భారత్‌కు మైక్రో ఎస్‌యూవీని ఖరారు చేసిన రెనో
హ్యుందాయ్ మోటార్స్ 2020 నాటికి భారత్‌లో ఎనిమిది కొత్త మోడళ్లను ప్రవేడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, భారత్ కోసం ఓ మైక్రో ఎస్‌యూవీని అభివృద్ది చేస్తునట్లు తెల
హ్యుందాయ్ మోటార్స్ 2020 నాటికి భారత్‌లో ఎనిమిది కొత్త మోడళ్లను ప్రవేడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, భారత్ కోసం ఓ మైక్రో ఎస్‌యూవీని అభివృద్ది చేస్తునట్లు తెలిసింది. ఈ మైక్రో ఎస్‌యూవీ హ్యుందాయ్ అప్‌కమింగ్ మోడల్ కార్లినో కాన్సెప్ట్ ఆధారిత QXI కోడ్ పేరుతో రూపొందిస్తున్న మోడల్ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ వై.కె.కూ మాట్లాడుతూ, "విపణిలోకి మైక్రో ఎస్‌యూనీని ప్రవేశపెట్టడం ఖాయం. అయితే, ఇది విపణిలోకి రానున్న QXI మోడల్ కంటే చిన్నగా ఉంటుంది. వీటి పరిచయంతో హ్యుందాయ్ ఎస్‌యూవీ లైనప్ మైక్రో ఎస్‌యూవీ, సబ్-4 మీటర్ QXI మరియు క్రెటా మరియు టుసాన్ మోడళ్లతో ధృడమైన ఎస్‌యూవీ సామ్రాజ్యం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు."

ఏదేమైనప్పటికీ, హ్యుందాయ్ ఇండియా తొలుత ప్రకటించిన ఎనిమిది మోడళ్లలో ఈ మైక్రో ఎస్‌యూవీ ఉండబోదని తెలుస్తోంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా మైక్రో-ఎస్‌యూవీ మీద డిమాండ్ మరియు కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సర్వేలు మరియు ప్రత్యేక అధ్యయనం నిర్వహిస్తోంది.

ప్రస్తుతం హ్యుందాయ్ ఖరారు చేస్తున్న ఈ నూతన మోడల్ ప్రొడక్షన్‌కు మరో మూడు నాలుగేళ్ల చేరువలో ఉంది. అంతే కాకుండా, భారీ సేల్స్ సాధ్యమయ్యే అవకాశం ఉన్న ఇలాంటి స్మాల్ ఎస్‌యూవీ మోడళ్లను డిమాండుకు తగ్గట్లుగా తయారీ డిమాండుకు చేసేందుకు అదనపు ప్రొడక్షన్ యూనిట్ కూడా అవసరమవుతుంది.

కంపెనీ ప్రస్తుతం తయారీకి మించిన డిమాండ్ ఎదుర్కుటోంది. ప్రస్తుతం ఉన్న ప్రొడక్షన్ ప్లాంటు మూడు షిఫ్టుల పాటు సంవత్సరానికి 7,00,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి, 2020 నాటికి ఈ ప్రొడక్షన్ కెపాసిటి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

మార్కెట్ నిపుణుల కథనం మేరకు, పోటీదారులు సిద్దం చేస్తున్న మోడళ్లు అనుగుణంగానే హ్యుందాయ్ ఇప్పుడు మైక్రో ఎస్‌యూవీ పేరుతో తెరమీదుకు వచ్చిందంటున్నారు. ప్రత్యేకించి, ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించిన మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కారుకు సరాసరి పోటీని సిద్దం చేసింది.

ఇండియన్ మార్కెట్లోని ఎస్‌యూవీ పరిశ్రమలో విసృతమైన అవకాశాలు ఉన్నాయి. ఎస్‌యూవీ విభాగంలో ఎలాంటి మోడళ్లకైనా మంచి డిమాండ్ లభిస్తోంది. హ్యుందాయ్ మోటార్స్ విడుదల చేసిన క్రెటా ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ 2015 నుండి ఇప్పటి వరకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా రాణిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
చిన్న కార్లు మరియు చిన్న ఎస్‌యూవీలకు భారత్‌లో అత్యధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మైక్రో-ఎస్‌యూవీని ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ ఈ ఏడాది పండుగ సీజన్‌లో పాత శాంట్రో కారుకు మళ్లీ ప్రాణం పోసి నూతన బ్రాండ్ పేరుతో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.
Source: Autocar India


Click it and Unblock the Notifications








