కంపాస్ ట్రయల్‌హాక్ మీద బుకింగ్స్ ప్రారంభించిన జీప్

By Anil Kumar

జీప్ ఇండియా విపణిలోకి సరికొత్త కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. జీప్ కంపాస్ వేరియంట్ల జాబితాలో కంపాస్ ట్రయల్‌హాక్ టాప్ ఎండ్ వేరియంట్‍‌గా నిలవనుంది. జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో పలు నూతన ఫీచర్లు మరియు కాస్మొటిక్ అప్‌డేట్స్‌ చోటు చేసుకున్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

ఇప్పుడు, కంపాస్ ట్రయల్‌హాక్ మీద బుకింగ్స్ ప్రారంభించినట్లు బెంగళూరుతో పాటు సౌత్ ఇండియాలోని పలు జీప్ డీలర్లు డ్రైవ్‌స్పార్క్‌కు వెల్లడించారు. కానీ, జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ధరల గురించి ఎలాంటి సమాచారం లేదు. ముందస్తుగా రూ. 50,000 చెల్లింపుతో జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీని వచ్చే జూన్ లేదా జూలై మధ్యలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని డీలర్లు వెల్లడించారు. ప్రస్తుతం, జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్‌ను రాజస్థాన్‌లో ఉన్న రంజన్‌గావ్ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. జపాన్ మరియు ఆస్ట్రేలియా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

అంతర్జాతీయ విపణిలో ఉన్న కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్ జీప్ కంపాస్ ఇండియా లైనప్‌లో టాప్ ఎండ్ వేరియంట్ స్థానాన్ని భర్తీ చేయనుంది. గ్లోబల్-మోడల్ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో జీప్ యాక్టివ్ డ్రైవ్ లో-రేంజ్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు రాక్ మోడ్.

Recommended Video - Watch Now!
Auto Expo 2018: Mahindra Thar Wanderlust Specs, Features, Details - DriveSpark
జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో కంపాస్ స్టాండర్డ్ వేరియంట్ కంటే 20ఎమ్ఎమ్ ఎక్కువగా ఉంటుంది. ట్రయల్‌హాక్ ఎడిషన్ కంపాస్ ఎస్‌యూవీలో ముందు మరియు వెనుక వైపున విభిన్న బంపర్లు ఉన్నాయి. మిట్ట ప్రదేశాలను ఎక్కేటపుడు మరియు వాలు ప్రదేశాల్లో క్రిందకు దిగేటపుడు కొత్త బంపర్లు ఎంతో అనువుగా ఉంటాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

సాంకేతికంగా ఇండియన్ వెర్షన్ జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో అదే 2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. ఇది 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ బదులు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వచ్చింది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో ఇతర ఫీచర్లు అయిన అల్లాయ్ వీల్స్, బ్లాక్ మరియు సిల్వర్ ఫినిషింగ్ గల డ్యూయల్ పెయింట్ స్కీమ్, ఫ్రంట్ బంపర్ మీద రికవరీ హుక్స్, బానెట్ మీద బ్లాక్ డీకాల్, స్కిడ్ ప్లేట్లు మరియు ఆల్ వెథర్ ఫ్లోర్ మ్యాట్లు ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ టాప్ ఎండ్ వేరియంట్ ఎస్‌యూవీలో మెకానికల్ మరియు కాస్మొటిక్స్ పరంగా ఎన్నో అప్‌డేట్స్ వస్తోంది. నూతన పెయింట్ స్కీమ్స్ మరియు పలు కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కంపాస్‌లోని ఖరీదైన మోడల్ ఎంచుకునే వారి కోసం ట్రయల్‌హాక్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. కంపాస్ ట్రయల్‌హాక్ ధర అంచనాగా 24 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగులో ఎక్కువ మంది చదివిన స్టోరీలు:

1.డీజిల్ రైలింజన్లు అస్సలు ఆఫ్ చేయరెందుకు?

2.హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్: ధర, డిజైన్, ఫీచర్లు మరియు మైలేజ్ పరంగా ఏ స్కూటర్ బెస్ట్?

3.బెంగళూరు - ఉత్తర కొరియాకు ఓలా క్యాబ్: 3.55 లక్షల బిల్లుతో ఖంగుతిన్న కస్టమర్

4.ఇండియాలో మొట్టమొదటి సారిగా డీజిల్ హోం డెలివరీ సర్వీస్ ప్రారంభించిన ఐఒసి

5.ఏప్రిల్ 1 నుండి 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల బైకులకు కొత్త రూల్స్!!

Most Read Articles

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: Jeep Compass Trailhawk Bookings Open In India — Launch Date, Specs, Features & Expected Price
Story first published: Thursday, March 22, 2018, 10:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X