ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లు

కారు కొనే ప్రతి కస్టమర్ ధర, ఇంజన్, వేరియంట్లు, ఫీచర్లు మరియు మైలేజ్ ఇలాంటి వాటి గురించి మాత్రమే ఆరా తీస్తారు. చాలా మంది కస్టమర్లు కారు భద్రత విషయంలో రాజీపడతారేమో గానీ మైలేజ్ విషయంలో అస్సలు రాజీపడరు.

By Anil Kumar

భారతీయులు మరియు భద్రత రెండూ నీరు నూనె లాంటివి. ఒకే పాత్రలో ఉన్నా ఎప్పటికీ కలవవు. కారు కొనే ప్రతి కస్టమర్ ధర, ఇంజన్, వేరియంట్లు, ఫీచర్లు మరియు మైలేజ్ ఇలాంటి వాటి గురించి మాత్రమే ఆరా తీస్తారు. చాలా మంది కస్టమర్లు కారు భద్రత విషయంలో రాజీపడతారేమో గానీ మైలేజ్ విషయంలో అస్సలు రాజీపడరు.

ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

భద్రత గురించి కస్టమర్లు పట్టించుకోరు, వాటిని విక్రయించే కంపెనీలు పట్టించుకోవు, దీనికి తోడు ప్రభుత్వం కూడా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తోంది. రోజు వారి అవసరాలకు ఉపయోగించే కారు సౌకర్యవంతమైనదే కాదు, సురక్షితమైనదై ఉండాలి. భారతీయ రోడ్ల మీద బైకులు, కార్లు మరియు లారీలకు వేరువేరుగా ప్రత్యేకమైన రోడ్లు ఉండవు. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేము.

కాబట్టి, అన్ని రకాల కస్టమర్ల కోసం ఆరు ఎయిర్ బ్యాగులు మరియు మంచి మైలేజ్‌తో లభించే అత్యంత సరసమైన ఇండియన్ కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు స్పెషల్ స్టోరీ...

ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ ఫిగో ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే భారతదేశపు అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారు. ఫోర్డ్ ఇండియా తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ టైటానియం+ టాప్ ఎండ్ వేరియంట్‌ను ఆరు ఎయిర్ బ్యాగులతో అందిస్తోంది. టైటానియం+ వేరియంట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

అంతే కాకుండా, దేశీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కారుగా ఫోర్డ్ ఫిగో మంచి మార్కులు సంపాదించింది. ఫోర్డ్ ఇండియా అతి త్వరలో ఫిగో హ్యాచ్‌బ్యాక్‌‌ను భారీ మార్పులు చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.

  • ఫోర్డ్ ఫిగో ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.47 లక్షలు
  • ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

    హ్యుందాయ్ ఎలైట్ ఐ20

    హ్యుందాయ్ ఎలైట్ ఐ20 భారతదేశపు రెండవ బెస్ట్ సెల్లింగ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. హ్యుందాయ్ మోటార్స్ ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఎలైట్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇదు ఆరు ఎయిర్ బ్యాగులతో లభిస్తోంది. దీనికి పోటీగా ఉన్న మారుతి బాలెనో కారులో ఆరు ఎయిర్ బ్యాగులు లేకపోవడం గమనార్హం.

    ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

    ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 టాప్ ఎండ్ వేరియంట్ ఆరు ఎయిర్ బ్యాగులతో లభ్యమవుతోంది. దీనిని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. అంతే కాకుండా హ్యుందాయ్ క్రాసోవర్ వెర్షన్ యాక్టివ్ ఐ20 లోని టాప్ ఎండ్ వేరియంట్ కూడా 6 ఎయిర్ బ్యాగులతో లభ్యమవుతోంది.

    • హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.35 లక్షలు
    • ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

      ఫోర్డ్ ఆస్పైర్

      ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత కాంపాక్ట్ సెడాన్ ఫిగో ఆస్పైర్ కూడా ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉంది. ఇండియాలో ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే ఏకైక సబ్ 4-మీటర్ కాంపాక్ట్ సెడాన్ కారు ఫిగో ఆస్పైర్.

      ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

      ఫిగో టాప్ ఎండ్ వేరియంట్ మాత్రమే ఆరు ఎయిర్ బ్యాగులతో లభిస్తోంది. దీనిని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఎంచుకోగలరు.

      • ఫోర్డ్ ఆస్పైర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.67 లక్షలు
      • ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

        ఫోర్డ్ ఇకోస్పోర్ట్

        ఇండియన్ సబ్ 4-మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే ఏకైక ఎస్‌యూవీ ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఈ జాబితాలో ఫోర్డ్ నుండి మొత్తం మోడళ్లు ఉన్నాయి. ఫోర్డ్ ఇటీవల తమ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలో సరికొత్త పెట్రోల్ ఇంజన్ పరిచయం చేసి, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది.

        ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

        ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కంటే ముందే ఉన్న ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ కూడా ఆరు ఎయిర్ బ్యాగులతో లభించేది. ఫోర్డ్ ఇకోస్పోర్ట్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభించే చివరి మూడు టాప్ ఎండ్ వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

        • ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.77 లక్షలు
        • ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

          హ్యుందాయ్ వెర్నా

          హ్యుందాయ్ మోటార్స్ ఎలైట్ ఐ20 కంటే పై స్థానంలో ఉన్న అన్ని మోడళ్లలో ఆప్షనల్‌గా ఆరు ఎయిర్ బ్యాగులను అందిస్తోంది. హ్యుందాయ్ తమ వెర్నా టాప్ ఎండ్ వేరియంట్లో ఆప్షనల్ ఫీచర్‌గా ఆరు ఎయిర్ బ్యాగులను అందిస్తోంది.

          ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

          హ్యుందాయ్ వెర్నా విపణిలో బాగా ప్రసిద్ది చెందింది. భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ సెడాన్ కారుగా మంచి సేల్స్ సాధిస్తోంది. హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగులు లభ్యమవుతున్నాయి.

          • హ్యుందాయ్ వెర్నా ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.8 లక్షలు
          • ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

            హోండా సిటీ

            ప్రీమియమ్ మరియు విలాసవంతమైన ఫీచర్లకు హోండా సిటీ బాగా ప్రాచుర్యం పొందింది. హోండా సిటీ ఎంతో మంది ఇండియన్ కస్టమర్ల స్టేటస్ సింబల్‌గా నిలిచింది. మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే మరో మోడల్ ఈ హోండా సిటీ.

            ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

            హోండా సిటీ టాప్ ఎండ్ వేరియంట్ ఆరు ఎయిర్ బ్యాగులతో లభిస్తోంది. దీనిని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

            • హోండా సిటీ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.91 లక్షలు
            • ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

              టయోటా యారిస్

              ప్యాసింజర్ కార్ల మార్కెట్ ఎంతగానో ఎదురుచూస్తున్న యారిస్ సెడాన్ కారును టయోటా కిర్లోస్కర్ ఇండియా అతి త్వరలో విడుదల చేయనుంది. ఇది ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో వస్తోంది. అయితే కేవలం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది.

              ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే కార్లు

              భద్రత పరంగా ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో పాటు యారిస్ టాప్ ఎండ్ వేరియంట్ సెడాన్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా రానున్నాయి. విపణిలో ఉన్న హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు యారిస్ గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: India’s most affordable cars with six airbags
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X