కార్ల మీద పొలిటకల్ మరియు గవర్నమెంట్ స్టేటస్ ప్రదర్శించడం చట్టవిరుద్దం
ప్రభుత్వ విధులకు వెళ్లే ప్రయివేట్ వాహనాల మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ లేదా పలు రకాల పొలిటికల్ మరియు గవర్నమెంట్ స్టేటస్ సూచించేలా స్టిక్కరింగ్ చేయిస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి కార్లను తరచూ చూస్తుంటాం. ఏ ప
ప్రభుత్వ విధులకు వెళ్లే ప్రయివేట్ వాహనాల మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ లేదా పలు రకాల పొలిటికల్ మరియు గవర్నమెంట్ స్టేటస్ సూచించేలా స్టిక్కరింగ్ చేయిస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి కార్లను తరచూ చూస్తుంటాం. ఏ ప్రభుత్వం అవసరానికైనా, ఏ అధికారికి ఉపయోగించినప్పటికీ ప్రయివేట్ కార్ల మీద ఇలాంటి స్టిక్కరింగ్ ఉండటం అనధికారం.

ఇలాంటి కార్లను మరియు వాహనాలను అదుపులోకి తీసుకొని, స్టిక్కరింగ్ తొలగించి మరియు జరిమానా విధించే అవకాశం రవాణా అధికారులకు ఉంది. ఒక్కోసారి సీజ్ చేసే అవకాశం కూడా ఉంది.

మోటారు వాహనాల చట్టం ప్రకారం, ముందు మరియు వెనుక వైపున రిజిస్ట్రేషన్ నెంబర్ మినహాయిస్తే, నెంబర్ ప్లేట్ మీద ఎలాంటి ఇతర గుర్తులు, అక్షరాలు మరియు డిజైన్లు ఉండకూడదు. అంతే కాకుండా వివిధ రాజకీయ పార్టీలకు సంభందించిన గుర్తులు రిజిస్ట్రేషన్ నెంబర్‌తో పాటుగా ప్రదర్శించకూడదు.

ఉత్తరాఖండ్‌లో పోలీస్ అధికారులు సుమారుగా 15 రోజుల పాటు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి ప్రజలలో అవగాహన తీసుకొచ్చారు. డెహ్రాడూన్ పోలీస్ శాఖ వాహన దారులు తరచూ ఉల్లంఘించే నియమాలలో - మోడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకోవడం, ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ మరియు ప్రయివేట్ వాహనాల మీద పొలిటకల్ మరియు గవర్నమెంట్ స్టేటస్ ప్రదర్శించే వాహనాలను గుర్తించి జరిమానా విధించారు.

అంతే కాకుండా, ప్రజలు సాధారణంగా తీసుకునే అంశాల పట్ల రవాణా అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. అనధికారికంగా స్టిక్కరింగ్ చేసి వినియోగిస్తున్న నెంబర్ ప్లేట్లను చెక్ చేసిన అధికారులు 4,805 వాహనాలకు ఉన్న నెంబర్ ప్లేట్లను తొలగించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలో మే 1 నుండి మే15 వరకు జరిపిన ప్రత్యేక క్యాంపెయిన్‌లో 3207 టూవీలర్లు మరియు 2518 ఫోర్ వీలర్లు మీద నింభందనలకు విరుద్దంగా ఏర్పాటు చేసుకున్న నెంబర్ ప్లేట్లను గుర్తించారు. అన్ని వాహనాలకు కూడా జరిమానా విధించారు.

మోటార్ వాహనాల చట్టం దేశవ్యాప్తంగా ఒక్కటే. కాబట్టి ఇవాళ ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రత్యేకమైన క్యాంపెయిన్ రేపు తెలుగు రాష్ట్రాల రవాణా మరియు ట్రాఫిక్ పోలీస్ అధికారులు నిర్వహించవచ్చు. కాబట్టి, నిభందనలకు లోబడి రోడ్డు రవాణా మరియు మోటార్ వాహనాల నియమాలను పాటించడం ఉత్తమం.

కాబట్టి, మీ వాహనాల మీద స్టిక్కరింగ్ చేయించిన నెంబర్ ప్లేట్లు, ప్రభుత్వం మరియు రాజకీయ స్టేటస్ సూచించే స్టిక్కరింగ్, రాజకీయ పార్టీల గుర్తులు మరియు పేర్లు ఉన్నట్లయితే తొలగించుకోండి. మోడిఫైడ్ సైలెన్సర్ల వాడటం కూడా చట్టపరంగా నేరమే కాబట్టి ఇలాంటి చట్ట విరుద్దమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
Source: Rushlane


Click it and Unblock the Notifications








