మహీంద్రా కెయువి100 ట్యాక్సీ వెర్షన్: విడుదల, ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

Written By:

ఈ మధ్య కాలంలో ట్యాక్సీ మరియు అద్దె కార్ల సేవలు విరివిగా అందుబాటులోకి రావడంతో భారత్‌లో కార్ల తయారీ సంస్థలకు సేల్స్ పరంగా ఈ పరిశ్రమ పెద్ద వరంగా మారింది.

Recommended Video - Watch Now!
Auto Expo 2018: Mahindra KUV100 Electric Launch Details, Specifications, Features - DriveSpark

విపణిలో ఉన్న మారుతి డిజైర్ టూర్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు టయోటా ఎటియోస్ కాంపాక్ట్ సెడాన్ కార్లు ట్యాక్సీలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారతదేశపు యుటిలిటి వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.

మహీంద్రా కెయువి100

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, మహీంద్రా తమ అతి చిన్న కెయువి100 ఎస్‌యూవీని సరికొత్త వేరియంట్లో లాంచ్ చేయడానికి సిద్దమైంది. మహీంద్రా కెయువి100 ట్రిప్ అనే పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా కెయువి100

మహీంద్రా తమ కెయువి100 ట్రిప్ వెర్షన్ ఎస్‌యూవీని 6-సీటింగ్ కెపాసిటి సామర్థ్యం గల కెయువి100 రెగ్యులర్ కె2 వేరియంట్ ఆధారంగా తీసుకొచ్చింది. ట్రిప్ వెర్షన్ కెయువి100 ఎస్‌యూవీలను 5-సీటింగ్ లేఔట్లో ముంబాయ్ వంటి టైర్-1 నగరాల్లో విక్రయించనుంది.

మహీంద్రా కెయువి100

మహీంద్రా కెయువి100 ట్రిప్ వేరియంట్‌ను మహీంద్రా మొట్టమొదటి సారిగా పెట్రోల్- సిఎన్‌జి ఇంజన్ సెటప్‌తో పరిచయం చేయబోతోంది. మహీంద్రా కెయువి100 ట్రిప్ వెర్షన్ పెట్రోల్-సిఎన్‌జి మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది.

మహీంద్రా కెయువి100

రెండు ఇంజన్ వేరియంట్ల పనితీరు రెగ్యులర్ వెర్షన్ తరహాలోనే ఉంటుంది. కెయువి100 పెట్రోల్ వేరియంట్ 70బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ వేరియంట్ 77బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా కెయువి100

ఫీచర్ల పరంగా మహీంద్రా కెయువి100 ట్రిప్ ఎస్‌యూవీలో పవర్ స్టీరింగ్, ఏ/సి, యాంటీ-లాక్ బ్రేకింగా సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు స్టీల్ వీల్స్ ఉన్నాయి. అయితే, పవర్ విండోస్ ఇందులో రాలేదు.

మహీంద్రా కెయువి100

మహీంద్రా కెయువి100 ట్రిప్ వైట్ మరియు సిల్వర్ రంగుల్లో మాత్రమే లభిస్తుంది. తొలుత, దీనిని అద్దె కార్ల నిర్వహణ మరియు ట్యాక్సీ ఆపరేటర్లకు మాత్రమే విక్రయించనుంది.

మహీంద్రా కెయువి100

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ వాహనాలకు పెట్టింది పేరు. ట్యాక్సీ మరియు అద్దె కార్లలో అక్కడక్కడా మహీంద్రా ఎస్‌యూవీలు దర్శనమిస్తుంటాయి. మహీంద్రా వెరిటో సేల్స్ ఆశాజనకంగా లేకపోవడంతో ఇప్పుడు కెయువి100 ద్వారా విక్రయాలు పెంచుకోవాలని మహీంద్రా భావిస్తోంది.

మహీంద్రా కెయువి100 ట్రిప్ ట్యాక్సీ వెర్షన్ సంస్థ సేల్స్ పెరగడానికే కాకుండా, అద్దె కార్ల పరిశ్రమలో ఉన్న ఇతర మోడళ్లకు ఇది గట్టి పోటీనివ్వనుంది. మహీంద్రా కెయువి100 ట్రిప్ ధర రెగ్యులర్ వెర్షన్ కంటే రూ. 20,000 ల నుండి రూ. 30,000 వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా కెయువి100

మారుతి సిద్దం చేసిన ఆ సంచలనాత్మక మోడల్ ఇదే!!

ఫీచర్ల పరంగా లగ్జరీ కార్లను తలదన్నే 12 బెస్ట్ కార్లు

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో: ఎలా సాధ్యం?

English summary
Read In Telugu: Mahindra KUV100 Trip (Taxi Version) Launch Soon: Specs, Features & Details
Story first published: Tuesday, March 6, 2018, 15:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark