మారుతి వితారా బ్రిజాకు పోటీగా జీప్ స్మాల్ ఎస్‌యూవీ

Written By:

అమెరికా దిగ్గజం జీప్ జీప్ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. అత్యంత ఖరీదైన ఎస్‌యూవీలను తయారు చేసే జీప్ ఇండియా విభాగం ఇప్పుడు అతి చిన్న ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమైంది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచిన మారుతి వితారా బ్రిజాకు పోటీగా జీప్ ఇండియా ఒక కొత్త ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. ప్రపంచ లగ్జరీ కార్ల కంపెనీ దేశీయ బడ్జెట్ కార్ల సంస్థను టార్గెట్ చేయడాన్ని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడమని చెప్పవచ్చు.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

జీప్ సిఇఒ మైక్ మాన్లే ఆటోకార్ ఇంగ్లాండుతో మాట్లాడుతూ, ప్యాసిజర్ కార్ల పరిశ్రమ ఆశ్చర్యపోయే విధంగా జీప్ ఒక కొత్త ఎస్‌యూవీని నిర్మిస్తున్నట్లు తెలిపాడు. స్థానాన్ని ఈ నూతన ఎస్‌యూవీ ప్రస్తుతం జీప్ లైనప్‌లో ఉన్న అత్యంత సరసమైన ఎస్‌యూవీ రెనిగేడ్ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

జీప్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీగా రాబోయే మోడల్‌ను తేలికపాటి ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించనుంది. కానీ, జీప్ సంస్థ ప్రత్యక్షంగా జీప్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Recommended Video - Watch Now!
[Telugu] Jeep Compass Launched In India - DriveSpark
జీప్ స్మాల్ ఎస్‌యూవీ

జీప్ స్మాల్ ఎస్‌యూవీ కోసం తరువాత తరం ఫియట్ పాండా మోడల్‌ను అభివృద్ది చేసిన ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించుకోనుందని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఫ్లాట్‌ఫామ్ ప్రణాళిక చెబుతోంది. అంతర్జాతీయ మార్కెట్ కోసం జూన్ 1, 2018 న జీప్ తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించనుంది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

తొలుత జీప్ రెనిగేడ్ యొక్క మోడిఫైడ్ వెర్షన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఈ కొత్త ఎస్‌యూవీ అభివృద్ది కోసం ఉపయోగించాలని భావించింది. అయితే, బరువు ఎక్కువగా ఉండటం మరియు కొత్త ఎస్‌యూవీ డిజైన్ లక్షణాలను చేరుకోలేకపోవడంతో ఆ ఆలోచనను ప్రక్కను పెట్టేసింది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

యూరోపియన్ మరియు ఆసియా మార్కెట్లలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉన్నట్లు ఫియట్ గుర్తించడంతో, ఫియట్ అనుభంద సంస్థ జీప్ కొత్త స్మాల్ ఎస్‌యూవీని రూపొందించి వీలైనంత త్వరగా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

ఫియట్ పాండా గురించి చూస్తే, పాండా 4x4 డ్రైవ్‌ట్రైన్ గల ఎస్‌యూవీ. ఇప్పటికే ఫియట్ పాండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల్లో ఉంది. జీప్ నిర్మించాలని చూస్తున్న చిన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ నమూనా ఫియట్ పాండా ఎస్‌యూవీ తరహాలో ఉంటుంది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

ప్రస్తుతం, జీప్ ఇండియా లైనప్‌లో అత్యంత సరసమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీ కంపాస్. అమెరికా దిగ్గజం జీప్ త్వరలో రెనిగేడ్ ఎస్‌యూవీని కూడా విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. జీప్ ఇండియా రెనిగేడ్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తూ, ఇప్పటికే పలుమార్లు ఆటోమొబైల్ మీడియా కంటబడింది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు రెనిగేడ్ ఎస్‌యూవీలను విడుదల చేస్తే జీప్ ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ ఎస్‍‌యూవీ కంపాస్‌తో కలుపుకుంటే భారత ఎస్‌యూవీ మార్కెట్ వాటాలో అత్యధిక శాతం జీప్ సొంతం చేసుకోనుంది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ దిగ్గజం యూరోపియన్ మరియు వేగంగా అభివృద్ది చెందుతున్న పలు అంతర్జాతీయ మార్కెట్లలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. జీప్ తమ రెనిగేడ్ ఎస్‌యూవీని 2019 ప్రారంభం నాటికి, ఆ తరువాత తమ చిన్న కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి వితారా బ్రిజా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలకు పోటీగా తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.

జీప్ స్మాల్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగులో ఎక్కువ మంది చదివిన కథనాలు...

1. మైలేజ్ ప్రియుల కోసం ఈ ఏడాది విడుదలవుతున్న కొత్త కార్లు

2.అద్బుతం: లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్

3.కొత్త తరం పల్సర్ బైకులను అభివృద్ది చేస్తున్న బజాజ్

4. మరో కొత్త వేరియంట్లో నెక్సాన్ విడుదలకు సిద్దపడుతున్న టాటా

5.సరికొత్త వితారా ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

Source: Autocar UK

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: Jeep To Introduce Maruti Vitara Brezza Rival — More Details Revealed
Story first published: Monday, March 26, 2018, 14:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark