ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో: ఎలా సాధ్యం?

రోడ్డుకు సుమారుగా 20 అడుగుల దూరంలో ఉన్న ఇంటి మీదకు మారుతి బాలెనో కారు దూసుకెళ్లింది. లక్కీగా ఆ ఇంటి రూఫ్ టాప్ రోడ్డుకు సమానంగా ఉండటంతో 100 అడుగుల లోయలో పడకుండా సేఫ్‌గా అక్కడే ల్యాండ్ అయ్యింది.

By Anil Kumar

Recommended Video

Horrific Footage Of Volkswagen Polo Exploding At A CNG Filling Station

రోడ్డుకు సుమారుగా 20 అడుగుల దూరంలో ఉన్న ఇంటి మీదకు మారుతి బాలెనో కారు దూసుకెళ్లింది. లక్కీగా ఆ ఇంటి రూఫ్ టాప్ రోడ్డుకు సమానంగా ఉండటంతో 100 అడుగుల లోయలో పడకుండా సేఫ్‌గా అక్కడ ల్యాండ్ అయ్యింది. డ్రైవర్ అదృష్టం బాగుండటంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

అంతా బాగానే ఉంది, అసలు రోడ్డు మీద నుండి ఆ ఇంటి మీదకు కారు ఎలా వెళ్లిందనేది అంతు చిక్కని మ్యాటర్. చాలా ఇరుకుగా ఉంటే ఆ రోడ్డులో అధిక వేగంతో ప్రయాణించే అవకాశం కూడా లేదు. ఇక పోతే మన ఇండియన్ కార్లలో ఇలా గాల్లోకి ఎగిరే ఫీచర్లు లేవు, అందులోనూ అది ర్యాలీ కారు కూడా కాదు. మరి ఎలా...?

అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న సంఘటన గురించి వివరంగా...

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

కారు, కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సంభవించిన ఈ యాక్సెడెంట్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఉన్న సర్కాఘాట్‌లో చోటు చేసుకుంది. ప్రాథమిక నివేదిక ప్రకారం, బాలెనో కారు నియంత్రణ కోల్పోవడంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

నిజానికి, కారు అధిక వేగంలో ఉంటే మాత్రమే గాల్లోకి ఎగిరే అవకాశం ఉంది. అయితే, కారు కంట్రోల్ తప్పి ప్రక్కకు వెళ్లినపుడు రోడ్డు అంచుల వెంబడి కొద్దిగా వాలుతో ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టింది.

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

నిర్ణీతం వేగంలో ఉన్న కారు సిమెంట్ దిమ్మెల కారణంగా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. డ్రైవర్ అదృష్టవశాత్తు రోడ్డుకు 20 అడుగుల దూరంలో నిర్మాణ దశలో ఉన్న ఇంటి పైకప్పు మీదకు దిగింది.

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

ఖచ్చితంగా ఇంటి మీదకు ల్యాండ్ అవ్వడానికి మరో కారణం ఉంది. కారు క్యాబిన్ కారణంగా ముందు లేదా వెనుకకు కాకుండా ఖచ్చితంగా ఇంటి మీదనే దిగింది. బాలెనో కారు క్యాబిన్ పొడవుగా ఉన్నా లేదంటే పొట్టిగా ఉన్నా... 100 అడుగుల లోయలోకి పడిపోవడం ఖచ్చితం.

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

కారు ఇంటి పైకప్పు మీదుకు కారు ఎలా వెళ్లిందనేది ఆశ్చర్యకరమైన విషయం అయితే, అక్కడి నుండి ఆ కారును ఎలా క్రిందకు దించారనేది మరో ఆసక్తికరమైన విషయం. ఇంటి మీద నుండి మళ్లీ రోడ్డు మీదుకు తీసుకొచ్చేందుకు కారు డ్రైవర్ మరియు స్థానికుల తీవ్రంగానే శ్రమించారు.

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

రోడ్డుకు సమాంతరంగా ఉన్న ఇంటి మీదకు రోడ్డు నుండి మూడు పెద్ద ఇనుప స్తంభాలను వేసి, వాటి మీద ఇనుప ఫలకలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి అత్యంత చాకచక్యంగా కారును వెనక్కి తీసుకొచ్చారు.

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

ప్రమాదానికి గురైన ఆ కారు మారుతి బాలెనో డెల్టా వేరియంట్. సాంకేతికంగా ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

https://www.facebook.com/beautyofkangra/videos/1639796286105908/

ఇంటి టెర్రస్ మీదకు ల్యాండ్ కారు వీడియో మీద ఓ లుక్కేసుకోండి...

ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి బాలెనో

Source: Rushlane

More from DriveSpark

Article Published On: Monday, March 5, 2018, 13:14 [IST]
English summary
Read In Telugu: Maruti Baleno end up on the roof of a house
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+