హ్యుందాయ్ కార్ల మీద విపరీతంగా పెరుగుతున్న ధరలు

ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో ధరల పెంపు చేపట్టిన హ్యుందాయ్, ఇప్పుడు మరోసారి తమ అన్ని మోడళ్ల మీద ధరలు పెంచడానికి సిద్దమైంది. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ జూన్ 1, 2018 నుండి ఇండియన్ మార్కెట్లో ఉన్న అ

By Anil Kumar

ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో ధరల పెంపు చేపట్టిన హ్యుందాయ్, ఇప్పుడు మరోసారి తమ అన్ని మోడళ్ల మీద ధరలు పెంచడానికి సిద్దమైంది. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ జూన్ 1, 2018 నుండి ఇండియన్ మార్కెట్లో ఉన్న అన్ని కార్ల మీద 2 శాతం మేర ధరలు పెంపు చేపడుతున్నట్లు పేర్కొంది.

హ్యుందాయ్ కార్ల మీద పెరిగిన ధరలు

ఇటీవల కాలంలో పెట్టుబడి ఖర్చులు భారమవుతున్న నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా, ఏ రోజుకు ఆ రోజు తయారీ, రవాణా, దిగుమతి, దిగుమతి సుంకం మరియు ఇంధన ధరలు విపరీతంగా పెరగుతుండటంతో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కునేందుకు ధరలు పెంపు తప్పనిసరి అయినట్లు వెల్లడించింది.

హ్యుందాయ్ కార్ల మీద పెరిగిన ధరలు

ఈ వారంలో రూ. 9.43 లక్షల ప్రారంభ ధరతో హ్యుందాయ్ విడుదల చేసిన 2018 క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ మినహా మిగతా అన్ని మోడళ్ల మీద 2 శాతం మేర ధరల పెంపు ఉంటున్నట్లు తెలిపింది.

హ్యుందాయ్ కార్ల మీద పెరిగిన ధరలు

హ్యుందాయ్ ఇండియా లైనప్‌లో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్ నుండి హైఎండ్ మోడల్ టుసాన్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. వీటి ధరల శ్రేణి రూ, 3.3 లక్షల నుండి రూ. 25.44 లక్షల వరకు ఉంది. పెరిగిన నూతన ధరలు అతి త్వరలో డీలర్లకు అందనున్నాయి.

హ్యుందాయ్ కార్ల మీద పెరిగిన ధరలు

హ్యుందాయ్ భవిష్యత్తులో విడుదల చేయనున్న ఉత్పత్తుల విషయానికి వస్తే, హ్యుందాయ్ కొత్త తరం శాంట్రో కారును సిద్దం చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల రహస్యంగా పరీక్షించింది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే పూర్తి స్థాయిలో ఒక కొత్త డిజైన్‌లో రూపొందిస్తోంది.

హ్యుందాయ్ కార్ల మీద పెరిగిన ధరలు

సరికొత్త హ్యుందాయ్ శాంట్రో ఈ ఏడాది దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. విశాలమైన మరియు శక్తివంతమైన శాంట్రో హ్యాచ్‌బ్యాక్ విపణిలో ఉన్న టాటా టియాగో పెట్రోల్ మరియు డీజల్ మోడళ్లకు గట్టిపోటీనివ్వనుంది.

హ్యుందాయ్ కార్ల మీద పెరిగిన ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న కియా ప్రొడక్షన్ ప్లాంటును హ్యుందాయ్ కూడా వినియోగించే అవకాశం ఉంది. ఇది హ్యుందాయ్ ప్రొడక్షన్ మరియు సేల్స్ పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai India to increase car prices from next month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X