లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల: ధర రూ. 2.32 కోట్లు

దేశీయ లగ్జరీ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించిన లెక్సస్ ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన లెక్సస్ ఎల్ఎక్స్ 570 (Lexus LX 570) ఎస్‌యూవీని లాంచ్ చేసింది. లెక్సస్ ఎల్ఎక్స్ 570 ధర రూ. 2.32 కోట్లు ఎక్స్-షోరూమ్

By Anil Kumar

దేశీయ లగ్జరీ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించిన లెక్సస్ ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన లెక్సస్ ఎల్ఎక్స్ 570 (Lexus LX 570) ఎస్‌యూవీని లాంచ్ చేసింది. లెక్సస్ ఎల్ఎక్స్ 570 ధర రూ. 2.32 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. లెక్సస్ ఎల్ఎక్స్ 570 లగ్జరీ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా ఉన్న లెక్సస్ డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

లెక్సస్ అంతర్జాతీయ విపణిలో అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎల్ఎక్స్ 570 ఎస్‌యూవీని దేశీయ విపణిలోకి హై ఎండ్ మోడల్‌గా పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లెక్సస్ విక్రయిస్తున్న కార్లలో ఎల్ఎక్స్ 570 అత్యంత ఖరీదైనది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ 200 మోడల్‌ను నిర్మించిన అదే ల్యాడర్ ఫ్రేమ్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. ఇతర లెక్సస్ మోడళ్లతో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

లెక్సస్ ఎల్ఎక్స్ 570 ఎస్‌యూవీలో స్పిండిల్ గ్రిల్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, కండలు తిరిగిన శరీరాకృతి, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్‌తో కూడిన పదునైన డిజైన్ అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు లెక్సస్ ప్రవేశపెట్టిన మోడళ్ల కంటే ఈ ఎస్‌యూవీ చాలా కొత్తంగా ఉంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

లెక్సస్ ఎల్ఎక్స్ 570 ఇంటీరియర్ విషయానికి వస్తే, సాఫ్ట్-టచ్ మెటీరియల్ మరియు లెథర్ సీటింగ్ అప్‌హోల్‌స్ట్రేతో రూపొందించిన డ్యూయల్ టోన్ ఇంటీరి థీమ్ కలదు. క్యాబిన్‌లో 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 14-సెన్సార్లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 19 స్పీకర్లతో కూడిన మార్క్ లెవిన్సన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

లెక్సస్ ఎల్ఎక్స్ 570 లగ్జరీ ఎస్‌యూవీలో ఇతర ఫీచర్లయిన వైర్-లెస్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్ల్పే, కూలింగ్ సీట్లు, రియర్ సీట్ ప్యాసింజర్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 11.6-అంగుళాల పరిమాణంలో ఉన్న ఎల్‌సిడి డిస్ల్పేలు మరియు ఆంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ఈ 7-సీటర్ ఎస్‌యూవీలో చివరి వరుస సీట్లను మడిపేస్తే కావాల్సినంత స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

సాంకేతికంగా లెక్సస్ ఎల్ఎక్స్ 570 ఎస్‌యూవీలో 5.7-లీటర్ కెపాసిటి గల వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 362బిహెచ్‌పి పవర్ మరియు 530ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎల్ఎక్స్ 570 మోడల్ ఎల్ఎక్స్ 450డి కంటే అత్యంత వేగవంతమైనది. కేవలం 7.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

లెక్సస్ ఎల్ఎక్స్ 570 ఎస్‌‌యూవీలో డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా వెహికల్‌ను సిద్దం చేసుకునే మల్టీ-టెర్రైన్ సెలెక్ట్ సిస్టమ్ ఉంది. అదే విధంగా ఇందులోని 5-స్పీడ్ క్రాల్ కంట్రోల్ ఆప్-రోడింగ్ కండీషన్స్‌లో ప్రతి చక్రానికి టార్క్ మరియు బ్రేక్స్‌ను అడ్జెస్ట్ చేసుకుంటుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

లెక్సస్ ఇండియా ఛైర్మెన్ ఎన్ రాజా మాట్లాడుతూ, "పనితీరు మరియు ఖచ్చితత్వం గల 2018 లెక్సస్ ఎల్ఎక్స్ యొక్క అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు ఎస్‌యూవీ డిజైన్ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన మోడళ్ల కంటే లెక్సస్ ఎల్ఎక్స్ అత్యంత ఖరీదైనది మరియు ఇది దేశీయ లగ్జరీ ఎస్‌యూవీల మార్కెట్‌ను శాసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు."

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యంత ఖరీదైన మోడళ్లను లగ్జరీ ఫీచర్లతో విడుదల చేస్తున్న లెక్సస్ జపాన్‌కు చెందిన టయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క భాగస్వామ్యపు సంస్థ. దేశీయ లగ్జరీ కార్ల పరిశ్రమలో ఉన్న మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ మరియు రేంజ్ రోవర్ వంటి కంపెనీలకు ఎల్ఎక్స్ 570 విడుదలతో భారీ షాక్ ఇచ్చింది.

More from DriveSpark

Article Published On: Monday, May 21, 2018, 19:17 [IST]
English summary
Read In Telugu: Lexus LX 570 Launched In India; Priced At Rs 2.32 Crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+