నూతన కలర్ స్కీములో మారుతి ఇగ్నిస్ మరియు బాలెనో

Written By:

మారుతి ఇగ్నిస్ అతి త్వరలో ఒక కొత్త కలర్ స్కీములో పరిచయం కానుంది. ప్రస్తుతం ఉన్న అర్బన్ బ్లూ కలర్‌ను తొలగించి, దీని స్థానంలో నెక్సా బ్లూ అనే కలర్ స్కీమును భర్తీ చేయడానికి మారుతి సుజుకి సిద్దమవుతోంది.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి సుజుకి తమ అర్బన్ బ్లూ ఇగ్నిస్ క్రాసోవర్ కారు ప్రొడక్షన్‌ను నిలిపేసింది. ఇక మీదట దీని స్థానంలో వస్తోన్న నెక్సా బ్లూ రంగులో ఇగ్నిస్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

మారుతి సుజుకి ఇగ్నిస్ ప్రస్తుతం నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా. ప్రస్తుతం ఉన్న అర్బన్ బ్లూ కలర్ స్కీమ్ ఇగ్నిస్ బేస్ వేరియంట్ సిగ్మా మినహా మిగిలిన అన్ని వేరియంట్లలో లభించేది. నెక్సా బ్లూ కూడా కేవలం మూడు వేరియంట్లకు పరిమితం కానుంది.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

కొత్తగా వచ్చి చేరుతున్న నెక్సా బ్లూ కలర్ మినహా, ఇగ్నిస్ క్రాసోవర్ మరో ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, పర్ల్ ఆర్కిటిక్ వైట్, గ్లిస్టెనింగ్ గ్రే, సిల్కీ సిల్వర్, అప్‌టౌన్ రెడ్ మరియు టిన్సల్ బ్లూ.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

ఇగ్నిస్ టాప్ రెండు వేరియంట్లు జెట్ మరియు ఆల్ఫా డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతున్నాయి. అవి, అప్‌టౌన్ రెడ్ మరియు టిన్సెల్ బ్లూ కలర్స్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో లభిస్తున్నాయి. అదే విధంగా టిన్సెల్ బ్లూ అదనంగా పర్ల్ ఆర్కిటిక్ వైట్ రూఫ్ టాప్‌తో కూడా లభిస్తోంది.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

ఇగ్నిస్ మాత్రమే కాకుండా, మారుతి సుజుకి తమ బాలెనో హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా నెక్సా బ్లూ కలర్ ఆప్షన్‌న భర్తీ చేయనుంది. స్టాండర్డ్ వేరియంట్లలో లభించే అర్బన్ బ్లూ కలర్ స్కీమును భర్తీ చేస్తున్న నెక్సా బ్లూ ప్రత్యేకత ఏమింటే చీకటిలో ఇగ్నిస్ మరియు బాలెనో రెండు కార్లు కూడా కొద్దిగా ఊదా రంగును పులుముకున్నట్లు కనిపిస్తుంది.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్ జోడింపు మినహాయిస్తే, సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. గత ఏడాది ప్రారంభంలో విడుదలైన ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

వీటిలో, పెట్రోల్ మోడల్ 81బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, డీజల్ వేరియంట్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి ఇగ్నిస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.59 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ధరకు తగ్గ విలువలున్న ఎన్నో ఫీచర్లు ఇగ్నిస్ క్రాసోవర్ సొంతం. యువ మరియు అర్బన్ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని, బాక్సీ డిజైన్ స్టైల్లో ఎస్‌యూవీ మరియు హ్యాచ్‌బ్యాక్ డిజైన్ అంశాలతో ఇగ్నిస్ క్రాసోవర్ కారును డెవలప్ చేశారు. ఏదేమైనప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో కొత్త కలర్ ఆప్షన్ పరిచయం చేయడంతో ఇగ్నిస్ సేల్స్ మరింత పుంజుకోనున్నాయి.

మారుతి బాలెనో మరియు ఇగ్నిస్ నెక్సాన్ బ్లూ రంగు

1. ఈ వీడియో చూశాకైనా మారండి!!

2.ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లు

3.కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లో ఈ పదాలు అర్థం కావట్లేదా?

4.ఇండియన్ రోడ్ల మీద సమ్మర్ డ్రైవింగ్ కోసం 9 సేఫ్టీ టిప్స్

5.కారు స్టార్ట్ కాకపోవడానికి గల మెయిన్ రీజన్స్

Source: CarDekho

English summary
Read In Telugu: Maruti Ignis And Baleno To Feature A New Colour — To Enhance Appearance In The Dark
Story first published: Wednesday, April 4, 2018, 16:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark