YouTube

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

జీప్ తమ అప్‌కమింగ్ రెనిగేడ్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌ను రివీల్ చేసింది. 2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఈ వారంలో జరిగే టోరినో మోటార్ షోలో ఆవిష్కరించడానికి జీప్ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil Kumar

జీప్ తమ అప్‌కమింగ్ రెనిగేడ్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌ను రివీల్ చేసింది. 2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఈ వారంలో జరిగే టోరినో మోటార్ షోలో ఆవిష్కరించడానికి జీప్ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ అంతర్జాతీయ ఆవిష్కరణ కానున్న నేపథ్యంలో ఓ టీజర్ ఫోటోను రివీల్ చేసింది.

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

ఫేస్‌లిఫ్ట్ జీప్ రెనిగేడ్ ఎస్‌యూవీని తొలుత యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ తమ రెనిగేడ్ ఎస్‌యూవీకి యూరోపియన్ మార్కెట్‌ను కీలకంగా ఎంచుకుంది. యురోపియన్ మార్కెట్లో రెనిగేడ్ ఎస్‌యూవీకి డిమాండ్ అధికంగా ఉంది.

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

ఫంకీ మరియు స్పోర్టివ్ డిజైన్‌తో పాటు చిన్నగా ఉన్న కొలతలు కారణంగా యూరోపియన్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 2019లో యూరోపియన్ మార్కెట్లోకి విడుదలైన అనంతరం కాస్త ఆలస్యంగా దేశీయ విపణిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

2019 రెనిగేడ్ ఫేస్‍‌లిఫ్ట్ టీజర్‌లో ఎస్‌యూవీ యొక్క అప్‌డేటెడ్ టెయిల్ ల్యాంప్స్‌ను రివీల్ చేసింది. అదే మునుపటి డిజైన్‌లో మోడ్రన్ శైలితో కూడిన ఎక్స్-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్ అందివ్వడం జరిగింది. ఇందులో ఎల్ఇడి లైటింగ్ కూడా కలదు.

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

జీప్ కథనం మేరకు, రెనిగేడ్ ఎస్‌యూవీ సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యం కానున్నట్లు సమాచారం. ఇవి, మూడు మరియు నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ శ్రేణి మధ్య ఉండనున్నాయి.

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో రాబోయే అతి చిన్న 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 120బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా 1.3-లీటర్ కెపాసిటి గల శక్తివంతమైన ఇంజన్ 150 లేదా 180 బిహెచ్‍‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ నూతన ఇంజన్‌లు అత్యుత్తమ పనితీరును మరియు సామర్థ్యాన్ని కనబరుస్తాయి.

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

జీప్ మాతృ సంస్థ, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(FCA) 2022 నాటికల్లా తమ లైనప్‌లో ఉన్న అన్ని డీజల్ ఇంజన్‌లను తొలగిస్తామని వెల్లడించింది. ఏదేమైనప్పటికీ, ఇండియన్ మార్కెట్లో తమ ఉత్పత్తులను పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో విక్రయిస్తోంది.

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఆవిష్కరించిన జీప్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2019 జీప్ రెనిగేడ్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విడుదలైతే, జీప్ ఇండియా లైనప్‌లో అత్యంత సరసమైన మోడల్‌ ఉన్న కంపాస్ ఎస్‌యూవీ కంటే తక్కువ ధరతో లభించనుంది. జీప్ రెనిగేడ్ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ వంటి మోడళ్లకు గట్టిపోటీనివ్వనుంది.

Most Read Articles

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: 2019 Jeep Renegade Facelift Teased Ahead Of Unveil
Story first published: Wednesday, June 6, 2018, 14:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X