు.

హైదరాబాదుకు చెందిన హోండా జాజ్ కారు సిటీ ఔటర్ రింగ్ రోడ్డులో మితిమీరిన వేగంతో(ఓవర్ స్పీడింగ్) ప్రయాణిస్తూ పలుమార్లు సీసీటీవి పుటేజీ ద్వారా పట్టుబడింది. ఒకే కారణం చేత ఒక్క ఏడాదిలో 1.8 లక్షలకు పైబడి జరిమానా ఈ కారు మీద అధికారులు జారీ చేశారు.

హైదరాబాద్ సిటీలోని 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డు(ORR) గరిష్ట వేగం గంటకు 120కిలోమీటర్లు ఉండేది. మితిమీరిన వేగం కారణంగా ప్రమాదాల అధికంగా జరుగుతుండటంతో ఈ పరిమితిని 100కిమీలకు తగ్గించారు.

తెలంగాణ స్టేట్ ఇ-చలానా పోర్టల్ మేరకు, TS09ER2957 రిజిస్ట్రేషన్ నెంబరు గల హోండా జాజ్ కారు గరిష్టంగా గంటకు 163కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు.

ఏప్రిల్ 4, 2017 నుండి మార్చి 10, 2018 మధ్య కాలంలో ఓవర్ స్పీడింగ్ కారణంగా మొత్తం 127 సార్లు జరిమానా విధించారు. ఒక్కో ఉల్లంఘనకు గాను, రూ. 1,435 జరిమానా మరియు రూ. 35 యూజర్ ఛార్జీలతో కలుపుకొని, అన్ని చలానాలకు జరిమానా మొత్తం రూ. 1,82,245 లుగా ఉంది.

ఈ మధ్య కాలంలో ఇండియన్ రోడ్లు చాలా మెరుగవుతున్నాయి. ఎంట్రీ లెవల్ కార్లలో కూడా కనీసం వేగం గంటకు 100 నుండి 140కిలోమీటర్ల మధ్య ఉంది. కాబట్టి, జాతీయ రహదారులు మరియు ఔటర్ రింగు రోడ్డుల మీద గరిష్ట వేగం పరిమితి కొంచెం పెంచితే బాగుంటుంది.
Source: Telangana State e-challan portal



Click it and Unblock the Notifications








