డెలివరీ తీసుకున్న 3 గంటల్లోపే విరిగిపోయిన యాక్సిల్స్: జీప్ కంపాస్ తయారీ లోపం

జీప్ కంపాస్ డెలివరీ తీసుకునే రోజు జయంత్ ఫుకన్ అనే కస్టమర్ తెగ సంబరపడ్డాడు. అయితే, ఆ ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. ఎందుకంటే డెలివరీ తీసుకొని రోడ్డెక్కిన కేవలం మూడు గంటల్లోపే యాక్సిల్ విరిగిపోయింది.

By Anil

Recommended Video

కఠినమైన ఇండియన్ రోడ్లకు ఫోర్డ్ సమధానం: ఫ్రీస్టైల్ క్రాసోవర్ | Ford Freestyle Unveiled - DriveSpark

జీప్ కంపాస్ డెలివరీ తీసుకునే రోజు జయంత్ ఫుకన్ అనే కస్టమర్ తెగ సంబరపడ్డాడు. అయితే, ఆయన ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. ఎందుకంటే డెలివరీ తీసుకుని రోడ్డెక్కిన కేవలం మూడు గంటల్లోపే యాక్సిల్ విరిగిపోయి, రోడ్డు ప్రక్కకు ఒరిగిపోయింది.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

ఇదంతా జీప్ కంపాస్‌లో జరిగిందా అని ఆశ్యర్యపోయారు కదూ...? ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది ముమ్మాటికీ నిజం. జయంత్ పుకన్ తన కంపాస్ ఎస్‌యూవీని తీసుకుని ఇంటికి వెళ్లే మార్గంలో ఇలా జరగడంతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

గువాహటి సిటీలోని మహేష్ మోటార్స్ జీప్ షోరూమ్‌లో కంపాస్ ఎస్‌యూవీని డెలివరీ తీసుకున్న జయంత్ తన సొంత ఊరు నగావ్ సమీపంలోని దుళియాజాన్‌కు వెళుతుండగా కో ప్యాసింజర్ సైడ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ షాఫ్ట్ విరిగిపోయింది.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

పరిమిత వేగంతో వెళుతుండటంతో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదకరమైన సంఘటనలో చాకచక్యంగా కంపాస్‌ను రోడ్డు ప్రక్కన ఆపగలిగాడు.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

డెలివరీ తీసుకున్న కేవలం 3 గంటల్లోపే ఇలా జరిగింది, అంతే కాకుండా 172కిలోమీటర్లు మాత్రమే నడిచిన కంపాస్‌లో ఇలాంటి సమస్యను ఊహించలేదని జయంత్ తెలిపాడు.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

ఒక అంతర్జాతీయ కంపెనీ జీప్ ఇలా నాణ్యత లేని వాహనాలను తయారు చేస్తోంది. ఇండియన్ రోడ్ల మీద ఇలాంటి కార్లు అత్యంత ప్రమాదకరం. "సేఫ్టీ మరియు నాణ్యత కోసం వీటిని ఎంచుకుంటే ఇవి కూడా ఇంత దారుణంగా ఉన్నాయి. మీ సలహా కోసం వెయిట్ చేస్తున్నాను" అని ఫోటోలతో పాటు ఈ సందేహాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

బ్రాండ్ న్యూ కారులో ఇలాంటి సమస్య తలెత్తడం పట్ల మహేష్ మోటార్స్ మరియు జీప్ ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఫోటోల ప్రకారం ముందు ఎడమ వైపున్న చక్రానికి ఉన్న బాల్ జాయింట్ ఫెయిల్యూర్ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

ఫోటోలు మరియు రహదారి పరిస్థితులను పరిశీలిస్తే, రోడ్డు కూడా బాగానే ఉంది. కంపాస్ ఎస్‌యూవీకి కూడా ఎలాంటి డ్యామేజ్ కలగలేదు. వీల్ డ్రైవ్ షాఫ్ట్‌ను ఛాసిస్‌తో అనుసంధానం చేసే జాయింట్ విరిగిపోవడంతో చక్రం బయటకు వచ్చేసింది.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

దీనిని వెంటనే పసిగట్టిన జయంత్ వెహికల్‌ను రోడ్డు ప్రక్కన ఆపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో విరిగిపోయిన షాఫ్ట్ నేలను తాకడంతో రోడ్డు మీద మార్క్స్ పడ్డాయి.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

తయారీ లోపం కాకుండా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి...

స్టీరింగ్ కదలికల ఆధారంగా ఫ్రంట్ వీల్స్ వద్ద ఉన్న బాల్ జాయింట్లు చక్రాలను కుడి మరియు ఎడమవైపుకు తిప్పుతాయి. అయితే, వెహికల్‌ను ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే బాల్ జాయింట్స్ అరిగిపోవడంతో ఇలా చక్రాల ప్రక్కకు తప్పుకోవడం లేదా షాఫ్ట్ విరిగిపోవడం జరుగుతుంది.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

పాత వాహనాలలో స్టీరింగ్ వీల్ ఎక్కువ షేక్ అయ్యి, వెహికల్ మొత్తాన్ని కుదుపులకు గురిచేస్తే, స్టీరింగ్ రాడ్స్ మరియు బాల్ జాయింట్స్ అరిగిపోయినట్లు గుర్తించండి. పాత వాహనాలలో స్టీరింగ్ సిస్టమ్ మరియు బాల్ జాయింట్లను పూర్తిగా మార్చేసుకోవచ్చు కూడా.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

జీప్ - అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ. గత ఏడాది అత్యంత సరసమైన ధరతో కంపాస్ ఎస్‌యూవీని విపణిలోకి విడుదల చేసింది. జీప్ కంపాస్ విడుదలైన అనతి కాలంలో మంచి సేల్స్ సాధించింది.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీని తక్కువ ధరలో అందించేందుకు మేకిన్ ఇండియా చొరవతో దేశీయంగా కంపాస్ ఎస్‌యూవీల తయారీ చేపట్టింది. దిగుమతి చేసుకునే వాహనాల మీద ట్యాక్స్ ఎక్కువగా ఉండటం మరియు కంపాస్‌కు డిమాండ్ అధికంగా ఉన్న దేశాలకు ఎగుమతి చేసే ఉద్దేశ్యంతో వీటి ఉత్పత్తిని ఇండియాలోనే చేపట్టింది.

జీప్ కంపాస్ తయారీ లోపం: విరిగిపోయిన యాక్సిల్

ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు బ్రాండ్ మరియు సేఫ్టీ దృష్టిలో ఉంచుకునే కంపాస్ ఎస్‌యూవీలను కొనుగోలు చేశారు. అయితే, ఈ సంఘటనత తయారీ పరంగా అశ్రద్ద మరియు నాణ్యత లేని నిర్మాణం బయటపడింది. ఈ సంఘటన పట్ల మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సు ద్వారా తోటి పాఠకులతో పంచుకోండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Picture credit: Jayanta Phukan

More from DriveSpark

Article Published On: Thursday, February 1, 2018, 13:05 [IST]
English summary
Read In Telugu: Jeep Compass front wheel comes off in 3 hours of taking delivery – Owner safe
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+