Just In
- 1 hr ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 2 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 4 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 7 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Movies పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్‌పై మండిపడ్డ నటి కస్తూరి
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎంపివి కారుల సేల్స్ పరంగా మార్కెట్లో దూసుకెళ్తున్న మహీంద్రా మారాజో
భారతదేశపు అగ్రగామి ఎస్యూవీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తమ సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేసింది. విడుదలైన సుమారు 7 వారలక్కే మార్కెట్లో భారీగా డిమ్యాండ్ పొందుతొంది.
ప్రస్తుతం మార్కెట్లో రూ. 9.9 లక్షల ప్రారంభిక ధరతో అమ్మబడుతున్న మహైడ్రా మారాజో కారు ఇదువరేకు సుమారుగా 10,000 వేలకు పైగా కస్టమర్లు బుక్కింగ్ చేసుకున్నారు. బుక్కింగ్ చేసుకున్న గ్రాహకులు తమ చేతికి కొత్త కారు చేరాలి అంటే కనీసం మరొక్క 6 వారాలు వేట్ చెయ్యాలసిందే.
మహీంద్రా మరాజొ వేరియంట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తమ మరాజొ ఎమ్‌పీవీని నాలుగు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అవి, ఎమ్2, ఎమ్4, ఎమ్6 మరియు ఎమ్8. అయితే, ఈ అన్ని వేరియంట్లు కూడా కేవలం డీజల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమవుతున్నాయి.
మహీంద్రా మరాజొ డిజైన్
ప్రారంభంలో చెప్పినట్లుగా మహీంద్రా బృందం ఈ మరాజొ ఎమ్‌పీవీని షార్క్ చేప ఆధారంగా రూపొందించారు. కాస్త అటు ఇటుగా దీని రూపం షార్క్ చేపనే పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ షార్క్ చేప పళ్ల మాదిరిగానే ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు అగ్రెసివ్ డిజైన్ శైలిలో ఉండే బంపర్ వంటివి ఉన్నాయి.
మరాజొ ఎమ్‌పీవీ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 17-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్. వెనుక వైపున పదునైన ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎత్తులో ఉన్నటువంటి స్టాప్ ల్యాంప్ మరియు స్పోర్టివ్ బంపర్ ఉన్నాయి.
మహీంద్రా మరాజొ ఇంటీరియర్
మహీంద్రా మరాజొ ఇంటీయర్‌లో డ్యూయల్-టోన్ థీమ్ ఫినిషింగ్ కలదు. బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల డ్యాష్ బోర్డు మరియు సీట్లు, డోర్ ట్రిమ్స్ మరియు అప్హోల్స్ట్రే లేత గోధుమ రంగులో ఉన్నాయి.
మహీంద్రా మరాజొ ఫీచర్లు
మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లో అత్యంత కీలకమైన 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈ సెగ్మెంట్లోనే మొట్టమొదటిసారిగా సరౌండ్ కూలింగ్ టెక్నాలజీ గల రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, ఎమ్ఐడి యూనిట్ గల డ్యూయల్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సరికొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ రూపొందించిన హ్యాండ్ బ్రేక్ లీవర్ వంటి విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా మరాజొ 7 మరియు 8 సీటింగ్ లేఔట్లో లభ్యమవుతోంది. 7-సీటర్ వేరియంట్లోని మధ్య వరుసలో ఇద్దరు మాత్రమే ప్రయాణించే క్యాప్టెన్ సీట్లు ఉన్నాయి మరియు 8-సీటర్ వేరియంట్లో మధ్య వరుసలో ముగ్గురు ప్రయాణించే సౌలభ్యం ఉంది. క్యాబిన్ లోపల నలుమూలకు ఏసి అందేలా ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి సరౌండ్ కూలింగ్ సిస్టమ్ వచ్చింది.
భద్రత పరంగా మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎమ్‌పీవీ సెగ్మెంట్లో మొదటిసారిగా అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్లు ఉన్నాయి. మరాజొ ఎమ్6 మరియు ఎమ్8 టాప్ ఎండ్ వేరియంట్లలో అదనంగా రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా, కార్నరింగ్ ల్యాంప్స్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా మరాజొ ఇంజన్ వివరాలు
మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 120బిహెచ్పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది.
మహీంద్రా మరాజొ మైలేజ్
మహీంద్రా మరాజొ డీజల్ లీటరుకు 17.6 కిలోమీటర్లు ఇస్తుంది. మహీంద్రా త్వరలో మరాజొ ఎమ్‌పీవీని పెట్రోల్ వేరియంట్లో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, భారత్‌లో అధికారికంగా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు అమలయ్యేనాటికి పెట్రోల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
మరాజొ లభించే రంగులు
మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ మొత్తం ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. మెరైనర్ మెరూన్, షిమ్రింగ్ సిల్వర్, అక్వా మెరైన్, ఓషియేనిక్ బ్లాక్, పోసిడన్ పర్పులు మరియు ఐస్‌బర్గ్ వైట్.