మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వెల్లడించిన మహీంద్రా

మహీంద్రా తమ సరికొత్త టియువి300 ప్లస్ ఎస్‌యూవీని అఫీషిల్ వెబ్‌సైట్లో చేర్చింది. టియువి30 యొక్క లాంగ్ వీల్ బేస్ వెర్షన్ టియువి300 ప్లస్ ఎస్‌యూవీని పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించిన మహీంద్రా ఎట్టకే

By Anil Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా తమ సరికొత్త టియువి300 ప్లస్ ఎస్‌యూవీని అఫీషిల్ వెబ్‌సైట్లో చేర్చింది. టియువి30 యొక్క పొడగించబడి వెర్షన్ లేదా లాంగ్ వీల్ బేస్ వెర్షన్ టియువి300 ప్లస్ ఎస్‌యూవీని పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించిన మహీంద్రా ఎట్టకేలకు తమ మోడళ్ల జాబితాలోకి టియువి300 ప్లస్ మోడల్‌ను చేర్చింది.

ప్రస్తుతం, టియువి300 ప్లస్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వెల్లడించిన మహీంద్రా

మహీంద్రా అధికారిక వెబ్‌సైట్లో ఉన్న సమాచారం మేరకు, టియువి300 ప్లస్ కేవలం పి4 అనే సింగల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. మహీంద్రా టియువి300 ప్లస్ పి4 వేరియంట్ ధర రూ. 9.69 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ యొక్క పొడవాటి వెర్షన్ టియువి300 ప్లస్‌లో మూడవ వరుస సీటింగ్ కూడా కలదు.

మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వెల్లడించిన మహీంద్రా

మహీంద్రా టియువి300 ప్లస్ ఎస్‌యూవీ యొక్క సాంకేతిక వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. అంతే కాకండా, పలు ప్రాంతాల్లో కొంత మంది కస్టమర్లు ఈ వాహనాన్ని డెలివరీ కూడా తీసుకున్నారు. టియువి300 ప్లస్ ఎస్‌యూవీ పొడవు స్టాండర్డ్ ఎస్‌యూవీ కంటే 403ఎమ్ఎమ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, దీని వీల్‌బేస్‌ 2,680ఎమ్ఎమ్ ఏ మాత్రం మారలేదు.

మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వెల్లడించిన మహీంద్రా

మహీంద్రా టియువి300 ప్లస్ 9-సీటర్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉంటుంది. ఇంందుకు కీలకమైన వెనుక వైపున పొడగించిన బాడీకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అంతే కాకుండా, టియువి300 ప్లస్‌ వాహనంలో లగేజ్ స్పేస్ కూడా అధికంగా ఉంది. మార్కెట్లో ఉన్న టియువి300 మరియు స్కార్పియో మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వెల్లడించిన మహీంద్రా

డిజైన్ పరంగా మహీంద్రా టియువి300 ప్లస్ చూడటానికి అచ్చం స్టాండర్డ్ వెర్షన్ టియువి300 ఎస్‌యూవీనే పోలి ఉంటుంది. వెనుక వైపున సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వెల్లడించిన మహీంద్రా

సాంకేతికంగా మహీంద్రా టియువి300 ప్లస్ ఎస్‌యూవీలో 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు. ఇది, 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టియువి300 ప్లస్ పొడవు నాలుగు మీటర్ల కంటే ఎక్కువగా ఉండటంతో 1.5-లీటర్ ఇంజన‌కు బదులుగా శక్తివంతమైన 2.2-లీటర్ ఇంజన్‌తో వచ్చింది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది.

మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వెల్లడించిన మహీంద్రా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా ఎంతో కాలంగా టియువి300 ప్లస్ అభివృద్ది మీద పనిచేస్తోంది. టియువి300 ఎస్‌యూవీని 9-సీటింగ్ వెర్షన్‌లో అందించేందుకు శ్రమించిన మహీంద్రా ఫలితం ఎట్టకేలకు సఫలం కాబోతోంది. అమ్మకాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మహీంద్రా టియువి300 ప్లస్ జూన్ 2018లో విడుదల కానుంది.

Image Source: TUV300/Facebook

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra TUV300 Plus Price Revealed On The Official Website
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X