మహారాష్ట్ర సీఎం కారుకు భారీ జరిమానా: ఎందుకో తెలుసా..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ శాఖ రహదారి నిమయాలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనానికి రూ. 13,000 జరిమానా ముంబాయ్ పోల
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ శాఖ రహదారి నిమయాలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనానికి రూ. 13,000 జరిమానా ముంబాయ్ పోలీసులు విధించారు.

అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... ఈ జరిమానాను ఇప్పటికీ అటు ముఖ్యమంత్రి లేదా, ఆయన అధికార యంత్రాంగం ఇప్పటి వరకు చెల్లించలేదు. అసలు సీఎం కారు జరిమానా ఎందుకు విధించారో చూద్దాం రండి...

సమాచార హక్కు చట్టం క్రింద సమాచారాన్ని సేకరించే షకీల్ అహ్మద్ ముఖ్యమంత్రి కార్ల యొక్క రహదారి నియమాల ఉల్లంఘన వివరాల కోసం సమచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమంత్రి కారుకు జరిమానా విధించిన సంగతి వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రోడ్డు మార్గ ప్రయాణాల కోసం సురక్షితమైన శత్రుదాడులను తిప్పికొట్టే బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ ఎస్‌యూవీలను వినియోగిస్తున్నాడు. ఇందులో ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్న ఎస్‌యూవీకి రూ. 13,000 జరిమానా విధించారు.

ముఖ్యమంత్రి ప్రయాణించిన వాహనం ముంబాయ్‌లోని బాంద్రా మరియు వొర్లి ప్రాంతాలను కలిపే సముద్ర వంతెన మీద పరిమితికి మించిన వేగంతో వెళ్లిన కారణంగా ఛలనా విధించారు.

ఓవర్ స్పీడింగ్ కేసులను మరియు రహదారి నియమాలను ఉల్లంఘించే వారి ఆటకట్టించేందుకు బాంద్రా-వొర్లి సముద్ర వంతెన మీద ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి ఆటోమేటిక్‌గా ఇ-ఛలానాలను జారీ చేస్తాయి.

ఈ ఏడాది జనవరి నుండి ఆగస్ట్ మధ్య కాలంలో ముఖ్యమంత్రి ప్రయాణించిన వాహనం 5 సార్లు స్పీడ్ లిమిటెడ్ నియమాన్ని ఉల్లంఘించింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉన్న మరో వాహనం 8 సార్లు ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు.

మొత్తం 13 సార్లు స్పీడ్ లిమిట్ ఉల్లంఘించినందుకు ఒక్కో కేసుకు 1,000 రుపాయలు గాను మొత్తం రూ. 13,000 జరిమానా విధించారు. అయితే, ఈ జరిమానాను ఇంత వరకు చెల్లించలేదు. జరిమానా చెల్లించకపోవడానికి కూడా ఓ సరైన కారణం ఉంది.

జరిమానా చెల్లించకపోవడానికి అసలు కారణం?
ముంబాయ్ ట్రాఫిక్ పోలీసుల మేరకు, నిజానికి ముఖ్యమంత్రి కాన్వాయ్ ఈ స్పీడ్ లిమిట్ నియమానికి మినహాయింపు, అయితే సాధారణ వ్యక్తులందరికీ ఈ నియమం వర్తిస్తుంది. సీఎం భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి ఈ రూల్ మినహాయింపని ముంబాయ్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.

బాంద్రా-వొర్లి సముద్ర వంతెన మీద ఓవర్ స్పీడింగ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకోవడం ఈ ఏడాది జనవరిలో ముంబాయ్ ట్రాఫిక్ పోలీసులు సుమారుగా 40 హై-టెక్నాలజీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ కెమెరాలు స్పీడ్ లిమిట్‌ను క్రాస్ చేసే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను గుర్తించి, ఆటోమేటిక్‌గా ఆ వాహనాలకు ఆన్‌లైన్ ద్వారా ఎలక్ట్రానిక్-ఛలనా జారీ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా జోడించారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి జరిమానా వచ్చినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.
Source: NavbharatTimes


Click it and Unblock the Notifications








