భారత్‌లో మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ విడుదలకు మొండిచెయ్యి!!

ఇండియన్ మార్కెట్లో భారీ విజయాన్ని అందుకున్న స్విఫ్ట్ యొక్క స్పోర్ట్‌ వేరియంట్‌ను మాత్రం భారత్‌లో విడుదల చేసేందుకు వెనకడుగు వేస్తోంది.

By Anil Kumar

దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమంలో ప్రసిద్దిగాంచిన మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అంతర్జాతీయ విపణిలో స్పోర్ట్ వెర్షన్‌లో లభ్యమవుతోంది. ఇండియన్ మార్కెట్లో భారీ విజయాన్ని అందుకున్న స్విఫ్ట్ యొక్క స్పోర్ట్‌ వేరియంట్‌ను మాత్రం భారత్‌లో విడుదల చేసేందుకు వెనకడుగు వేస్తోంది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

ప్రతి సామాన్యుడు ఎంతగానో విశ్వసించే మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్ట్ వేరియంట్ భారత్ విడుదలకు నోచుకోకపోవడానికి గల కారణాలు మరియు స్విఫ్ట్ స్పోర్ట్ విడుదల పట్ల మారుతి సుజుకి అభిప్రాయం ఏంటో చూద్దాం రండి...

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

ప్రపంచ వ్యాప్తంగా కుడి వైపు డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న ఎన్నో మార్కెట్లలో స్విఫ్ట్ స్పోర్ట్ అమ్ముడవుతోంది. కానీ, ప్రపంచంలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకు అతి పెద్ద మార్కెట్ అయిన భారత్‌లో మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

స్విఫ్ట్ స్పోర్ట్ వేరియంట్ రెగ్యులర్ స్విఫ్ట్ కారు కంటే అత్యంత శక్తివంతమైనది. సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇటీవల కాలంలో శక్తివంతమైన ఇంజన్ గల పవర్‌ఫుల్ స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకునే ఔత్సాహికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, మారుతి సుజుకి అలాంటి ఔత్సాహికులకు నిరాశనే మిగిల్చింది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

అంతర్జాతీయ సుజుకి కార్ల లైనప్‌లో ఉన్న స్విఫ్ట్ టాప్ ఎండ్ మోడల్ స్విఫ్ట్ స్పోర్ట్ ఇండియా విడుదల ఉండబోదని ఇటీవల స్పష్టం చేసింది. బెంగళూరు వేదికగా మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేస్తున్నపుడు మారుతి అధికారులు ఈ విషయం గురించి స్పష్టత ఇచ్చారు.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ రాకపోవడానికి గల ప్రధాన కారణం అత్యధిక ధర. పూర్తి స్థాయిలో తయారైన కార్ల మీద దిగుమతి సుంకం భారీగా ఉంది. దీంతో మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ ధర సుమారుగా రూ. 20 నుండి 25 లక్షల మధ్య ఉండవచ్చు.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

ఇండియాలో మారుతి విక్రయించే ఏ కారు ధర కూడా ఇంత లేదు. పైగా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టడంతో స్విఫ్ట్ స్పోర్ట్ ఇండియా విడుదల ఏ మాత్రం కలిసొచ్చే అవకాశం లేదనేది మారుతి సుజుకి అభిప్రాయం.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

20 నుండి 25 లక్షల ధరలో లగ్జరీ ఫీల్ కలిగించే స్కోడా ఆక్టావియా సెడాన్ మరియు జీప్ కంపాస్ ఎస్‌యూవీ వంటి మోడళ్లు ఉన్నాయి. కాబట్టి, ఈ ధరల శ్రేణిలో ఉన్న మోడళ్లతో మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ పోటీ పడే అవకాశాలు కూడా దాదాపు తక్కువే.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

స్విఫ్ట్ స్పోర్ట్ ఇంజన్ విషయానికి వస్తే, సాంకేతికంగా ఇందులో 1.4-లీటర్ సామర్థ్యం నాలుగు సిలిండర్ల టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదనంగా ధృడమైన సస్పెన్షన్ సిస్టమ్ మరియు పలు డిజైన్ అప్‌డేట్స్ ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

భవిష్యత్తులో మరి ఎలాంటి ఉత్పత్తులు రానున్నాయి?

ఎన్నో రకాల ఉత్పత్తులో విపరీతమైన సేల్స్ సాధిస్తున్న మారుతి సుజుకి భవిష్యత్తులో ఎలాంటి ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది అంటే... స్విఫ్ట్ ఆర్ఎస్ వరుసలో మొదటి స్థానంలో ఉంది. అవును, బాలెనో ఆర్ఎస్ తరహాలో స్విఫ్ట్ ఆర్ఎస్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్ వేరియంట్లో సాంకేతికంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.0-లీటర్ కెపాసిటి గల టర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ రానుంది. బాలెనో ఆర్ఎస్ వేరియంట్లో కూడా ఇదే ఇంజన్ కలదు. దీని ధర సుమారుగా రూ. 7.5 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Swift Sport will not launch in India – Because it will be too expensive
Story first published: Wednesday, August 22, 2018, 13:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X