భారత్‌కు చిన్న కారును ఖరారు చేస్తున్న కియా

కియా మోటార్స్ మరో ఏడాదిలో విపణిలోకి కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్దమైన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, ఈ దశాబ్దం చివరి నాటికి మరో ఎస్‌యూవీని లాంచ్ చేసే ప్రణాళికల

By Anil Kumar

కియా మోటార్స్ మరో ఏడాదిలో విపణిలోకి కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్దమైన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, ఈ దశాబ్దం చివరి నాటికి మరో ఎస్‌యూవీని లాంచ్ చేసే ప్రణాళికలో ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటి కంటే కియా మోటార్స్ అతి చిన్న కారును విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది.

కియా నుండి చిన్న కారు

కియా తమ మూడవ మోడల్‌గా స్మాల్ కారును దేశీయంగా ఉత్పత్తి చేయనుంది. విపణిలో ఉన్న ఇతర చిన్న కార్లకు పోటీనిచ్చేలా అత్యంత సరసమైన ధరలో ప్రవేశపెట్టేందుకు దీని ఉత్పత్తిని పూర్తి స్థాయిలో ఇండియాలో చేపట్టనుంది.

కియా నుండి చిన్న కారు

గతంలో కంపెనీ చిన్న కారుగా పికంటో లేదా రియో మోడళ్లను పరీశించింది. కానీ, ఈ రెండింటిని కాకుండా బ్రాండ్ న్యూ స్మాల్ కారును ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కియా నుండి చిన్న కారు

మార్కెట్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే భారతదేశపు మూడవ లేదా నాలుగవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా రాణించడంలో ఈ స్మాల్ కారు కియా మోటార్స్ ఇండియాకు‌ ఎంతగానో తోడ్పడనుంది. అంతే కాకుండా, పికంటో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా హ్యుందాయ్ మోటార్స్ ఓ కాంపాక్ట్ కారును కూడా నిర్మిస్తోంది. ఈ కాంపాక్ట్ కారును మిక్రో ఎస్‌యూవీగా హ్యుందాయ్ కార్లినో ఎస్‌యూవీ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది.

కియా నుండి చిన్న కారు

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఆధారంతో వస్తోన్న ఎస్‌యూవీని టస్కర్ పేరుతో లాంచ్ చేయనుంది. ఇది మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనిస్తుంది. అదే విధంగా దీని తరువాత వస్తోన్న సబ్-4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి వితారా బ్రిజాకు గట్టి పోటీనివ్వనుంది.

Source: Cardekho

Most Read Articles

English summary
Read In Telugu: Kia plans to launch a new small car in India
Story first published: Saturday, June 16, 2018, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X