మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్: కొత్త ఫీచర్లు మరియు ధరలు
మారుతి సుజుకి విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా ఎమ్‌పీవీ వాహనాన్ని ప్రవేశపెట్టింది.
మారుతి సుజుకి విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా ఎమ్‌పీవీ వాహనాన్ని ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి 'Togetherness is the new style' అనే ట్యాగ్ లైన్‌తో సరికొత్త ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ ఎమ్‌పీవీని మూడు సరికొత్త వీడియోలతో పరిచయం చేసింది.

ప్రస్తుత తరానికి చెందిన ఎర్టిగా ఎమ్‌పీవీ స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేసే ఉద్దేశ్యంతోనే లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిసింది. లిమిటెడ్ ఎడిషన్ పరిచయం చేయడంతో మారుతి అతి త్వరలో విడుదల చేయబోయే 2018 ఎర్టిగా మోడల్ మార్గం సుగమం అవుతుంది.

లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో భాగంగా మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీ ఎక్ట్సీరియర్‌లో ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ బెజెల్ హౌసింగ్స్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ సైడ్ మౌల్డింగ్స్, రూఫ్ రెయిల్స్ మరియు వెనుక వైపున లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.

అంతే కాకుండా, మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ ఎమ్‌పీవీని మూడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, సిల్కీ సిల్వర్, సూపీరియర్ వైట్ మరియు మెరూన్.

లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా ఇంటీరియర్‌లో డోర్ ట్రిమ్స్, లెథర్ సీట్లు, స్టీరింగ్ వీల్ కవర్ మరియు డ్యాష్‌బోర్డ్ మీద ఫాక్స్ వుడ్ అలంకరణలు వచ్చాయి.

లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా వాహనంలో జరిగిన అన్ని మార్పులు కూడా ఆకర్షణీయంగా కనిపించేందుకే జరిగాయి. సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరిగాయి.

సాంకేతికంగా మారుతి ఎర్టిగా అవే మునుపటి 1.4-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ మల్టీజెట్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. వీటిలో పెట్రోల్ ఇంజన్ 90బిహెచ్‌పి పవర్-130ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ - 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

మారుతి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. అదనంగా పెట్రోల్ మోడల్‌ను 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.
మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ ధరలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే, వీటి ధరల శ్రేణి రూ. 7.8 లక్షల నుండి రూ. 8. లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి సుజుకి ప్రస్తుత తరానికి చెందిన ఎర్టిగా పాత స్టాకును క్లియర్ చేసుకునేందుకు ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతి త్వరలో కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీవీ విడుదలకు సన్నాహాలు ప్రారంభించింది. అరుదైన మరియు పాత మోడల్ కోరుకునే కస్టమర్లు ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎంచుకోవచ్చు. కొత్త తరం ఎర్టిగా కావాలనుకునే కస్టమర్లు ఈ ఏడాది మలిసగం వరకు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








