మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలు

మెర్సిడెస్ బెంజ్ విపణిలోకి సరికొత్త 2018 మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ (2018 Mercedes-AMG E63 S) లగ్జరీ కారును విడుదల చేసింది. సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ ధర రూ. 1.50 కోట్లు

By Anil Kumar

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ విపణిలోకి సరికొత్త 2018 మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ (2018 Mercedes-AMG E63 S) లగ్జరీ కారును విడుదల చేసింది. సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ ధర రూ. 1.50 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో ఉన్న ఏఎమ్‌జి సెలూన్ లగ్జరీ కార్లలో ఇ63 ఎస్ అత్యంత శక్తివంతమైన వెర్షన్. ఢిల్లీలోని బుద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద మెర్సిడెస్ తమ 2018 ఏఎమ్‌జి ఇ63 ఎస్ లగ్జరీ సెలూన్‌ను విడుదల చేసి, ఆటోమోటివ్ జర్నలిస్టులకు డ్రైవ్ చేసే అవకాశాన్ని కల్పించింది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

మెర్సిడెస్-ఏఎమ్‌జి ఇ63 ఎస్ అత్యంత శక్తివంతమైన ఇ-క్లాస్ కారుగా నిలిచింది. సాంకేతికంగా ఇందులో 4.0-లీటర్ కెపాసిటి గల బైటుర్బో వి8 ఇంజన్ కలదు. 9-స్పీడ్ ఏఎమ్‌జి స్పీడ్‌షిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 612బిహెచ్‌పి పవర్ మరియు 850ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

మెర్సిడెస్-బెంజ్ వారి 4మ్యాటిక్ ప్లస్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ లోని ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌‍ను కేవలం రియర్ డ్రైవ్‌గా మార్చుకునే అవకాశం ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

దీనిని మరింత సింపుల్‌గా డ్రిఫ్టింగ్ అని కూడా చెప్పవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ630 ఎస్ కేవలం 3.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250కిలోమీటర్లకు పరిమితి చేయబడింది. అయితే, ఏఎమ్‌జి డ్రైవర్ ప్యాకేజీని ఎంచుకుంటే గరిష్ట వేగాన్ని గంటకు 300కిలోమీటర్లకు పెంచుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఏఎమ్‌జి ఇ63 ఎస్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ వారి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఏఎమ్‌జి జిటిఆర్ కంటే అత్యంత వేగవంతమైనది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

మైలేజ్ పెంచడం కోసం, మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్‌లో సిలిండర్ డియాక్టివేషన్ ఫీచర్ అందివ్వడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా తక్కువ లోడ్ ఉన్నపుడు ఇంజన్‌లోని 2,3,4 మరియు 8 వ సిలిండర్లు పని చేయకుండా పవర్ కట్ చేస్తుంది. దీంతో ఇంధనం పొదుపు జరిగి మైలేజ్ పెరుగుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

ఇంటీరియర్ విషయానికి వస్తే, అత్యాధునిక టెక్నాలజీతో హై లెవల్ లగ్జరీ మరియు సౌకర్యాన్ని మెర్సిడెస్ ఇందులో కల్పించింది. మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ ఇంటీరియర్‌లో 12.5-అంగుళాల పరిమాణంలో ఉన్న రెండు డిస్ల్పేలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కాగా మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ లగ్జరీ కారులో ఉన్న ఇతర ముఖ్యమైన ఫీచర్లు:

  • ఏఎమ్‌జి పర్ఫామెన్స్ సీట్లు
  • సీట్ హీటింగ్ మరియు కూలింగ్
  • త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్
  • బర్మెస్టర్ ఆడియో సిస్టమ్
  • కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ మరియు రేస్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్
  • తొమ్మిది ఎయిర్ బ్యాగులు
  • పలు రకాల డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ ఫీచర్లు
  • లోపల మరియు బయట కార్బన్-ఫైబర్ విడి భాగాలు
  • మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

    మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ3 ఎస్ ప్రస్తుతం విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5, మాసేరాటి క్వాట్రోపోర్టే జిటిఎస్, పోర్షే పానమెరా టుర్బో మరియు ఆడి ఆర్ఎస్6 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

    మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ విడుదల

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    2018 మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ ఇండియాలో లభించే అత్యంత అద్భుతమైన ఏఎమ్‌జి మోడల్. మెర్సిడెస్ ఏఎమ్‌జి మోడళ్లు పేరుకు తగ్గట్లుగానే అద్బుతమైన పర్పామెన్స్ మరియు క్యారెక్టర్ కలిగి ఉంటాయి. వాస్తవికంగా సౌకర్యం, విలాసం మరియు పర్ఫామెన్స్ పరంగా ఈ లగ్జరీ సెలూన్ మరో లెవల్‌ను చేరుకుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 4, 2018, 21:09 [IST]
English summary
Read In Telugu: 2018 Mercedes-AMG E63 S Launched In India At Rs 1.50 Crore: The Most Powerful AMG In The Country
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+