భారతదేశపు తొలి రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII: విడుదల వివరాలు!!
భారతదేశపు తొలి రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారు చెన్నై నగరాన్ని చేరుకుంది. సముద్రం మార్గం ద్వారా చెన్నై పోర్టును చేరుకుని, అక్కడి నుండి ప్రత్యేక ట్రక్కులో చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ కున్ షోరూమ్‌కు తీసుకొచ
Recommended Video

భారతదేశపు తొలి రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారు చెన్నై నగరాన్ని చేరుకుంది. సముద్రం మార్గం ద్వారా చెన్నై పోర్టుకు, అక్కడి నుండి ప్రత్యేక ట్రక్కులో చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ కున్ షోరూమ్‌కు తీసుకొచ్చారు.

సరికొత్త 2018 ఫాంటమ్ కారు రోల్స్ రాయిస్ లగ్జరీ సెడాన్ యొక్క ఎనిమిదవ(VIII) తరానికి చెందిన మోడల్. చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ కున్ షోరూమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రకారం సరికొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారును ఫిబ్రవరి 22, 2018 న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

భారతదేశపు తొలి ఎనిమిదవ తరానికి చెందిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును దిగుమతి చేసుకుంటున్నపుడు తీసిన ఫోటోల్లో ప్రపంచ ప్రసిద్దిగాంచిన లగ్జరీ కారుగా గుర్తించడం జరిగింది.

ఇండియన్ వెర్షన్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII లగ్జరీ సెడాన్ కారు డ్యూయల్ టోన్ వైట్ మరియు బ్లూ పెయింట్ స్కీములో మరియు సరికొత్త మోనోలిథిక్ ఫ్రంట్ గ్రిల్ నీలం రంగు యొక్క డార్క్ షేడ్‌లో ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8-సిరీస్ కారును తొలుత జూలై 2017 న ప్రపంచ ఆవిష్కరణ చేసింది. ఏడవ తరం ఫాంటమ్ స్థానాన్ని భర్తీ చేసే ఫాంటమ్ 8 జనరేషన్ కారు దేశీయంగా ఉన్న రోల్స్ రాయిస్ ప్రేమికుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపుతోంది....

ఇండియా లగ్జరీ కార్లకు లభిస్తున్న ఆదరణ మరియు కస్టమర్లు కూడా లగ్జరీ మీద ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో రోల్స్ రాయిస్ తమ ఎనిమిదవ తరానికి చెందిన ఫాంటమ్ లగ్జరీ కారును ఈ ఏడాది విపణిలోకి లాంచ్ చేసే ఆలోచనలో ఉంది.

ఇండియా లగ్జరీ కార్లకు లభిస్తున్న ఆదరణ మరియు కస్టమర్లు కూడా లగ్జరీ మీద ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో రోల్స్ రాయిస్ తమ ఎనిమిదవ తరానికి చెందిన ఫాంటమ్ లగ్జరీ కారును ఈ ఏడాది విపణిలోకి లాంచ్ చేసే ఆలోచనలో ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII లోని ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ జడ్ఎప్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది. మరియు ఈ సరికొత్త ఫాంటమ్ VIII కేవలం 5.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

సరికొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ప్రపంచ లగ్జరీ కార్ల గేమ్‌లోకి ప్రవేశించింది. సౌకర్య, వ్యక్తిగతమైన ఆప్షన్స్‌కు అనుగుణంగా సకలసదుపాయలను కల్పించుకోవచ్చు. బెస్పోక్ ఆర్కిటెక్చర్ మీద నిర్మించిన ఇందులో అత్యాధునిక మరియు విలాసవంతమైన ఇంటీరియర్ ఉంది.

రోల్స్ రాయిస్ తమ ఫాంటమ్ VIII సెడాన్ కారులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల టెక్నాలజీలు ఎన్నో ఉన్నాయి. మునుపటి ఫాంటమ్ కారులో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ స్థానంలో 12.3-అంగుళాల పరిమాణం గల ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే కలదు.

అంతే కాకుండా రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII లో "ది గ్యాలరీ"ని పరిచయం చేసింది. డ్యాష్ బోర్డ్ మీద పెద్ద పరిమాణంలో ఉన్న గ్లాస్ ప్యానల్ మీద అన్ని దిశలలో పలు రకాల మెటీరియల్‌తో ఆకర్షణీయమైన ఆర్ట్ వర్క్ చేయబడింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
భారతదేశపు మొట్టమొదటి రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారును సొంతం చేసుకునే మొదటి ఇండియన్ కస్టమర్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2018-19 బడ్జెట్‌లో లగ్జరీ కార్ల మీద భారం పెరిగినప్పటికీ తొలి ఫాంటమ్ VIII భారత్‌లోకి వచ్చింది. ధరలు పెరిగినా, దిగుమతి సుంకాలు పెరిగినా... లగ్జరీ కార్ల బిజినెస్ ఇండియాలో ఏ మాత్రం తగ్గలేదనడానికి చెన్నై వేదికగా విడుదల అవుతున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఇందుకొక నిదర్శనం.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








