ప్రపంచ తొమ్మిదవ అత్యంత విలువైన కారు బ్రాండుగా మారుతి సుజుకి

భారతదేశపు అతి పెద్ద, ప్రతి నెలా అత్యధిక సేల్స్ సాధించే, ప్రతి నెలలో ఎక్కువ మోడళ్లు విక్రయించే, ప్రతి సెగ్మెంట్లో పైచేయి సాధిస్తున్న కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి ఎన్నో ఏళ్ల నుండి రాణిస్తోంది.

By Anil Kumar

భారతదేశపు అతి పెద్ద, ప్రతి నెలా అత్యధిక సేల్స్ సాధించే, ప్రతి నెలలో ఎక్కువ మోడళ్లు విక్రయించే, ప్రతి సెగ్మెంట్లో పైచేయి సాధిస్తున్న కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి ఎన్నో ఏళ్ల నుండి రాణిస్తోంది. ఈ విజయం ఇండియాతో ఆగిపోలేదు.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

మొట్టమొదటిసారిగా, ప్రపంచపు అత్యంత విలువైన 10 కార్ల బ్రాండ్ల జాబితాలో మారుతి సుజుకి స్థానం సంపాదించుకుంది. భారతదేశ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

బ్రాండ్జ్ (BrandZ) సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచపు అత్యంత విలువైన పది ప్యాసింజర్ కార్ల బ్రాండ్లలో తొలి భారతీయ కంపెనీ మారుతి సుజుకి స్థానం దక్కించుకుంది.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 10 స్థానంలో నిలిచిన వోక్స్‌వ్యాగన్ కంటే పై స్థానాన్ని మారుతి సుజుకి సొంతం చేసుకుంది. సర్వే ప్రకారం, మారుతి సుజుకి మొత్తం విలువ 6,375 బిలియన్ అమెరికన్ డాలర్లు, వోక్స్‌వ్యాగన్ విలువ 5,986 బిలియన్ అమెరికన్ డాలర్లు.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

బ్రాండ్జ్ కథనం మేరకు, మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో ప్రారంభించిన నెక్సా డీలర్‌ నెట్‌వర్క్ కారణంగానే మారుతికి ఈ జాబితాలో చోటు దక్కినట్లు వెల్లడించింది. ఎలాంటి అదనపు ధరలు లేకుండానే విలాసవంతమైన స్పూర్తితో కార్లను విక్రయిస్తున్నట్లు బ్రాండ్జ్ తెలిపింది.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

అంతే కాకుండా, మారుతి సుజుకి సేల్స్‌ను భారీగా పెంచిన వితారా బ్రిజా ఎస్‌యూవీ కూడా ఇందుకు కారణం. ఎస్‌యూవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా రాణించిన వితారా బ్రిజా అంతర్జాతీయ ఎస్‌యూవీ విపణిలో మారుతి సుజుకి ఉనికిని పెంచింది.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

ప్రపంచపు అత్యంత విలువైన పది కార్ల బ్రాండ్లలో టయోటా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఆరవ ఏడాది కూడా ఈ జపాన్ దిగ్గజం తన స్థానాన్ని పధిలం చేసుకుంది. టయోటా బ్రాండ్ మొత్తం విలువ 29,987 బిలియన్ అమెరికన్ డాలర్లు. గత ఏడాదితో పోల్చుకుంటే 5 శాతం వృద్దిని సాధించింది.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

జర్మన్ దిగ్గజాలు మెర్సిడెస్ బెంజ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ వరుసగా 25,684 బిలియన్ మరియు 25,624 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో రెండవ మరియు మూడవ స్థానాలను సొంతం చేసుకున్నాయి.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా టాప్-10 జాబితాలో 8 వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మారుతి సుజుకి పై స్థానంలో నిలిచిన టెస్లా కంపెనీ సంపద 9,415 బిలియన్ డాలర్లు. మరియు కేవలం ఒక్క ఏడాదితోనే 60 శాతం వృద్దిని సాధించింది. ఇతర కార్ల కంపెనీలైన ఫోర్డ్, హోండా, నిస్సాన్ మరియు ఆడి వరుసగా 4, 5, 6 మరియ 7వ స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచ అత్యంత విలువైన కారు బ్రాండ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు తొలి ప్యాసింజర్ కార్ల కంపెనీ ప్రపంచపు అత్యంత విలువైన కార్ల బ్రాండ్ల జాబితాలో స్థానం సంపాదించుకుంది. మారుతి కేవలం చివరి ఏడాది ఫలితాలతోనే ఈ సక్సెస్ సాధించింది. గత రెండేళ్లలో ప్రవేశపెట్టిన విసృత శ్రేణి ఉత్పత్తులకు మంచి ప్రజాదరణ లభించింది. దీంతో దేశీయ సేల్స్‌తో పాటు ఎగుమతులు కూడా ఊపందుకున్నాయి. ఎట్టకేలకు ఈ జాబితాలో ఈ భారతీయ కంపెనీ అడుగుపెట్టింది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Is World’s Ninth Most Valuable Brand; First Indian Car Brand In Global Rankings
Story first published: Thursday, May 31, 2018, 18:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X