బాలెనో, వితారా బ్రిజా, స్విఫ్ట్ కార్లతో రోజుకు 5,000 విక్రయాలు జరిపిన మారుతి

Written By:
Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

భారతదేశపు అతి పెద్ద మరియు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన నెల వారీ విక్రయాలతో పోటీదారులను ఖంగుతినేలా చేసింది. మారుతి గడిచిన ఫిబ్రవరి 2018లో 1,37,900 కార్లను విక్రయించింది.

మారుతి సుజుకి సేల్స్

ఇది మాత్రమే కాదు, మరో రికార్డును కూడా సాధించింది. మారుతి లైనప్‌లో ఉన్న బాలెనో, వితారా బ్రిజా మరియు స్విఫ్ట్ ఈ మూడు కార్లతో రోజుకు 5,000 యూనిట్ల సేల్స్ సాధించింది. మారుతి కార్లు హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నాయనడానికి ఇదే నిదర్శనం.

మారుతి సుజుకి సేల్స్

ఫిబ్రవరి 2017లో మారుతి 1,20,000 కార్లను విక్రయించగా, ఈ ఏడాది అదే ఫిబ్రవరి నెలలో 1,37,900 కార్లను విక్రయించి 15 శాతం వార్షిక వృద్దిని నమోదు చేసుకుంది. మారుతి లైనప్‌లోని హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్లతో పాటు ఎస్‌యూవీల సేల్స్ బాగా కలిసొచ్చాయి.

మారుతి సుజుకి సేల్స్

ఏదేమైనప్పటికీ, బాలెనో, కొత్తగా విడుదలైన స్విఫ్ట్ మరియు సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీ వితారా బ్రిజా వెహికల్స్ మిగతా వాటికంటే మెరుగైన ఫలితాలు సాధించాయి. మారుతి మొత్తం విక్రయాల్లో హ్యాచ్‌బ్యాక్ మరియు యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లదే పైచేయి.

మారుతి సుజుకి సేల్స్

కొన్ని వారాల కిందట మార్కెట్లోకి విడుదలైన థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ కేవలం నెల రోజుల్లోపే 65,000 లకు పైగా బుకింగ్స్ సాధించింది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే స్విఫ్ట్ హ్యాచ్‍‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

మారుతి సుజుకి సేల్స్

మారుతి సుజుకి స్విఫ్ట్‍‌లోని పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్‌ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించింది. స్విఫ్ట్ చరిత్రలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రావడం ఇదే తొలిసారి. న్యూ డిజైర్ కారును అభివృద్ది చేసిన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద స్విఫ్ట్ కారును నిర్మించారు.

ఫీచర్ల పరంగా లగ్జరీ కార్లను తలదన్నే 12 బెస్ట్ కార్లు

8 లక్షల ధరలో లభించే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఒక్కసారి ఛార్జింగ్‌తో 469 కిమీలు ప్రయాణించే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

మారుతి సుజుకి సేల్స్

మారుతికి అత్యధిక విక్రయాలు సాధించిపెడుతున్న బాలెనో ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. విశాలమైన ఇంటీరియర్, ప్రీమియమ్ ఫీల్ కలిగించే ఫీచర్లు, అత్యుత్తమ మైలేజ్ దీని సొంతం.

మారుతి సుజుకి సేల్స్

పవర్‌ఫుల్ వెర్షన్ కోరుకునే వారి కోసం బాలెనో ఆర్ఎస్ మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. ఇందులో అత్యంత శక్తివంతమైన మరియు ప్రత్యేకంగా రూపొందించిన 1-లీటర్ టుర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. బాలెనో ప్రారంభ ధర రూ. 5.5 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

మారుతి సుజుకి సేల్స్

మారుతి సుజుకి ఇండియాకు అత్యధిక విక్రయాలు సాధించిపెట్టిన మోడల్ వితారా బ్రిజా. భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. ప్రతి నెలా 10,000 యూనిట్ల విక్రయాలు సాధిస్తోంది.

మారుతి సుజుకి సేల్స్

మారుతి వితారా బ్రిజా కేవలం డీజల్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్లో లభించే ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీల నుండి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరీ సెగ్మెంట్ మొత్తాన్ని శాసిస్తోంది.

మారుతి సుజుకి సేల్స్

కస్టమర్లు ఎక్కువగా వితారా బ్రిజా ఎస్‌యూవీని ఎంచుకోవడానికి గల కారణాల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందివ్వడం, టాప్ ఎండ్ వేరియంట్లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేయగల స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండటం. వితారా బ్రిజా ప్రారంభ ధర రూ. 7.2 లక్షలుగా ఉంది.

English summary
Read In Telugu: Maruti Suzuki sells nearly 5,000 cars/day in February, driven by Baleno, Swift & Vitara Brezza

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark