జీప్ కంపాస్ ట్రయల్‌హాక్: డిజైన్, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

Written By:

అమెరికా దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ జీప్ ఇండియా విభాగం గత ఏడాది విపణిలోకి బడ్జెట్ ఫ్రెండ్లీ మిడ్ సైజ్ ఎస్‌యూవీ జీప్ కంపాస్‌ను లాంచ్ చేసింది. విడుదలైన అనతి కాలంలోనే అమెరికా దిగ్గజానికి భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కంపాస్ ఎస్‌యూవీ మొదటి స్థానంలో నిలిచింది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇప్పుడు కంపాస్ ఎస్‌యూవీని కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో లాంచ్ చేయడానికి సిద్దమైంది. జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

జీప్ కంపాస్ ట్రయల్‌హా మీద బుకింగ్స్ ప్రారంభమైనట్లు మరియు భారత్‌లో దీని విడుదల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇదివరకటి కథనంలో ప్రకటించింది. జీప్ కంపాస్‍ ఇండియా లైనప్‌లో కంపాస్ ట్రయల్‌హాక్ టాప్ ఎండ్ వేరియంట్‌గా వస్తోంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

డిజైన్

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ డిజైన్ చూడటానికి అచ్చం కంపాస్ రెగ్యులర్ వేరియంట‌్ తరహాలో ఉంటుంది. కానీ, ట్రయల్‌హాక్ ఎస్‌యూవీ ముందు మరియు వెనుక వైపున రీడిజైన్ చేయబడిన బంపర్లతో వస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్‌లో ఉన్న క్రోమ్ సొబగులకు బదులుగా శాటిన్ మెటాలిక్ బ్లాక్ ఎలిమెంట్లు ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

కంపాస్ ట్రయల్‌హాక్ ఫ్రంట్ బంపర్ మీద రెండు టోయ్ హుక్స్ ఉన్నాయి. అదే విధంగా వెనుక వైపున సింగల్ టోయ్ హుక్ కలదు. ఎస్‌యూవీ ఫ్రంట్ బానెట్ మీద కఠినమైన మరియు ధృడమైన రూపాన్నిచ్చే బ్లాక్ డీకాల్స్ ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

అంతే కాకుండా, కంపాస్ బ్యాడ్జింగ్ ఉన్న ప్రదేశాల్లో పెద్ద పరిమాణంలో ఉన్న ట్రయల్‌హాక్ లోగో వచ్చింది. వెనుక మరియు ప్రక్కవైపుల కీలకమైన ట్రయల్‌హాక్ పేరు గల బ్యాడ్జిలను గుర్తించవచ్చు. కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో 17-అంగుళాల పరిమాణంలో ఉన్న డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

ఇంటీరియర్

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఇంటీరియర్‌లో రెడ్ అస్సెంట్స్ ఆల్ న్యూ బ్లాక్ థీమ్ మరియు ట్రయల్‌హాక్ ఎంబ్రాయిడరీ సీట్లు ఉన్నాయి. లెథర్ తొడుగులున్న గేర్ లీవర్, స్టీరింగ్ వీల్ మరియు ఇంటీరియర్ ప్యానల్స్ ఉన్నాయి. అంతే కాకుండా, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

స్పెసిఫికేషన్స్

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎడిషన్‌ సాంకేతికంగా 1.4-లీటర్ పెట్రోల్ మరియు 2-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డీజల్ వేరియంట్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమయ్యే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

ఆఫ్ రోడ్ శైలి లక్షణాలున్న ఎస్‌యూవీ కావడంతో జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎడిషన్‌లోని సెలెక్ట్ టెర్రైన్ ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో సరికొత్త రాక్ మోడ్ అందివ్వడం జరిగింది. అదనపు డ్రైవ్ మోడ్ మినహాయిస్తే, రెగ్యులర్ వెర్షన్ కంపాస్‌తో పోల్చుకుంటే ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో జీప్ కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ జీప్ కంపాస్. ఈ నేపథ్యంలో తమ విలాసవంతమైన టాప్ ఎండ్ వేరియంట్ జీప్ కంపాస్ ట్రయల్‌హాక్‌ను లాంచ్ చేయడానికి సిద్దమైంది. జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్ ధర సుమారుగా రూ. 23 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు హ్యందాయ్ టుసాన్ వంటి ప్రీమియమ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: Jeep Compass Trailhawk: All You Need To Know About The Upcoming SUV

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark