జీప్ కంపాస్ కొనే ప్రతి ఒక్కరూ బెడ్‌రాక్ ఎడిషన్ గురించి తెలుసుకోవాల్సిందే..!!
జీప్ ఇండియా విపణిలోకి సరికొత్త కంపాస్ బెడ్‌రాక్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్‌లో కంపాస్ బెడ్‌రాక్ వేరియంటును విడుదల చేసింది. సరికొత్త జీప్ కంపాస్ బెడ
జీప్ ఇండియా విపణిలోకి సరికొత్త కంపాస్ బెడ్‌రాక్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్‌లో కంపాస్ బెడ్‌రాక్ వేరియంటును విడుదల చేసింది. సరికొత్త జీప్ కంపాస్ బెడ్‌రాక్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 17.53 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

కంపాస్ స్పోర్ట్ వేరియంట్ ఆధారంగా ఈ బెడ్‌రాక్ ఎడిషన్‌ను తీసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ, ఇందులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా అదనపు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరెన్నో నూతన ఫీచర్లు వచ్చాయి.

జీప్ ఇండియా కంపాస్ ఎస్‌యూవీని విడుదల చేసినప్పుటి నుండి 25,000 యూనిట్లకు పైగా విక్రయాలు సాధించింది. ఈ సందర్భానికి గుర్తుగా పరిమిత సంఖ్యలో కంపాస్ బెడ్‌రాక్ ఎడిషన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

జీప్ కంపాస్ బెడ్‌రాక్ ఎడిషన్ మూడు విభిన్న ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. అవి, వోకల్ వైట్, మినిమల్ గ్రే మరియు ఎక్సోటిక్ రెడ్. అంతే కాకుండా, ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీలో 16-అంగుళాల బ్లాక్ ఫినిషింగ్ గల అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి. బాడీ డీకాల్స్ మరియు డోర్ల మీద బెడ్‌రాక్ చిహ్నాలు ఉన్నాయి.

బెడ్‌రాక్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో బెడ్‌రాక్ బ్యాడ్జింగ్ గల సీట్ కవర్లు, డైనమిక్ గైడన్స్, 5-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ కెమెరా మరియు సరికొత్త ఫ్లోర్ మ్యాట్లు ఉన్నాయి.

స్పెషల్ ఎడిషన్ జీప్ కంపాస్ బెడ్‌రాక్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటి మరియు ట్రాక్షన్ కంట్రోల్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు ఉన్నాయి.

కంపాస్ బెడ్‌రాక్ వేరియంట్ జీప్ కంపాస్ రేంజ్‌లోని స్పోర్ట్ మరియు లాంగిట్యూడ్ వేరియంట్ల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇందులో 173బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ కెపాసిటి గల టుర్భో డీజల్ ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ ఫ్రంట్ వీల్స్‌కు చేరుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ జీప్ ఇండియన్ మార్కెట్లోకి కంపాస్ ఎస్‌యూవీని లాంచ్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అనతి కాలంలోనే ఏకంగా 25,000 పైగా కంపాస్ ఎస్‌యూవీలను విక్రయించి అరుదైన మైలురాయిని చేధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అరుదైన ఎస్‌యూవీలను ఎంచుకునే కస్టమర్ల కోసం కంపాస్ బెడ్‌రార్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీని విడుదల చేసింది.

జీప్ కంపాస్ మిడ్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ టుసాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు టాట్ హెక్సా వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తోంది.


Click it and Unblock the Notifications








