వరద భాదిత కేరళకు ఏయే ఆటోమొబైల్ కంపెనీ ఎంత విరాళమిచ్చింది?

దేశీయ వాహన పరిశ్రమలో ఉన్న పలు ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నాయి.

By Anil Kumar

వందేళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని భారీ వర్షాలు, వరదలు కేరళ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విలయంతో సుమారుగా 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు తగ్గుముఖం పట్టినా... జనజీవనాన్ని అస్తవ్యస్తం కావడంతో లక్షలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

అత్యంత దారుణమైన పరిస్థితుల నుండి కేరళ ప్రజలను గట్టెక్కించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నావికా దళం, వాయు సైన్యంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కేరళ వరదల్లో నిరంతరాయంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, వ్యాపార దిగ్గజాలు మరియు వ్యాపార వేత్తలు మరియు సెలబ్రిటీలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ మొత్తంలో విరాళమిచ్చారు. దేశీయ వాహన పరిశ్రమలో ఉన్న పలు ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నాయి. ఇవాళ్టి కథనంలో ఏ యే ఆటోమొబైల్ సంస్థ ఎంత మేరకు విరాళాన్ని ప్రకటించిందో చూద్దాం రండి...

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

టీవీఎస్ మోటార్ కంపెనీ

దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ కేరళ సీఎం సహాయ నిధికి కోటి రుపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రజలు సురక్షితంగా కొలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

మెర్సిడెస్ బెంజ్

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగంవరద బాధిత కేరళ రాష్ట్రానికి 30 లక్షల రుపాయల స్వచ్ఛంద విరాళాన్ని ప్రకటించింది.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

హోండా గ్రూపు

జపాన్‌కు చెందిన హోండా గ్రూపు దేశీయంగా ద్విచక్ర వాహన మరియు ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో కార్యకలాపాలు సాగిస్తున్న హోండా గ్రూపు ప్రకృతి విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రానికి రూ. 3 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

బజాజ్ ఆటో

బజాజ్ ఆటో సంస్థ కేరళ ముఖ్య మంత్రి సహాయ నిధికి 2 కోట్ల రుపాయల విరాళాన్ని ప్రకటించింది. బజాజ్ ఆటో దేశీయ ద్విచక్ర మరియు త్రిచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్‌గా రాణిస్తోంది.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

మారుతి సుజుకి

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి మొత్తం 3.5 కోట్ల రుపాయల విరాళాన్ని ప్రకటించినట్లు పేర్కొంది. ఇందులో రెండు కోట్ల రుపాయలు మారుతి ప్రకటించింది కాగా, మారుతి ఉద్యోగుల నుండి మరో 1.5 కోట్ల రుపాయలు సేకరించినట్లు తెలిసింది.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

హ్యుందాయ్

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మరియు కొరియా దిగ్గజం హ్యుందాయ్ జల ప్రళయంతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు 1 కోటి రుపాయల విరాళమిచ్చింది.

కేరళ వరదలు: ఆటోమొబైల్ కంపెనీ నుంచి నిధుల వెల్లువ

పలు వాహన పరిశ్రమలు కేరళ రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేయగా, మరికొన్ని కంపెనీలు వరద ప్రభావిత వాహనాలకు సర్వీసింగ్ సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చాయి. మరిన్ని కొన్ని సంస్థ కేరళ వ్యాప్తంగా తమ కస్టమర్ల కోసం ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ప్రారంభించాయి. అంతే కాకుండా వరద ప్రభావిత వాహనాలను రిపేరీ చేయాలని కంపెనీలు తమ డీలర్లుకు సూచించాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Kerala Floods 2018 — Major Automotive Brands Lend Out Support
Story first published: Thursday, August 23, 2018, 18:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X